ADB: అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై పోరాడుదామని CITU గౌరవ అధ్యక్షులు దర్శనాల మల్లేష్ అన్నారు. పట్టణంలోని జిల్లా కార్యాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా 10వ మహాసభలను శనివారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలంబిస్తున్న ఐసీడీఎస్ వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలకు అంగన్వాడీల సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.