GNTR: కొల్లిపర మండలం అత్తోట గ్రామంలో శనివారం మధ్యాహ్నం సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా సీమంతం నిర్వహించారు. గర్భిణులకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. సీడీపీవో విజయ్ గౌరీ తదితరులున్నారు.