మొదలుకే మోసం వచ్చింది. కన్నప్ప సినిమాకి సంబంధించి ముంబైలో విఎఫ్ఎక్స్లు పూర్తి చేసుకుని రెడీ అయిన హార్డ్ డ్రైవ్ ఏదైతే ఉందో అది చాలా విచిత్రంగా ఉంది. పరిశ్రమంతా గుప్పుమంది. కన్నప్ప టీం గొల్లుమంటున్నారు. అసలెవడయ్యా బాబూ...ఆ హార్డ్ డ్రైవ్‌ని దొంగిలించిన ఘనుడు ఎవడు ఇదీ ఇప్పుడు హాట్ టాపిక్ ఇండస్ట్రీలో.
గోవిందా గోవిందా….మొదలుకే మోసం వచ్చింది. కన్నప్ప సినిమాకి సంబంధించి ముంబైలో విఎఫ్ఎక్స్లు పూర్తి చేసుకుని రెడీ అయిన హార్డ్ డ్రైవ్ ఏదైతే ఉందో అది చాలా విచిత్రంగా ఉంది. పరిశ్రమంతా గుప్పుమంది. కన్నప్ప టీం గొల్లుమంటున్నారు. అసలెవడయ్యా బాబూ…ఆ హార్డ్ డ్రైవ్‌ని దొంగిలించిన ఘనుడు ఎవడు ఇదీ ఇప్పుడు హాట్ టాపిక్ ఇండస్ట్రీలో.
అంతుబట్టని ఈ రహస్యం వెనుక ఎవరో ఉన్నారు, కన్నప్ప విజయాన్ని అడ్డుకోవాలని, తాను గొప్పవిజయం సాధించబోతున్నానని అక్కసుతో, అసూయతో ఎవరో బాగా తెలిసినవారే ఈ దొంగతనానికి పాల్పడ్డారని మంచు విష్ణు రంకెలు వేస్తున్నాడంట. ప్రభాస్ సీన్లే విఎప్ఎక్స్ పూర్తయి ఆ హార్డ్ డ్రైవ్‌లో ప్యాక్ అయ్యాయి. పైగా బోలెడు ఖర్చు. అందరిలా కాదు. ప్రభాస్ అంటే మరింత ఖర్చు.ప్రభాస్ డూప్ ఖర్చు అదనం. ఫ్లైట్లు, హోటళ్ళు, ఫుడ్…అంతా ఫస్ట్ క్లాస్ ట్రీట్మెంట్. పైగా అతనేమో ప్రభాస్ కన్నా బిజీ. ఒక దేశం నుంచి మరొక దేశానికి ఒకటే పరుగు. డే అండ్ నైట్ వర్క్.
ఇప్పడు ఏం చెయ్యాలి? కిం కర్తవ్యం. మంచు విష్ణు పూర్తిగా దెబ్బ తినేశాడని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. కొందరైతే బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. బుర్రుండాలి, ప్రభాస్ అంత కాస్ట్లీ వ్యవహారం కదా, ఒంటి మీద తెలివి పెట్టుకోవాలి కదా….అలా ఇష్టమొచ్చినట్టు పారేసుకుంటారా…లేదా ఎవడో దొంగిలించుకుపోతుంటే చూసేవాడే లేడా, ఉంటే పడుకున్నాడా అని సినిమాపెద్దలు కసురుకుంటున్నారు.
అయితే ఇలా అయిన సందర్భం గతంలో కూడా లేకపోలేదు. అప్పుడు ఆ నిర్లక్ష్యం వల్లే జరిగింది. విక్టరీ వెంకటేష్, కోడి రామకృష్ణ కాంబోలో ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు నిర్మించిన దేవీపుత్రుడు రిలీజ్ ముందు కూడా ఇదే జరిగింది. తెల్లవారితే సంక్రాంతి. దేవీపుత్రుడు రిలీజ్. పక్కనే మృగరాజు నరసింహనాయుడు రిలీజులు. కోడిరామకృష్ణ అయ్యప్పమాలలో ఉన్నారు. ఆరోజే శబరిమల వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆంధ్ర, సీడెడ్, నైజాం డిస్ట్రిబ్యూటర్లు అందరూ రామానాయుడు ల్యాబ్ దగ్గర జాగరణ చేస్తున్నారు. ఎడిటర్ తాతా రమేష్. క్లైమాక్సులో ప్రత్యక్షమయ్యే అమ్మవారు సీను చాలా కీలకమైంది సినిమాలో. 14వ రీలు అనమాట. ఆ రీలే కనిపించలేదు. ఎడిటర్ తాతా రమేష్ హార్ట్ పేషంట్. పేస్ మేకర్ కూడా పెట్టారు. రీలు కనిపించకపోగానే నిర్మాత ఎమ్మెస్ రాజు మండిపడ్డారు. రమేష్ టెన్షన్లో ఫెయింట్ అయిపోయాడు. పెద్ద గొడవ అయిపోయింది ల్యాబ్‌లో. పక్కనే ఉన్న టేబుల్ కింది ఇడ్లీ ప్యాకెట్‌తో పాటు పడి ఉంది 14వ రీలు. అప్పడు అది గబుక్కున తీసుకుని జాయిన్ చేసి ప్రింట్ రెడీ చేశారు. అప్పుడు రిలీజు టెన్షన్.
ఇప్పుడు టెన్షన్ మళ్ళీ మొత్తం సీజీలు చెయ్యాలి. డబ్బు, టైం, పని, శ్రమ…వీటన్నిటితో పాటు చెడ్డపేరు. అప్పుడంటే సోషల్ మీడియా అన్నదే తెలీదు. ఇప్పుడా ఇంకేముంది? అంతా బట్టబయలు. మొత్తం ప్రపంచమంతా పొక్కింది. కన్నప్ప గొల్లుమంటున్నాడు.