Bheemadevara Pally Branchi: చిన్న సినిమాలు ఎలా దుమ్ముదులుపుతున్నాయో ఈ మధ్య చూస్తూనే ఉన్నాము. అచ్చమైన పల్లేటూరి కథతో వచ్చిన సినిమాలు అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో దుమ్ములేపుతున్నాయి. అలాంటి అచ్చమైన విలేజ్ కథ భీమదేవరపల్లి బ్రాంచి(Bheemadevara Pally Branchi). కొండలు గుట్టలు, పచ్చని పొలాల ఏరియల్ షాట్ తో సినిమా ఓపెన్ అవుతుంది. కొండల మీద నుంచి మెళ్లిగా పాన్ చేస్తూ గ్రామాన్ని చూపిస్తారు. స్వరూపను వెతుకుతూ జంపన్న ఓ ఇంటి దగ్గరకు వస్తాడు. తనను వెతుకుతూ ఇళ్లంతా చూస్తాడు. మరో గదినుంచి స్వరూప వస్తుంది. వాళ్లిద్దరు భార్యభర్తలు. కేంద్రం జన్దన్ యోజన పథకం కింద బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలని, ఆధార్ కార్డు, పాస్ ఫోటోలతో జంపన్న తల్లి, భార్యతో బ్యాంక్ కు బయలు దేరుతాడు. తీరా బ్యాంక్ కు వెళ్లే సరికి అక్కడ చాలా మంది లైన్ లో ఉంటారు. సమక్క ముందు నిలబడుదామని వెళ్తుంటే సూజత అనే మహిళా గొడవ పెట్టుకుటుంది.
ఊర్లో ఫ్రీ ఖాతా ఓపెన్ చేస్తున్నారని రాకేష్ అనే బార్బర్ బ్కాంక్ ముందే షేవింగ్ చేస్తుంటాడు. అది చూసి జంపన్న రాకేష్ ను మందలిస్తే.. పుణ్యానికి ఖాతా ఇస్తున్నారంటే నీ లాంటోళ్లు చాలా మంది వస్తారని ఈడనే షేవింగ్ చేస్తున్న అని చెప్తాడు. అట్లనే తన భార్యకు, అమ్మకు కూడా ఖాతా తీపిస్తా అని అంటాడు. దానికి నీ పనే బాగుంది కదరా అని జంపన్న అంటాడు. వెంటనే రాకేష్ తనకు బాకీ ఉన్న గడ్డం, క్షవరం డబ్బులు అడుగుతాడు. దానికి జంపన్న ఇప్పుడే ఖాతా తీస్తున్న కదరా.. డబ్బులు పడగానే ఇస్తా అని చెప్తాడు. వీళ్ల మాటలు విన్న భార్య ఊర్లో అడ్డం అయినోళ్లదగ్గర అప్పులు చేస్తావు అని జంపన్నను తిడుతుంది. అంతలోనే అక్కడికి కోతి శంకరయ్య (కేతిరి సుధాకర్ రెడ్డి) వచ్చి. జంపన్న నువ్వు కూడా వచ్చినవా అని అడగ్గా పెళ్లం లేచిపోయినోనివి నువ్వే రాంగ లేంది. నేనే రానా అని అంటాడు జంపన్న. నీ పెళ్లం పోకుండా చూసుకో అని అనే సరికి జంపన్న భార్య శంకరయ్యతో గొవడపడుతుంది.
చదవండి:Shocking.. రతికతో కిరణ్ అబ్బవరం పెళ్లి, బాబు ఎందుకంత పగ!
కట్ చేస్తే.. బ్యాంక్ లేడీ ఆఫీసర్ తో తిక్క శంకరయ్య ఇంకా తాను సింగిల్ అని, డబ్బులు పడగానే పెళ్లి చేసుకోవాలి అని చెప్పడంతో ఆ లేడీ షాక్ అవుతుంది. తరువాత జంపన్న, తల్లి, భార్యల బ్యాంక్ ఖాాతా ఓపెన్ చేస్తారు. తెలంగాణ సంస్కృతి అయినా భోనాలు, జాతారా పాటతో టైటిల్స్ పడుతుంటాయి.
టైటిల్స్ అయిపోగానే ఇద్దరు చాకలి వాళ్లు బట్టలు ఉతకడానికి బట్టలు వేయమని రాణిని అడగ్గా.. పండగరోజు ఇంట్లో భోజనం చేసి వెళ్లమని చెప్తుంది. మరో సీన్లో సూజత తన బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పైసల కోసం గిరికి 5 వేలు ఇచ్చిన విషయం మాట్లాడుతుంది. తన బిడ్డ పేరు సర్టిఫికట్ లో ఒక తీరుగా, పెళ్లి పత్రికలో ఒక తీరుగా ఉందని కల్యాణ్ లక్ష్మీ రావలంటే మరో 5 వేలు కావాలంటాడు. మరో సీన్లో తిక్క శంకరయ్య మటన్ కొట్టే వాడిని ఏదో తింగరి మాట అంటారు. ఇలా సరాదాగా సాగిపోతుంది. తరువాత సీన్లో కావేరి తన చిన్నప్పుడే వాళ్ల నాన్న తాడిచెట్టునుంచి పడి చనిపోయినట్లు వాళ్ల అమ్మ రాణి గౌడ్ కష్టపడి చదివిచ్చిన విషయం సుజాత కావేరి తల్లితో అంటుంది.
కట్ చేస్తే ఉదయం అవుతుంది. చెరువు గట్టు దగ్గర, కల్లు తాగే దగ్గర, మహిళలు గాజులు పెట్టుకునే దగ్గర, టీ కొట్టు దగ్గర అన్ని చోట్ల జన్ దన్ ఖాతాలో డబ్బులు పడ్డాయా, ఎప్పుడు పడుతాయి అని మాట్లాడుకుంటారు. తరువాత సీన్లో రాకేష్ బార్బర్ షాప్ లో కూడా అందరు డబ్బుల గురించి మాట్లాడుకుంటారు. అందరు డబ్బులు పడగానే డబ్బులు ఇస్తాను అనడంతో రాకేష్ వాళ్లకు కటింగ్ చేయకుండా వారితో గొడవ పెట్టుకుంటాడు.
నెక్ట్స్ సీన్ లో జంపన్న కోసం సీను అనే వ్యక్తి వచ్చి డోర్ ను కొడుతుంటే స్వరూప వచ్చి డోర్ ను ఎందుకు అంత గట్టిగా కొడుతున్నావు అని అడుగుతుంది. జంపన్న తన దగ్గర 20 వేలు అప్పు చేసిన విషయం చెప్తాడు. దానికి సీనునే తిట్టి పంపిస్తారు జంపన్న భార్య, తల్లి.
తరువాత సీన్ లో జంపన్న 5 వేలకోసం శివ అనే అతనితో ఊరి సర్పంచ్ ముందే గొడవ పడుతాడు. అభి వాళ్ల నాన్న గొడవ తీర్చి, వాళ్ల ఓట్లకోసం ఆ 5 వేలు తానే ఇచ్చి పంపిస్తాడు. నెక్ట్స్ సీన్లో ఇంట్లో అభి ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటాడు. రాణి గౌడ్ ఇంటికి పోయి కళ్లు తీసుకురా అని అభికి వాళ్ల నాన్న చెప్పి, పని ఉందని తాను బయటకు వెళ్తాడు. అభి ఎప్పటినుంచో కావేరిని ఇష్టపడుతుంటాడు. కట్ చేస్తే అభి కల్లు కోసం కావేరి ఇంటికి వెళ్తాడు. అక్కడ కావేరి అభి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని సిగ్గు పడుతారు. వాళ్లిద్దరు ఇకర్ని ఒకరు ఇష్టపడుతుంటారు. రాణి బాటిల్ కల్లు నింపుతుంది. అభికోసం కావేరి ఒక థమ్సప్ తీసుకొస్తుంది. సగం తాగిన తరువాత ఆ థమ్సప్ తీసుకొని కావేరి తాగుతుంది.
కట్ చేస్తే జంపన్న ఇంటో పల్లు తొముకుంటు ఉంటాడు. తల్లి కూరగాయలు కట్ చేస్తుంది. అంతలో ఫోన్ కు ఒక మేసేజ్ వస్తుంది. అది ఇంగ్లీష్ లో రావడంతో అక్కడ సీను కామెడీగా ఉంటుంది. ఆ మేసేజ్ గురించి ఊరిలో ఎవరినైనా అడిగి వస్తా అని వెళ్తుండగా దారిలో గిరి కనిపిస్తాడు. అతనికి తన ఫోన్ ఇచ్చి చూడమంటాడు. ఖాతాలో డబ్బులు పడినట్లు అకౌంట్లో 15 లక్షలు పడిన విషయం చెప్పి ఏటీఎమ్ దగ్గరకు వచ్చి డబ్బులు చెక్ చేస్తారు. నిజంగానే డబ్బులు వచ్చినట్లు తెలుసుకొని ఒక 50 వేలు డ్రా చేస్తాడు జంపన్న. ఆ డబ్బులతో కొత్త బట్లలు, కళ్లజోడు, టీవీఎస్ ఎక్స్ఎల్ బండితో దసరా బుల్లోడు మాదిరి తయారై ఊర్లోకి వెళ్తాడు. ఊరంతా చూసి పరేషాన్ అవుతారు. కొత్త ఎక్స్ ఎల్ బండీ ఎసుకొని పగటేశగానిలా తయారై ఇంటికి వెలితే, తల్లి గుర్తుపట్టదు. భార్య చిపురు మడతపెట్టి… ఆ లోపు అతను కళ్లద్దాలు తీసి తానే జంపన్న అని చెప్తాడు. స్వరూపకు బోటి కూర ఇచ్చి మంచిగ వండమని చెప్పి మళ్లీ ఊర్లోకి వెళ్తాడు.
5 వేల కోసం గొడవపడిన శివకు 6 వేల రూపాయాలు ఇచ్చి మీ ఇంట్లో ఎవరన్న సచ్చిపోతే డప్పుకొట్టను డబ్బే కొడుతా అని డైలాగ్ కూడా అంటాడు. కట్ చేస్తే నెక్ట్స్ సీన్లో ఇంట్లో జంపన్న మందు తాగుతుంటాడు. తల్లి, భార్య ఇద్దరు అన్నం తింటుంటారు. మన బతుకులు మారినాయి అని వాళ్లతో చెప్తాడు. మనం ఇప్పుడు లక్షాధికారులమని సర్కారొళ్లు అకౌంట్లో డబ్బులు వేసిన విషయం చెప్తాడు. పొద్దున్నే శ్రీను ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకొని మరి డబ్బులు అతని మొఖాన కొట్టి వస్తాడు జంపన్న. 20 వేలకు మిత్తితో సహా మొత్తం 30 వేలు ఇస్తాడు.
తరువాతి సీన్లో రాణి ఇంట్లో తిక్క శంకరయ్య, రాకేష్, మొండయ్య ఇంకా గ్రామస్తులు కల్లు తాగుతుంటారు. అక్కడికి జంపన్న జోరుదారుగా తయారై వస్తాడు. అది చూసి రాణి ఈ సోకులకు ఏం తక్కువలేదు బాకీ పైసలు ఇస్తే గాని కల్లు పోయను అంటుంది. దానికి మొత్తం బాకీ ఎంత అని అడిగి మూడు వేలకు ఆరు వేలు ఇచ్చి చుట్టాలు వస్తే కల్లుపొయ్యాలి అని అని చెప్తాడు. అలాగే రాకేష్ కటింగ్ డబ్బులను కూడా వెయికి రెండు వేలు ఇస్తాడు. కల్లు తాగరాదు అంటే నేనూ కల్లు తాగుతనా.. వందపైపుల మందు తాగుతా అని చెప్తాడు. అందరూ జంపన్న గురించి మాట్లాడుకుంటారు.
తరువాత సీన్లో కావేరి అభికి కాల్ చేస్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటారు. అభి కరీంనగర్ వెళ్లినట్లు చెప్తాడు. అలా వారు చాలా సేపు మాట్లాడుకుంటారు. మరో వైపు జంపన్న ఎచ్చిడి ఏశాలు ఎక్కువ అవుతాయి. భాగ్యం దగ్గరకు వెళ్లి తన ప్రేమ గురించి మాట్లాడుతాడు. పెళ్లి చేసుకుంటా అని భాగ్యం చేయిపట్టుకొని అల్లరి చేసి అందరితో దెబ్బలు తింటాడు. తరువాతి సీన్లో స్వరూప కూడా రిచ్ గా తయారై పట్టుచీర, నగలు వేసుకొని ఇంటికి ఆటోలో కొన్ని సమాన్లు కొనక్కొని వచ్చి హడావిడి చేస్తుంది. అంతలో జంపన్న దెబ్బలతో ఇంటికి వస్తాడు. ఆ సీను చాలా కమెడీగా ఉంటుంది.
జంపన్నకు ఆ డబ్బులు ఎక్కడనుంచి వచ్చాయి అని గ్రామస్తులందరూ మాట్లాడుకుంటారు. జంపన్న దొంగతనం చేసి ఉండొచ్చు అని తిక్క శంకరయ్య అనుమానపడుతాడు. దాన్ని నిజం అని అందరూ మాట్లాడుకుంటారు. అంతలో అక్కడికి గిరి వచ్చి మందుతాగుతాడు. జంపన్నకు డబ్బులు ఎక్కడినుంచి వచ్చినయో తెలుసా అని ఢిల్లీ నుంచి తానే ఫైరో చేయించినట్లు దానికి 50 వేలు ఖర్చు అయినట్లు వాళ్లకు చెప్తాడు. 50 వేలు ఇస్తే వారం తిరుగకముందే 15 లక్షలు ఇప్పిస్తా అని అందరికి చెప్తాడు. ఆ మాటలతో అందరూ కలిసి రాణికి డబ్బులు ఇప్పించాలని తాలా ఇంతా వేసుకుంటామని మాట్లాడుకుంటారు.
మరో సీన్లో అభి వాళ్ల నాన్న కూడా జంపన్నకు అన్ని పైసలు ఏడి నుంచి వచ్చినాయి అని మాట్లాడుకుంటారు. దానికి కేంద్రం నుంచి డబ్బులు ఆకౌంట్లో పడ్డట్లు మరో వ్యక్తి చెప్తాడు. 15 లక్షలు పడినట్లు అతనికి డబ్బులు ఇప్పించింది గిరి అని చెప్తాడు. అంతలో అభి బయటకు వెళ్తాడు, బ్యాంక్ కు సంబంధించిన పని అభికి వాళ్ల నాన్న చెప్తాడు. తనకు పని ఉందని చెప్తే అభి ఫాదర్ కోప్పడుతాడు. తరువాత సీన్లో కావేరి అభి కోసం తన స్నేహితురాలితో వెయిట్ చేస్తుంది. అంతలో అభి వస్తాడు. ఇద్దరు ఒక చోట మాట్లాడుకుంటారు. కావేరిని ఆట పట్టిస్తాడు అభి. తరువాత ఇద్దరు ఒకరి మీద ప్రేమను ఒకరు చెప్పుకుంటారు. అభికి కావేరి పొద్దాటు కల్లు బహుమతిగా ఇచ్చి ఇది తాగితే మంచిది అని చెప్తుంది. తరువాత పాట వస్తుంది. ఇద్దరు తమ ఫ్యూచర్, భవిష్యత్తును కల కంటుంటారు పాటలో.
తరువాత సీన్లో రాణి, తిక్క శంకరయ్య, సీను, రాకేష్ అందరు కలిసి గిరికి డబ్బులు ఇస్తారు. అతను ఢిల్లీకి వెళ్లి డబ్బులు వేయిస్తా అని గిరి వెళ్లిపోతాడు. ఆ సీన్లో వారి ముఖానా దుమ్ము పొగ వస్తున్న షాట్ తో సీన్ ఎండ్ అవుతుంది. నెక్ట్స్ సీన్లో లింగం ఊర్లో దిగుతాడు. అతను కూడా మరో గిరి లాంటోడు అని ఓపెనింగ్ సీన్లో అర్థం అవుతుంది. డబ్బులతో జంపన్న ఫోటోలు తీసుకుంటాడు. అక్కడికి లింగం వస్తాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. సాయంత్రం తాగుకుంటా మాట్లాడుకుందామనుకుంటారు. కట్ చేస్తే ఇద్దరు కలిసి మందేస్తుంటారు. ఢిల్లీలో పెద్ద సారుకు ఈ మైయిల్ పంపిస్తారు. ఈ సీన్లో జంపన్న ఢిల్లీ సారు ధన్యవాదాలు చెబుతూ మాట్లాడుతారు. అలా వాళ్లు తాగుకుంటూ మాట్లాడుకుంటారు. హైదరాబాద్ లో చోర్ బజార్ లో మొబైల్స్ కొని ఊర్లో అమ్మాలని ప్లాన్ చేసుకుంటారు. అకౌంట్లో ఉన్న డబ్బులు అన్ని కతం చేస్తుంటాడు జంపన్న. ఒక రోజు పొద్దున్నే వాళ్ల అమ్మ దందా వద్దు అని తిడుతుంది. తన బండిని తూడుచుకుంటూ జంపన్న తన ప్లాన్ చెప్తాడు. చెట్లమీద ఇస్తారాకులు కుట్టకు అని భార్య తిడుతుంది.
మరో వైపు గిరికి ఫోన్ చేస్తారు గ్రామస్తులు. రెండు రోజుల్లో డబ్బులు పడుతాయి అని అందరిని నమ్మిస్తారు. పెద్ద సారును ఊర్లోకి పిలుస్తా అని పొద్దాటి కల్లు తాపిస్తా అంటాడు. మరో వైపు గిరికి పైసలు ఇచ్చిన మొండయ్య తన గుడిసెను పీకేస్తుంటాడు. తన వైఫ్ వారిస్తే సర్కార్ డబ్బులు ఇస్తారు ఇల్లు కడుదామని చెప్తాడు.
నెక్ట్స్ సీన్లో జంపన్న జపాన్ ఫోన్లు, పెద్ద ఫోన్ కొంటే చిన్న సిమ్ ఉచితం అని షాప్ ఓపెన్ చేస్తాడు. మొదటి బోనిగా తిక్క శంకరయ్య ఒక ఫోన్ కొంటాడు. అలా ఊర్లో ఉన్నవారంతా డబ్బులు ఇచ్చి ఫోన్లు తీసుకుంటారు. తెచ్చిన ఫోన్లన్ని అమ్మేస్తాడు. ఇంటికి వచ్చి డబ్బులను లెక్కపెడుతాడు. భార్య గాజులు కావాలంటుంది, తల్లి బంగ్లా కడుదాం అంటుంది. పైసలు అన్ని పెళ్లానికే ఇస్తవా అని తల్లి గొవడపడుతుంది.
తరువాత సీన్లో కావేరి షాపు చూసుకొ అని చెప్పి రాణి తాళ్లళ్లకు పోతుంది. అదే సమయంలో అభి ఇంట్లోకి వస్తాడు. ఇద్దరి మధ్య రోమాంటిక్ సీన్ అంతలో ఒక ముసలావిడ చూస్తుంది. అంతలో అక్కడికి రాణి వచ్చి చూస్తుంది. కట్ చేస్తే ఊర్లో పంచాయితీ పెడుతారు.
అభి కావేరి ప్రేమించుకున్న విషయం చెప్పడంలో ఇద్దరికి పెళ్లి చేయాలని ఊర్లో పెద్దమనుషులు మాట్లాడుకుంటారు. అది అభి తండ్రికి నచ్చదు. అందరూ పెళ్లి చేయాలి అంటారు. ఊర్లో బీసీ ఓట్లు ఎక్కువున్నాయి అని ఒప్పుకుంటాడు. అయినా సరే పది లక్షల కట్నం, గట్టి దావత్ ఇయ్యాలి అని చెప్తాడు. దానిని కేంద్రం పైసలు ఇస్తుంది అని 10 లక్షలు, దవాత్ చేసే ఒప్పందం మీద పెళ్లి చేస్తా అంటుంది రాణి గౌడ్. జంపన్న మధ్యలో కలుగు చేసుకొని లక్షరూపాయాలను అడ్వాన్స్ కింద ఇయ్యమని వరపూజ అవుతుందని డబ్బులు ఇస్తాడు. రాణి సర్పంచ్ కు అభికి బొట్టు పెడుతుంది.
లింగం, జంపన్న ఇద్దరు ఒక బావి దగ్గరకు వస్తారు. అది పెట్రోల్ బావి అని తెలుసుకుంటారు. అది జంపన్న కొనాలి అనుకుంటాడు. ఆ భావి తిక్క శంకరయ్యది అని అతినితో భేరం చేయడానికి లింగం వెళ్లి 8 లక్షలకు ఒప్పిస్తాడు. అక్కడికే జంపన్నను పిలిపిస్తారు. ఒప్పందం కుదుర్చుకొని డబ్బులు ఇచ్చి పేపర్ల మీద సంతకాలు తీసుకొని సంతోషంతో జంపన్న వెళ్లిపోతాడు.
నెక్ట్స్ సీన్లో చాకలి మొండయ్య తాతా గిరికి ఫోన్ చేసి డబ్బుల గురించి అడుగుతాడు. సిగ్నల్ లేదని చెప్పడంతో చెట్టెక్కి కూర్చుంటాడు మొండయ్య. సర్పంచ్ తో జంపన్న తాను కొన్న బాయికి రోడ్లు వేయించమని చెప్తాడు. ఊర్లో అందరితో బిల్డప్ కొడుతూ ఉంటాడు. ఇంటికి వెళ్లగానే భార్య, తల్లి ఇద్దరు గొడవపడుతారు. జంపన్న కొన్న బావిలో పెట్రోల్ పడిందన్న నిజం చెప్తాడు. దాంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఉదయం జంపన్న స్నానం చేస్తుంటాడు. ఊర్లోకి కార్లు. వాటర్ ట్యాంకర్ వస్తుంటే అది అంబానీ పంపించినదే అని అందరూ సంతోష పడుతుంటారు. కార్లో వచ్చిన ఆఫీసర్లు జంపన్న ఇంటికి వస్తారు. వాళ్లను డబ్బులు అడుగాలి అని వీళ్లు ప్లాన్ చేసుకుంటుంటే.. వచ్చిన బ్యాంక్ ఆఫీసర్లు వేముల సమ్మక్క అనే అకౌంట్లో పడాల్సిన 15 లక్షలు వండ్లకుంట సమ్మక్క అనే అకౌంట్లో పడినాయి అన్న విషయాన్ని చెప్తారు. పొద్దున్నే డబ్బులు కట్టాలి అని లేదంటే పోలీసు స్టేషన్ లో వెళ్తారు అని చెప్పి నోటీసులు ఇచ్చి వేల్తారు. అందరూ షాక్ లో ఉంటారు. నెత్తి నోరు బాదుకుంటారు. ఏడుస్తారు.
కట్ చేస్తే జంపన్న కొన్న బావిలో పెట్రోల్ ఉందని దాన్ని తవ్విస్తే అది కూడా మోసం అని తేలుతుంది. లింగంకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. బావిలో రెండు బకెట్లు ఉంటాయి. మోసపోయిన విషయం తెలుసుకొని జంపన్న ఏడుస్తాడు. తిక్క శంకరయ్య ఇంటికి వెళ్లి లింగం గురించి చెప్తాడు. శంకరయ్యకు ఏం తెలియదు అని చెప్పడంతో జంపన్న ఏడుస్తాడు. ఇంటికి వెళ్తే భార్య కూడా ఏడుస్తుంది. ఇంట్లో పెట్టిన పైసలు ఎవరో దొంగతనం చేసిన విషయం చెప్తుంది. అంతలో వాళ్ల అమ్మ సమ్మక్క వచ్చి ముగ్గురు కలిసి తలలు బాధుకుంటూ ఏడుస్తారు. ఒక వైపు గిరికోసం అందరూ ఎదురుచూస్తూ ఒక చెట్టుకింద తలలు పట్టుకొని కూర్చుకుంటారు. అంతలో గిరికి ఫోన్ చేసి విషయం అడిగితే ఇంకా వాళ్లకు అబద్దం చెప్పి నమ్మిస్తాడు. ఇక దేవుడిని అడుగుదామని వెళ్తారు. శిగం ఊగే అవిడదగ్గరకు వెళ్లీ వాళ్ల బాధలు చెప్తారు. సమ్మక్కకు పొతానన్ని మొక్కితే డబ్బులు పడుతాయి అని చెప్తుంది.
సర్పంచ్ భోజనం చేస్తుంటాడు. జంపన్న, తల్లి, భార్యలతో వస్తాడు. కాళ్లావేళ్ల పడి ఆదుకో అని జంపన్న బతిలాడుతాడు. డబ్బులు ఉన్నాయన్న బలుపుతో జంపన్న చేసిన పనులకు పటేల్ సర్పంచ్ దెప్పిపొడుస్తాడు. దానికి జంపన్న మీరే దిక్కు పటేలా అని కాళ్లు పట్టుకొని బతిలాడుతాడు. పటేలు వారిమీద కొప్పడి వెళ్లిపోతాడు. ఇదంతా అభి చూస్తాడు. అక్కడ నుంచి రాములు దగ్గరకు వెళ్తారు ముగ్గురు. కాని రాములు కూడా కుదరదు అంటాడు. దారిలో సీను కలుస్తాడు. అతను కూడా రానంటాడు. అలా ఊరంతా తిరిగినా ఎవరు రానంటారు. కట్ చేస్తే ఉదయం బ్యాంక్ కు అభితో వెళ్తారు. అభి వాళ్లతో మాట్లాడినా బ్యాంక్ మేనజర్ వినరు. దాంతో వాళ్లతో తెచ్చిన బంగారం తీసుకోండి అని అడిగితే అది రోల్డ్ గోల్డ్ అని తెలిసి వారిని బయటకు పంపిస్తారు. బ్యాంక్ లో ఒక మీడియా పర్సన్ విషయం తెలుసుకుంటాడు.
కట్ చేస్తే సమ్మక్కతో మీడియా మాట్లాడుతుంది. అసలు విషయం తెలుపమని చెప్తే జరిగిన విషయాన్ని మొత్తం వివరిస్తారు. అది రాష్ట్రమంతా వ్యాపిస్తుంది. దీనిపై బ్యాంక్ లో ఏం జరుగుతుందని భీమాదేవరపల్లి బ్రాంచ్ చైర్మెన్ మేనేజర్ పై అరుస్తాడు. బ్యాంక్ మేనేజర్ ఏదోటి చేయాలి అని ఆలోచిస్తాడు. మరో వైపు జన్ దన్ ఖాతాలో డబ్బులు పడుతాయని గుడిసే కూల్చేసిన విషయం, తాలా 50 వేలు గిరికి ఇచ్చిన విషయాన్ని మీడియాలో గ్రామస్తులు చెప్తారు. కట్ చేస్తే గిరి, లింగం ఇద్దరు ఒకే హోటల్లో ఉండి మందు తాగుతూ చీర్స్ కొట్టుకుంటారు. అయితే లింగం డబ్బులు వేయిస్తాడు అని నమ్మి గిరి కూడా డబ్బులు అన్ని అతినికే ఇచ్చినట్లు తెలుస్తుంది. అందరితో పాటు అతని డబ్బులు కూడా ఇచ్చినట్లు చెప్తాడు, నిజంగానే లింగం మంచోడు అని గిరి నమ్ముతాడు.
విషయం తెలుసుకుందామని మీడియా మొత్తం ఊర్లో అందరిని అడిగి తెలుసుకుంటారు. అన్ని ఛానెళ్లు రిపోర్ట్ చేస్తారు. జేడీ లక్ష్మినారయణ, అద్దంకి దయాకర్, ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు లతో జర్నలిస్ట్ శ్రీనివాస్ డిబెట్ పెడుతారు. ఉచిత సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతారు. అప్పటివరకు కామెడీగా సాగిన కథనం ఈ ఎపిసోడ్ కొంచెం సెన్సిబుల్ గా ఉంటుంది. ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతారు. ఉచిత పథకాల గురించి మాట్లాడుతారు. ప్రభుత్వాల విధుల గురించి మాట్లాడుతారు.
కట్ చేస్తే బ్యాంక మేనేజర్ ఎస్ఐ తో మాట్లాడుతారు. ఎలాగైనా డబ్బులు కట్టించే విధంగా చూడండి అని, వాళ్లను బెదిరించి డబ్బులు కట్టియ్యండి అని ఎస్ఐ లోన్ విషయంలో సాయం చేస్తా అని పోలీసులతో డీల్ చేసుకుంటాడు.
తరువాత సీన్లో బ్యాంక్ ఆఫీసర్లు జంపన్న ఇంట్లో మీటింగ్ పెట్టి బెదిరించి వెళ్తారు. తరువాతి సీన్లో ఎస్ఐ కల్లు తాగుతూ జంపన్నను డబ్బులు కట్టమని బెదిరిస్తాడు. చంపినా కూడా పైసలు లేవని దండం పెడుతాడు జంపన్న. ఒక వైపు భార్య, తల్లి దిగులుతో ఇంట్లో ఉంటారు. చేసేది ఏం లేక, కట్టడానికి డబ్బులు లేక వాళ్లు దిక్కులు పెక్కుటిల్లేలా ఏడుస్తారు. డబ్బుల విషయంలో భార్య భర్తలకు గొడవ అవుతుంది. ఆ గొడవలో స్వరూపమీద చేయి చేసుకుంటాడు. కోపంతో స్వరూప తల్లిగారి ఇంటికి వెళ్తుంటే సమ్మక్క అడ్డం పడుతుంది. ఈ గొడవలో సమ్మక్క చేయికి దెబ్బ తగులుతుంది. ఊర్లో జనం వచ్చి స్వరూపకు సర్ధి చెప్పాలని చూస్తే స్వరూప వినకుండా తల్లిగారి ఇంటికి వెళ్ళిపోతుంది.
కట్ చేస్తే గ్రామస్తులు జంపన్నపై జాలి చూపిస్తారు. ఊర్లో ఉన్న వారు జంపన్న తరఫున బ్యాంక్ ముందు గొడవ చేస్తారు. బ్యాంక్ మేనేజర్ పోలీసుకు ఫోన్ చేసి ప్రొటెక్షన్ చేయమని ఆందోళన చేస్తారు. అక్కడికి ఒక పోలిటిషన్ వచ్చి మినిస్టర్ డౌన్ డౌన్ అని స్లోగన్స్ ఇస్తారు. అక్కడికి జాతీయ పౌరుల హక్కులకు సంబంధించిన వ్యక్తి వచ్చి వారికి భరోసా ఇస్తాడు. అంతలో ఒకడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తాడు. అక్కడికి పోలీసులు వచ్చి అందరిని అరెస్ట్ చేస్తారు.
కట్ చేస్తే బ్యాంక్ మేనేజర్, పోలీసు, లాయర్ ముగ్గురు రాత్రి సిట్టింగ్ చేస్తారు. ఫోన్లో ఒక ఎవిడెన్స్ ఉందని వారు మాట్లాడుకుంటారు. ఆ ఫోన్లో రికార్డు అయిన దాన్ని మార్చి చెబుతాడు ఎస్ ఐ. జంపన్న కావాలనే వేముల సమ్మక్క అకౌంట్ బదులు వాళ్ల అమ్మ వండ్లకుంట సమ్మక్క పేరు మీద మార్చి రాశాడని, ఇదే చెప్పి అతన్ని ఇరికిద్దామని ప్లాన్ చెప్తాడు పోలీసు. దానికి అందరూ ఇదే కరెక్ట్ అని సంతోషపడుతారు. కట్ చేస్తే వేముల సమ్మక్కను పిలిపించి అబద్దం సాక్ష్యం చెప్పాలని పోలీసు చెప్తాడు. మరో సీన్లో జంపన్న ఇంటికి పోలీసులు వచ్చి సమ్మక్కను స్టేషన్ కు తీసుకెల్తారు. వాళ్ల అమ్మను వదలండని జంపన్న కారు వెనుకాల పరుగెడుతాడు. గుండెలు పగిలేలా ఏడుస్తాడు.
ఈ విషయం మీడియాలో వస్తుంది. అందరూ షాక్ అవుతారు. దీనిపై మీడియా అధికారులు విలేజ్ రిపోర్ట్ తీసుకుంటారు.
కట్ చేస్తే సర్పంచ్ గ్రామంలో చెట్లు నాటుతుంటారు. అక్కడికి జంపన్న వచ్చి సర్పంచ్ ను బతిలాడుతాడు. కాళ్లు మొక్కుతాడు. కాని సర్పంచ్ కాలుతో తన్నుతాడు. అయినా సరే సర్పంచ్ వినడు. అంతలో అభి, కావేరి వాళ్లు అక్కడికి వస్తారు. గ్రామ ప్రజలు అందరూ అక్కడికి వచ్చి అందరూ బతిలాడుతారు. అయినా సరే అతను వినరు. రాణి బతిలాడడంతో సర్పంచ్ కు కోపం వచ్చి పెళ్లి వద్దు అని డబ్బులు ఇచ్చేస్తాడు. అక్కడితో గ్రామస్తులకు పెద్ద గొడవ అవుతుంది. అందరూ కొట్టుకుంటారు.
ఈ గొడవతో గ్రామంలో 144 సెక్షన్ విధిస్తారు. ఇదే విషయాన్ని పోలీసులు తిరిగి చెప్తారు. జంపన్న పరిస్థితియే కాదు ఊర్లో అందరు ఇబ్బంది పడుతుంటారు. డబ్బులు వస్తాయి అని ఆశతో ఉన్నవాళ్లు అవి రావని తెలిసి బాధపడుతుంటారు. సమ్మక్క జైల్లో ఉంటుంది. జంపన్నను స్వరూప విడిచి వెళ్లిన విషయం, అభి కావేరి ఇద్దరు విరహంతో బాధపడుతుంటారు. అంతలో జంపన్నను పోలీసులు అరెస్ట్ చేస్తారు. లింగం, గిరి మాత్రం హాయిగా హోటల్లో గడుపుతారు. అలా ఊర్లొని అందరు పడే బాధలను ఒక మానటేజింగ్ సాంగ్ లో చూపిస్తారు.
కట్ చేస్తే.. సర్పంచ్ ఇంట్లో గ్రామంలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని మాట్లాడుకుంటారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలువాలని ఆలోచిస్తారు. రాణి గౌడ్ బిడ్డతో అభి పెళ్లి చేయాలని, అలా చేస్తే అందరూ ఓటేస్తారని, అలాగే జంపన్న, సమ్మక్కలను విడిపించాలని బెయిల్ తీసుకొస్తారు. అయినా ఎస్ ఐ వినకపోవడంతో ఎమ్మెల్యేకు ఫోన్ చేసి వాళ్లను విడిపిస్తారు సర్పంచ్. తొందర్లో ఎలక్షన్లు వస్తున్నాయని నువ్వు మళ్లీ నా జెండా మొయ్యాలని సర్పంచ్ జంపన్నతో చెబుతాడు. దానికి నువ్వు ఎట్ల చెబితే అట్లనే పటేలా అని ఆటోలో ఊర్లోకి వస్తారు. తల్లి కొడుకులు. అలా నడుచుకుంటు ఇంటికి వెళ్తుంటే గ్రామస్తులు తిడుతారు. దొంగతనం చేశారని, ఎంతమందిని మోసం చేస్తారని, ఇజ్జత్ ఉన్నోడు అయితే సావాలే అని ఊర్లో నలుగురు మాట్లాడుకుంటారు. దీంతో జంపన్నతో తల్లి బతకాలని లేదని చెబుతుంది. ఇద్దరికి చనిపోవాలని పిస్తుందని, వాళ్లకు ఎవరు లేరని, చనిపోదామని ఆలోచించుకుంటారు.
జంపన్న బయటకు వెళ్లి ఒక పురుగుల మందు డబ్బ కొనుకొచ్చి ఇది చేదుకుంటుంది అని, తనకు ఇష్టమైన కొడిగుడ్ల కూర చేయమని కలుపుకొని తిని చనిపోదాం అని అనుకుంటారు. తల్లి కూర చేసుకోస్తుంది. అందులో మందు కలుపుకుంటారు. తల్లికి విషయం పెట్టడం ఇష్టం లేక ఆలోచిస్తుంటే.. సమ్మక్క బాటిల్ తీసుకొని కలుపుకొని ఇద్దరు తినలని అనుకుంటారు. వారి చావు కేకలు కూడా బయటకు వినపడొద్దు అని టీవీ పెడుతా అని టీవీ అన్ చేస్తాడు అర్జున్. అప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. కొన్నొద్దులు గడిచినంక అని టైటిల్ పడుతుంది.
కట్ చేస్తే బావికాడా స్వరూప, జంపన్న, సమ్మక్క బర్ల పెడ తీస్తూ.. కుడితి పోస్తూ.. పాలను సేకరించే పనులు చేస్తూ పనులు చేసుకుంటూ ఉంటారు. అక్కడికి ఈఎమ్ఐ కోసం వచ్చిన బ్యాంక్ ఆఫీసర్ కు డబ్బులు కట్టి పింపిస్తాడు. అయితే విష తిద్దామనుకున్న రోజు రాత్రి టీవీ అన్ చేయగానే ఏం జరిగిందో మళ్లీ ఫ్లాష్ బ్యాక్ ను చూపిస్తారు.
చదవండి:Koratala Shiva: బిగ్ సర్ప్రైజ్.. ‘దేవర’ 2 పార్ట్స్
అసలు తప్పంతా బ్యాంక్ సిబ్బందే చేశారని, ఇందులో జంపన్నకు ఏం సంబంధం లేదని బ్యాంక్ మేనేజర్ మీడియాతో చెప్తారు. అదే సమయంలో బ్యాంకింగ్ వ్యవస్తమీద పొలిటికల్ ప్రెజర్ ఉంటుందని చెప్తారు. బ్యాంక్ వసుళ్ల విషయంలో కూడా పేదలకు, ధనికులకు తేడా చూపిస్తారని చైర్మెన్ ఒప్పుకుంటారు. అలాగే జంపన్నకు లోన్ ఇప్పించి ఆదుకుంటామని చెప్తారు. కేసులు వాపస్ తీసుకొని వారికి ఒక డైరీ ఫామ్ పెట్టించి, నెలనెల ఈఎంఐ రూపంలో డబ్బులు కట్టేలా చూసుకుంటామని బ్యాంక్ మేనేజర్ ప్లాన్ చేప్తారు.
అభికి, కావేరికి గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటారు. అన్నింటికి కారణం అభి వాళ్ల నాన్నకు ఉన్న పోలిటికల్ ఆశానేని, తన జర్నలిస్ట్ ఫ్రెండ్ కు 10 వేలు ఇచ్చి ముందస్తు ఎన్నికల న్యూస్ చెప్పడంతో ఇదంతా జరిగిందని కావేరికి అభి చెప్తాడు.
గ్రామంలోకి గిరి వచ్చిన విషయం అందరికి తెలిసి గిరి అంతు చూడాలని వెళ్తారు. చౌరస్తలో చుట్టుముడుతారు. కొట్టాలని చూస్తే వారిని ఆపి రేపు పొద్దుగాల డబ్బులు పడుతాయని, కాని ఒక్క ఇరువై వేలు ఖర్చు అయితాయని అంటాడు. దానికి అందరూ కొప్పడుతుంటే.. తిక్క శంకరయ్య మాత్ర డబ్బులు ఇస్తాడు. ఇంతటితో మనిషి ఆశా జీవి.. మోసం చేసే వాడు అవకాశం కోసం ఎదురుచూసే పరన్నజీవి
అనే నీతితో భీమదేవర పల్లి బ్రాంచి సినిమాకు శుభం పడుతుంది. ఇది భీమదేవరపల్లి పూర్తి కథ. మా ఎక్స్ ప్లనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ సినిమా గురించి అయినా ఎక్స్ ప్లనేషన్ కావాలంటే మాకు కామెంట్లో తెలియజేయండి.