ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా సినీ నటుడు మంచు విష్ణు దుబాయ్లో చిక్కుకుపోయాడు. ఈ నేపథ్యంలో, తన కుటుంబం సురక్షితంగా ఉన్నట్లు విష్ణు తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పటికీ బాంబుల శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ, ఇక్కడ జనజీవనం ప్రస్తుతం సాధారణంగానే ఉందంటూ ట్వీట్ చేశాడు. పరిస్థితులు చక్కబడిన వెంటనే వీలైనంత త్వరగా ఇండియాకు తిరిగి వస్తామని పేర్కొన్నాడు.