Bigg Boss Telugu 7 is likely to be extended by one more week
Bigg Boss Telugu 7: తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకోగా, ఏడో సీజన్ రంజుగా సాగుతోంది. ఇప్పటివరకు 10వారాలు పూర్తి చేసుకుంది. సీజన్ ని ఆసక్తికరంగా చేసేందుకు బిగ్ బాస్ టీమ్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఉల్టా, పుల్టా పేరుతో చాలా రకాల ట్విస్టులు ఇచ్చారు. మరో ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ 7 తెలుగు దీపావళి ఎపిసోడ్ అద్భుతమైన డ్యాన్స్ పర్ ఫార్మెన్స్, ఫ్యామిలీ మీట్‌తో ఆసక్తికరంగా సాగింది. బిగ్ బాస్ 7 తెలుగు 15 వారాల పాటు జరిగేలా ప్లాన్ చేశారు. సీజన్లో పది వారాలు పూర్తయ్యాయి. బిగ్ బాస్ హౌస్‌లో 10 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. చివరి వారంలో టాప్ 5 కంటెస్టెంట్లు మాత్రమే ఉండాలి.
మరో నాలుగు వారాల్లో ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావాలి. సంచలన విషయం ఏమిటంటే, బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్‌ను మరో వారం పాటు పొడిగించాలని యోచిస్తున్నారట. దానికి తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారట. పైన చెప్పినట్టుగా బిగ్ బాస్ తెలుగు గత సీజన్‌తో పోలిస్తే భారీ విజయాన్ని సాధించింది. కంటెస్టెంట్స్‌కి ఓటింగ్ శాతం తేడాలు దగ్గర అవుతున్నాయి. పది ఎపిసోడ్ల తర్వాత కూడా వీక్షకులు కూడా విజేత ఎవరో తేల్చుకోలేకపోతున్నారు.
మరో వారం రోజులు పొడిగిస్తే సీజన్‌కు మంచి స్పందన రావడంతో యాజమాన్యానికి ప్రయోజనం చేకూరుతుంది. సీజన్ పొడిగించొద్దు అనుకుంటే.. ఒకే ఛాన్స్ ఉంటుంది. ఒక వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మరో వారం పొడిగించేందుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.