SKLM: గ్రంథలయ మాజీ ఛైర్మన్ పైడి సత్య ప్రసాద్ బౌతిక దేహానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ నివాళులర్పించారు. పాలకొండలో ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కూన రవికుమార్ మాట్లాడుతూ.. సత్య ప్రసాద్ గారు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం తీరనిలోటు అని తెలిపారు.