RR: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మైత్రిపురం మహిళామండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేనేత హస్తకళా ప్రదర్శన-అమ్మకాలను మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంట్లో నుంచే వ్యాపారం చేసుకునే మహిళలకు, స్వయంఉపాధి పొందాలనుకునే వారికి ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.