NGKL: జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన-పప్పు ధాన్యాల స్వావలంబన మిషన్ను శనివారం కలెక్టర్ బి.సంతోష్ ప్రారంభించారు. రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఈ పథకం కీలక పాత్ర వహిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. డీసీసీబీ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి రైతులు పప్పు దినుసుల సాగును పెంచాలని కోరారు.