RR: మధ్యతరగతి, పేదవిద్యార్థులు పెద్దపెద్ద కాలేజీలో చదువుకోడానికి పెట్టిన స్కీం ఫీజు రియంబర్స్మెంట్ అని MP ఈటల అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం సెంట్రల్ దగ్గర విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, బకాయిలు విడుదల చేయాలని జిల్లా BJP కార్యదర్శి చేపట్టిన 48 గం.ల నిరాహార దీక్షకు MP మద్దతు తెలిపారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.