For the first time, Bigg Boss Telugu has a grand finale week elimination
Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) ఏడో సీజన్ రంజుగా సాగుతోంది. ఈ సీజన్లో కొత్త థీమ్, గేమ్స్ తీసుకొచ్చారు. బిగ్ బాస్ తెలుగు 7కి (Bigg Boss Telugu) సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. తొలిసారిగా బిగ్ బాస్ తెలుగులో గ్రాండ్ ఫినాలే వీక్ ఎలిమినేషన్ జరగనుంది. బిగ్ బాస్ మునుపటి అన్ని సీజన్లలో, ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఫైనల్ వారంలోకి ప్రవేశించారు. చివరి రోజు వరకు ఉన్నారు.
ఈసారి బిగ్ బాస్ తెలుగు 7లో 6 మంది కంటెస్టెంట్లు ఫైనల్ వీక్‌లోకి ప్రవేశించగా, తొలిసారిగా బిగ్ బాస్‌లో ఫైనల్ వీక్‌లో ఎలిమినేషన్ జరగనుంది. బుధవారం ఎలిమినేషన్ జరగనుందని సమాచారం. ఎలిమినేషన్లో డేంజర్ జోన్ పోటీదారులు అర్జున్ అంబటి, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్ ఉన్నారు. మరి టాప్ 5లో ఉండే ఛాన్స్ ఎవరు మిస్ అవుతారో చూడాలి. మిగతా ఐదుగురు కంటెస్టెంట్లు గత సీజన్ల మాదిరిగా ఫైనల్ డేకి వెళ్తారు. బిగ్ బాస్ తెలుగు 7 ఫైనల్ ఎపిసోడ్ ఆదివారం డిసెంబర్ 17వ తేదీన ప్రసారం కానుంది.