»Big Honor For Oscar Winners Keeravani And Chandra Bose
RRR : ఆస్కార్ విజేతలు కీరవాణి, చంద్రబోస్‌లకు ఘన సన్మానం
ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఆస్కార్ అవార్డు(Oscar award)ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాట(Natu Natu song)కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వరించింది. తాజాగా ఆస్కార్ విజేతలకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ఆస్కార్ విజేతలు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి(MM Keeravani), చంద్రబోస్ (Chandrabose)లను మంత్రులు ఘనంగా సత్కరించారు.
ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఆస్కార్ అవార్డు(Oscar award)ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాట(Natu Natu song)కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వరించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆర్ఆర్ఆర్ కు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు రావడం తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయం. తాజాగా ఆస్కార్ విజేతలకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ఆస్కార్ విజేతలు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి(MM Keeravani), చంద్రబోస్ (Chandrabose)లను మంత్రులు ఘనంగా సత్కరించారు.
సన్మాన కార్యక్రమంలో మాట్లాడున్న చంద్రబోస్:
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..నాటు నాటు సాంగ్ (Natu Natu Song)కు ప్రతిష్టాత్మక అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. బాహుబలి సినిమాకు ఆస్కార్(Oscar) రావాలి కానీ ఆర్ఆర్ఆర్(RRR)కు వచ్చిందన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా(Pan India) సినిమా భారీగా పెరుగుతున్నాయని, ఇది ఎంతో శుభ పరిణామమని తెలిపారు.
సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంఎం కీరవాణి:
సినీ పరిశ్రమలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా సినిమాలు రావడం గొప్ప విషయమన్నారు. ఆస్కార్ విజేతలు(Oscar winners) అయిన ఎంఎం కీరవాణి, చంద్రబోస్ లను దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli)తో పలువురు ప్రముఖులు ప్రశంసించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరపున సన్మానం అందుకోవడం ఆనందంగా ఉందని సన్మాన గ్రహీతలు కీరవాణి(MM Keeravani), చంద్రబోస్(Chandrabose) తెలిపారు.