ఈ మధ్య బాలీవుడ్ సినిమాలన్నీ వరుసపెట్టి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇలాంటి సమయంలో దాదాపు 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో.. విజువల్ వండర్‌గా తెరకెక్కిన బ్రహ్మాస్త్ర పార్ట్ వన్.. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను.. కరణ్ జొహార్ ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించారు.
ఇక సౌత్ భాషల్లో రాజమౌళి సమర్పణలో రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర.. ఫస్ట్ డే 75 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు మొత్తంగా 160 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రకటించారు మేకర్స్. ఇక మూడో రోజు 90 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను అందుకున్నట్టు టాక్. ఒక్క హిందీలోనే 110 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. దాంతో ఈ మధ్యలో కాలంలో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన బాలీవుడ్ సినిమాగా బ్రహ్మాస్త్ర నిలిచిందని అంటున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోను బ్రహ్మాస్త్రకు భారీగానే కలెక్షన్లు వస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో బ్రహ్మాస్త్ర సెకండ్ పార్ట్‌లో ఓ ఇద్దరు స్టార్ హీరోలు నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ వర్గాల ప్రకారం పార్ట్ 2లో హృతిక్ రోషన్ లేదా రణవీర్ సింగ్ కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే బ్రహ్మాస్త్ర పార్ట్ 2 భారీ స్టార్ క్యాస్టింగ్‌తో రాబోతోందని చెప్పొచ్చు. మరి మొత్తంగా బ్రహ్మాస్త్ర ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి.