పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘రాజాసాబ్’. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై మాళవిక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలిపింది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది.