బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా నటించిన ‘డాన్’ 2006లో విడుదలైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక.. ఈ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఈ మూవీ సెట్లోకి అడుగుపెట్టిన తర్వాత కొన్ని విషయాలు తెలుసుకున్నా. నా పనిపై నేను ఫోకస్ పెట్టాలని, తోటి నటీనటులు, దర్శకులతో ఉన్న రిలేషన్‌ను మర్చిపోవాలని అర్థమైంది. డాన్ కోసం ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నా. రక్తం చిందించిన సందర్భాలు ఉన్నాయి’ అని తెలిపింది.