ప్రకాశం: రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రజలకు దీపావళి భద్రతపై అవగాహన కల్పించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. ఈ మేరకు ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులతో ఐజీ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్థికనేరాలలో టాప్ 10 ముద్దాయిలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారురాత్రీ పగలు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు.