Nani : దసరా సినిమా కోసం దేశమంతా తిరిగి.. భారీ ఎత్తున ప్రమోషన్స్ చేశాడు నాని. అందుకు తగ్గట్టే టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఉండడంతో.. అంచనాలు పెరిగిపోయాయి. ఫైనల్‌గా మార్చి 30న.. అసలైన దసరాకు ఆరు, ఏడు నెలల ముందే.. సమ్మర్లోనే దసరా పండగ చేసుకున్నాడు నాని.
దసరా సినిమా కోసం దేశమంతా తిరిగి.. భారీ ఎత్తున ప్రమోషన్స్ చేశాడు నాని. అందుకు తగ్గట్టే టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఉండడంతో.. అంచనాలు పెరిగిపోయాయి. ఫైనల్‌గా మార్చి 30న.. అసలైన దసరాకు ఆరు, ఏడు నెలల ముందే.. సమ్మర్లోనే దసరా పండగ చేసుకున్నాడు నాని. దాంతో నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రావడం ఖాయమని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎస్.ఎల్.వి. సినిమా బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీతో.. శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. అయినా కూడా ఓవర్సీస్లో నాని బాక్సాఫీస్ లెక్కలు మారిపోయాయి. యుఎస్ బాక్సాఫీస్ దగ్గర దసరా ప్రీమియర్ గ్రాస్ 6 లక్షల డాలర్స్‌ను రాబట్టుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఓ స్టార్ హీరోకి వచ్చే కలెక్షన్స్ రేంజ్లో ఉండడంతో.. యూఎస్‌లో నాని మార్కెట్ భారీగా పెరిగిందంటున్నారు. దసరా మూవీ నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమంటున్నారు. ఇదిలా ఉంటే.. దసరా సినిమా కోసం నాని, కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. నాని దాదాపు 15 కోట్లు, కీర్తి సురేష్ 2 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారనే ప్రచారం నడుస్తోంది. నాని కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ అండ్ బిజినెసే కాదు.. రెమ్యూనరేషన్ కూడా ఇదే ఎక్కువ అని అంటున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిస్తే.. నాని పారితోషికం మరింతగా పెరగనుందనే టాక్ నడుస్తోంది. నెక్స్ట్ సినిమా కూడా కొత్త దర్శకుడితోనే చేస్తున్నాడు నాని. అందుకోసం ఏకంగా 20 కోట్లకు పైగా అందుకుబోతున్నట్టు టాక్. మరి దసరా మూవీ నానికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.