ఆదిపురుష్ టీజర్ పై ట్రోలింగ్ ఎలా జరిగిందో.. జరుగుతుందో చూస్తునే ఉన్నాం. ఎన్నో వివాదాలు.. కోర్టు కేసులు.. ఆదిపురుష్‌ను చుట్టుముడుతునే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఒకే ఒక్క టీజర్‌తో ఆదిపురుష్ సినిమాను అంచనా వేయొద్దనేది.. దర్శక, నిర్మాతలు మాట. కానీ ఇప్పటికే టీజర్‌తో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ప్రభాస్ రాముడి లుక్‌తో పాటు సైఫ్ అలీఖాన్ రావణుడి లుక్ పై తీవ్ర విమర్శలొచ్చాయి.
ముఖ్యంగా గాఫిక్స్ విషయంలో ఓంరౌత్‌పై మండిపడ్డారు అభిమానులు. అందుకే ఆదిపురుష్ త్రీడీ టీజర్‌ను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయినట్లు సమాచారం. దాంతో ఆదిపురుష్ అవుట్ పుట్ పై నిర్మాత భూషన్ కుమార్ ఫుల్లుగా ఇంప్రెస్ అయ్యారట. అందుకే దర్శకుడు ఓం రౌత్‌కు కాస్ట్లీ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు బీ టౌన్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
దాదాపు నాలుగు కోట్ల విలువ చేసే ఫెరారీ ఎఫ్8 కారును ఓంరౌత్‌కు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఓం రౌత్ ఈ కారులోనే చక్కర్లు కొడుతున్నాడట. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ ఊహకందకుండా పోతోంది. టీజర్ చూస్తేనేమో యానిమేటెడ్ ఫిల్మ్‌లా ఉందని అంటున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ చేసిన పనేమో రివర్స్‌లో ఉంది. ఏదేమైనా ఆదిపురుష్ కాస్ట్లీ గిఫ్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.