VZM : రాహుల్ గాంధీకి మద్దతుగా ఓట్ చోర్- గద్దే చోడ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా డీసీసీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ప్రజల మద్దతుతో సంతకాల సేకరణ శనివారం చేపట్టారు. దేశంలో ఓట్ల చోరీ జరిగిందని, దొంగ ఓట్లతో గెలిచిన ప్రధాని మోడీ వెంటనే గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో తప్పులను సరి చేయలన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, బీవీ రమణ పాల్గొన్నారు.