HYD: దీపావళి నేపథ్యంలో పటాకుల దుకాణాలు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఉత్తర మండల డీసీపీ రష్మి పెరుమాల్ ఆదేశించారు. వ్యాపారులతో ఆమె అవేర్నెస్ సమావేశం నిర్వహించారు. అనుమతి పొందిన ప్రదేశాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేయాలని, అగ్ని నిరోధక పదార్థాలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, పొడి ఇసుక తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. లేకపోతే లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.