WGL: జిల్లా కేంద్రంలో శనివారం MRPS, MSP ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MSP జాతీయ నాయకుడు, WGL జిల్లా ఇన్ఛార్జ్ ఆనందరావు మాదిగ హాజరై, మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు సీజే గవాయిపై దాడి చేసిన న్యాయవాదిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని, కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో MRPS, MSP ముఖ్య నేతలు ఉన్నారు.