TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామిని బాంబే హై కోర్ట్ జడ్జి జస్టిస్ అద్వైత్ సేత్నా కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను అందజేశారు.