ATP: డి.హిరేహాల్ మండలంలోని గొడిశలపల్లికి చెందిన ఉండాల హనుమంత రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుంచి ఆస్ట్రాలజీ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆస్ట్రాలజీ ద్వారా ఎంతో మందికి సేవలందిస్తున్న హనుమంత రెడ్డి రాయదుర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా ఉన్నారు. ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే డాక్టరేట్ పొందారు.