WGL: నల్లబెల్లి మండలానికి చెందిన సంతోష్ ఇటీవల MHBD జిల్లా కొత్తగూడలో తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. వెంటనే MHBD పోలీస్ స్టేషన్లో సంతోష్ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా ఫోన్‌ను కనుక్కొని, శనివారం సంతోష్‌కు అందజేశారు. ఫోను పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.