PDPL: యైటింక్లయిన్ కాలనికార్పోరేషన్ పరిధిలోని 8వ కాలనీలో క్వా.నెం.ఎస్.టి2-2041 క్వార్టర్ లో నివసించే జోగు కొమురమ్మ (48) రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించగా కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. కొమురమ్మ నేత్రాలను దానం చేస్తే, ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించవచ్చని కుటుంబ సభ్యులకు, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి అవగాహన కల్పించారు.