కోనసీమ: రాయవరం మండలం కొమరిపాలెం శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్వర్క్స్ జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన సోమేశ్వరం గ్రామానికి చెందిన పాక అరుణ, వాసంశెట్టి విజయలక్ష్మిల కుటుంబ సభ్యులను శనివారం మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పరామర్శించారు. అనుకోని సంఘటనతో కొన్ని కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోవడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.