Month of Madhu: బార్ లో మధు మందుబాటిల్ పట్టుకొని వచ్చి పెగ్ కలుపుకొని తాగుతాడు. అదే బారులో సీను ఫ్రెండ్స్ మధుని చూపిస్తారు. మధు దగ్గరకు వెళ్లి నీతో మాట్లాడాలి అని అంటారు. సీను తన ఫ్రెండ్స్ తో బయట వెయిట్ చేస్తుంటారు. వాళ్లదగ్గరకు వెళ్తాడు మధు. నీకు ఎం కావాలిరా అని అడుగుతాడు సీను. నువ్వు ఇస్తావేంటి అని మధు అంటాడు. తూ.. జీవితంలో నీ ముఖం చూడకూడదు అనుకున్న, కాని దాని ముఖం చూడలేకపోతున్నా.. డైవర్స్ ఇస్తావా లేదా అని అగుడుతాడు. దానికి మందు అయిపోయింది వెళ్లి తెచ్చుకుంటా అని మళ్లీ బార్ లోకి వస్తాడు మధు. వెనకాలే వచ్చి సీను మధును కొడుతాడు. మధు పట్టించుకోడు.. కొడుతూనే ఉంటాడు. మధు కోపంతో సీను నెత్తిమీద బాటిల్ తో కొడుతాడు. తరువాత తన ఫ్రెండ్స్ ను కొడుతాడు. మందు తాగి మళ్లీ గొడవ పడుతాడు. సీనును కిందపడేసి ఇష్టం వచ్చినట్లు కొడుతాడు.
చదవండి:Adivishesh: అడివి శేష్ ఎక్స్ శృతి హాసన్.. గర్ల్ఫ్రెండా? విలనా?
నెక్ట్స్ సీన్లో స్కూటీ మీద ఒక అమ్మాయి వచ్చి డోర్ కొడుతుంది. లేఖ డోర్ తీస్తుంది. ఇద్దరు కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్తారు . అక్కడ మధు ఉంటాడు. లేఖ బయటనుంచి మధును చూస్తుంది. తరువాత సీన్లో బీచ్ పక్కనే మధు ఫ్రెండ్స్ తో వాలీబాల్ ఆడుతుంటాడు. అక్కడికి లేఖ వస్తుంది. తనతో మాట్లాడుతాడు. ఏదో అడుగుతుంటాడు. తరువాత సీన్లో తన ఫ్రెండ్ భూషన్ తో డబ్బులు గురించి అడుగుతాడు. ఆమెకు తెలియకుండా ఏది జరగదు మాయ్య.. మీరు ఎవరికి తెలియకుండా తిరుగుతున్నారు అనుకుంటున్నారు కాని అందరికి తెలుసు మాయ్య అని అంటాడు భూషన్. ఇదంతా కాదు అని తన దగ్గర ఉన్న బంగారు గాజు తాకట్టుపెట్టి నాకు డబ్బు ఇవ్వు పొద్దున్నే భీమిలీకి వెళ్లాలి అని చెప్తాడు మధు.
నెక్ట్స సీన్లో లేఖ కాలేజీకి రెడీ అవుతుంది. ఇంత పొద్దున్నే ఏంటి.. అంటే దారిలో పనుంది నోట్స్ జిరాక్స్ తీసుకోవాలి అని చెప్తుంది. నీకిష్టమైన మామిడికాయ పులిహోర చేశాను, తిని వెళ్లు అని లేఖ వాళ్ల అమ్మ అంటుంది. దారిలో దింపుతా అని లేఖ వాల్ల నాన్న అంటాడు. తరువాత లేఖను తన ఫ్రెండ్ మంజు వాళ్ల ఇంటిదగ్గర వదిలేసి వెళ్తాడు. వాళ్ల నాన్న వెళ్లగానే మధుతో బయటకు వెళ్తున్న అని మంజుకు చెప్పి వెళ్తుంది. కట్ చేస్తే బస్టాప్ లో మధు వెయిట్ చేస్తు ఉంటాడు. ఇప్పుడా వచ్చేది అని అరుస్తాడు. తరువాత బస్సు వచ్చింది అని ఎక్కుతారు. ఇద్దరు బస్సులో కూర్చుంటారు. ఒక సారి ఇంటికి వచ్చి మాట్లాడు అని అంటుంది లేఖ. ఇప్పుడేంటి పెళ్లిచేసుకొని, పిల్లలను కనమంటావా అని అడుగుతాడు.. పోనీ నువ్వు చేసుకుంటావా అని అడుగుతాడు. దానికి వేరే మార్గం లేదా అని అంటుంది. ఇద్దరు మౌనంగా ఉంటారు.
తరువాత సీన్లో ఓ బస్తీ ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ నర్సు ఉంటుంది. అమ్మాయి మేజరే కదా.. కాలేజీ పిల్లలకు ఇలాంటివి చేయము… మీరు తెలుసు కాబట్టి ఒకే అని, డబ్బులు చెప్పారుగా అని అంటుంది. సాయంత్రం వచ్చి తీసుకొని వెళ్లవచ్చు అని చెబుతుంది. తాను సాయంత్రం వచ్చి డబ్బులు కడుతా అని చెప్తాడు మధు. లేఖ దగ్గర కూర్చుంటాడు. తనకు ఆకలి అవుతుంది అని చెబుతుంది. సాయంత్రం వరకు ఓపిక పట్టు అంటాడు. బాక్స్ లో మామిడికాయ పులిహోర ఉంది తినేసి వెళ్లు అని చెబుతుంది లేఖ. కట్ చేస్తే ఎన్ని నెలలు తప్పాయి అని నర్సు అడుగుతుంది. రెండు నెలలు అని కళ్యాణి చెబుతుంది. దానికి నర్సు తిడుతుంది. డాక్టర్ వచ్చి మత్తుగా ఉంటుంది కంగారు పడకు అని తనకు అబార్షన్ చేస్తాడు. టైటిల్ పడుతుంది.
తరువాత సీన్లో ఫ్లైట్ వైజాగ్ లో లాండ్ అవుతుంది. మధు ఫ్యామిలీ దిగితుంది. తాను 13 సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చినట్లు చెప్తుంది. మధు ఒక వన్ వీక్ కొంచెం పద్దతిగా ఉండు అని తన మధర్ చెప్తుంది. తరువాత వారు పెళ్లి వారి ఇంటికి వెళ్తారు. పలుకే బంగారమాయేనా సాంగ్ వస్తుంది. కారు ఆగుతుంది. అందరు ఇంట్లోకి వస్తారు. నైట్ కాక్ టైల్ పార్టీ ఉందని తన రిలేటీవ్ చెప్తాడు. తరువాత బిందు ఫోన్లో మాట్లాడుతుంటే అక్కడికి మధు వస్తుంది. తరువాత తనతో పార్టీలో మంచి అబ్బాయిలను పరిచయం చేస్తావా అని అడుగుతుంది. పిన్ని పంపిస్తుందా అంటే చెప్పును అని చెప్తుంది. ఫోన్లో వివేక్ హా.. అంటే అవును అంటుంది. ఒక అబ్బాయితో అంత హర్ష్ గా మాట్లాడొద్దు అని చెప్తుంది మధు. దానికి బిందు అదోలా చూస్తుంది. తరువాత కలుద్దాం అని మధు వెళ్లి పోతుంది. వెళ్లిపోయింది అని డోర్ వేసుకుంటుంది బిందు. అంతలో మళ్లీ డోర్ కట్టిన సౌండ్ వస్తుంది. తీస్తే మధు మదర్ వస్తుంది. వరువాత వివేక్ గురించి అడుగుతుంది. తాను చాలా మంచోడు అని చెప్తుంది బిందు.
నెక్ట్స్ సీన్లో పార్టీ స్టార్ట్ అవుతుంది. మధు పార్టీకి వస్తుంది. అందరితో సరదాగా మాట్లాడుతుంది. మధు సిగరేట్ తాగుతుంటే బిందు చూస్తుంది. తరువాత వివెక్ తో సెల్ఫీ తీసుకుంటుంది. అక్కడికి బిందు వస్తుంది. బావా నేను అందంగా ఉన్నానా.. అయితే నన్నుకూడా పెళ్లి చేసుకో అని అంటుంది మధు. తరువాత సీన్లో బిందు వివెక్ గొడవ పడుతుంటారు. అక్కడి మధు వెళ్లి ఏదైనా హెల్ప్ చేయాలా అంటే బిందు అవసరం లేదు వెళ్లిపో అంటుంది. దాంతో మధు ఒక బాటిల్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది. ఒక బీచ్ పక్కన కూర్చుంటుంది. అదే సమయంలో మధు మందు తాగుతూ జాయెంట్ కొడుతు ఉంటాడు. అక్కడే మధును చూసి నిన్ను ఎక్కడో చూసినట్లు ఉంది అని అంటాడు. మధ్య మధ్యలో మందును చూస్తూ మాట్లాడుతుంటాడు. తరువాత ఇద్దరు పరిచయం చేసుకుంటారు. తాను మందు బాటిల్ తీసుకొని తాగుతాడు. మధు అలానే చూస్తుంది. తరువాత మధు ఇంగ్లీష్ లో ఏదో మాట్లాడుతునే ఉంటుంది. తన వైఫ్ డైవర్స్ నోటిస్ ఇచ్చినట్లు చెప్తాడు. ఇంకొంచెం మందు దొరుకుతుందా అని అడుగుతాడు. మధు వైన్ తీసుకొస్తుంది. మధుసుధన్ తాగుతాడు. నీ దగ్గర జాయింట్ ఉందా అని మధు అడుగుతుంది. ఇస్తాడు. తాను తాగుతుంది. అసలేం జరిగింది అని అడుగుతుంది. ఆ రోజు సోమవారం మటన్ తీసుకొచ్చి కిచెన్ లో పెట్టా.. వెళ్లిపోయింద అని చెప్తాడు. ఏం జరిగింది అంటే ఎవరికి తెలుసు.. వదిలేసి వెళ్లిపోయింది అని నీ గురించి మీ వాళ్లు చూస్తుంటారు అని అంటాడు. నన్ను అక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు అందుకే ఇక్కడికి వచ్చా.. ఇండియాలో నువ్వే నా ఫస్ట్ ఫ్రెండ్ అని నెంబర్ తీసుకుంటుంది.
తరువాత సీన్లో బిందు ఇంటికి వస్తుంది. తన బెడ్ మీద ఒక గిఫ్ట్ ఉంటుంది. ఒపెన్ చేస్తే అందులో అడల్ట్ టాయిస్ ఉంటుంది. దానితో పాటు ఒక లేటర్ రాసి పెడుతుంది. బావ నిన్ను సాటిస్ ఫై చేయకపోతే దీన్ని వాడుకో.. నువ్వు బావను సాటిస్ ఫై చేయకపోతే నన్ను వాడుకో అని రాస్తుంది. తరువాత సీన్లో మధుసుదన్ వచ్చి జీడిపప్పును తిని, షర్ట్ వేసుకుంటాడు. తరువాత బయటకు వస్తాడు. వాళ్ల బావ వస్తే డబ్బులు లాక్కొని వెళ్లిపోతాడు. ఆడాది కలిసుండడానికి కారణాలు వెతకాలి విడిపోవడానికి కాదు అని మధు వాళ్ల అమ్మ చెల్లితో అంటుంది. మరో సీన్లో లేఖ బట్టలు ఆరేస్తుంది. తరువాత రెడీ అవుతుంది. ఆఫీస్ కు బయలు దేరుతుంది. తాను హాస్పటల్ లో నర్సుగా జాబ్ చేస్తుంది. ఇంజక్షన్స్ చేస్తుంది. ల్యాబ్ లో పని చేస్తుంది. తరువాత లంచ్ చేస్తుంటారు. పక్కనే ఉన్నవాళ్లు ఫోన్లో వాళ్ల పిల్లాడు చేసిన అల్లరిని చూస్తు సంతోషపడుతుంటారు. లేఖకు ఆ సౌండ్స్ వినిపించి చిన్నగా నవ్వుతుంది. కట్ చేస్తే మంజు లేఖ వాల్ల ఇంటికి ఫోన్ చేస్తుంది. తనకు నాలుగు రోజులుగా జ్వరం అని మధుతో చెప్తుంది. దాంతో మధు లేఖ ఇంటికి వెళ్తాడు. కిటికి కొడుకుతాడు. తనకు ఓపిక లేదని చెప్తుంది. నువ్వు ఏం మాట్లాడకు నేనే మాట్లాడుతా అని అంటాడు. నిన్ను ఇలా చూస్తే నచ్చట్లేదు, చూడకపోతే అసలు నచ్చట్లేదు అని అంటాడు. తెలిసి చేశానా.. నాకు మొదటి సరే కదా అంటాడు. నేనే పిచ్చిదాన్ని నీ వెనుక తిరిగానను అని లేఖ అంటుంది. నిన్ను పెళ్లిచేసుకునేంత ప్రేమ ఉంది. దాని కోసం అందరి కాళ్లు పట్టుకునే ఓపిక లేదు అంటాడు. నీకు ఓకే అయితే వచ్చేయి.. నేను ఎక్కడుంటానో నీకు తెలుసు అని చెప్తాడు.
తరువాత సీన్లో బిందు వాళ్ల ఇంట్లో పెళ్లి హడావిడీ మొదలౌతుంది. హల్దీ ఫంక్షన్ లో అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. మధును బిందు వాళ్ల బామ్మ పిలిచి పెళ్లైంతవరకు బిందును దగ్గరుండి చూసుకొ అని చెప్తుంది. తరువాత మధు ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి జాయింట్ కొడుతుంది. తరువాత మంగళస్నానాలు చేస్తుంటే అక్కడికి మధు వచ్చి కారు కీస్ అడుగుతుంది. కట్ చేస్తే ఒకడు బార్బర్ షాప్ లో జుట్టుకు రంగు వేసుకొని బయటకు వస్తాడు.. ఇలా ఉంటే అమ్మాయిలు బయపడిపోతార్రా అని అంటుండగా.. కారు ఆపి మధు దిగి అతన్ని పిలిచి రోలింగ్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతుంది. అమ్మాయి మాట్లాడుతున్న ట్రాన్స్ లో ఉన్న అతను తన మొబైల్ పౌచ్ లో ఉన్న పేపర్స్ ఇస్తాడు. అవి తీసుకొని థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది. అతను అలాగే చూస్తుంటాడు.
తరువాత సీన్లో మధు బయట నిలబడి ఉంటాడు. రే అని తన ఫ్రెండ్ ను పిలుస్తాడు. అతను చూసి చూడకుండా వెళ్తుంటే మధు వెళ్లి సుమన్ బైక్ ఎక్కుతాడు. తరువాత ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందామా అంటాడు. నేను ఇదివరకటిలా తాగట్లేదు మామ… తప్పదు అనుకుంటే ఒక బీర్ అని అంటాడు సమన్. అయితే తప్పుదు అనుకొని ఒక బీరు తాగు అంటాడు మధు. కట్ చేస్తే బార్ లో తాగుతుంటారు. మధు ఫ్రస్టేట్ అవుతాడు. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే నీతో మాట్లాడలంటే భయమేస్తుందిరా మామ.. దేనికి అరుస్తావో తెలియదు అంటాడు సుమన్. ఎవడుర్రా చెప్పింది అని మళ్లీ అరుస్తాడు. తరువాత బిల్ అని చెబితే.. అందులో ఒక ఆఫ్ అని మధు చెప్పి తన దగ్గర డబ్బులు తీసుకుంటాడు. ఇలా ఉంటే నచ్చట్లేదు మామ అని సమన్ అంటే సలహాలు ఇస్తున్నావా… అని అతన్ని తిట్టి వెళ్లిపపొమ్మంటాడు.
తరువాత సీన్లో బిందు రెడీ అవుతుంది. డోర్ తీసుకి మధు మదర్ వస్తుంది. బిందు కొంచెం డల్ గా ఉంటుంది. ఎందుకు అని అడిగితే.. మధు మన చేయిదాటిపోయింది పిన్ని. తాను చేస్తున్న పనికి తల ఎత్తుకోలేకపోతున్నాము అని చెప్తుంది. నిన్న స్మోక్ అవుట్ కు వివెక్ కజిన్స్ ను బయటకు తీసుకెళ్లింది. అదే విషయంలో వివెక్ తో సాయంత్రం వరకు గొడవ జరిగింది అని చెప్తుంది. అంతే కాదు తాను ఇచ్చిన అడల్ట్ టాయిస్ ను ఇస్తుంది. దాంతో మధు మదర్ ఎంబారిసింగ్ గా ఫీల్ అయి.. వెళ్లి మధును ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. తిండిమీద, ఒంటి మీద ద్యాస లేదు కనీసం మాటల మీద కంట్రోల్ లేకుంటే ఎలా.. పెళ్లికి ఇచ్చే గిఫ్ట్ ఇదేనా అని తిడుతుంది. నీలా నేను స్ట్రిక్ట్ గా ఉండలేను అని మధు అంటుంది. నువ్వు అందరిని కంట్రోల్ చేయాలనుకుంటావు… నేను అందరితో కలిసిపోవాలనుకుంటాను అని అరుస్తుంది.
తనమాటలకు అడ్డుపడుతూ.. ఇలా చేస్తే అందరు నన్ను తిడుతున్నారు. నీ పుట్టుకకు కారణం అయినందుకు సిగ్గు పడుతున్నా అని మధు మదర్ అని వెళ్లిపోతుంది. దాంతో మధు బాధ పడుతుంది.
తరువాత పాట మొదలౌతుంది. తాను హ్యప్పిగా ఉండదు. బిందు పెళ్లి జరుగుతుంది. మధు మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. నెక్ట్స్ సీన్లో బట్టలో షాప్ లో మధును మరిచిపోలేక పోతున్నా జుట్టుకు కలర్ వేసుకున్నవ్యక్తి అంటుంటాడు.. తను ఫారెన్ అమ్మాయి మామ.. తనను మరిచిపో అని తన ఫ్రెండ్ అంటాడు. మరిచిపోయే వాడిని అయితే ఎప్పుడో మరిచిపోయే వాడిని ఇంకా తననే గుర్తుపెట్టుకున్నా అంటే మళ్లీ తనను కలుస్తా మామ అని అంటాడు. కట్ చేస్తే ఎయిర్ పోర్ట్ లో మధు ఫ్యామిలీ చెక్ ఇన్ అవుతుంటారు. మధుకు అమెరికాకు వెళ్లడం ఇష్టం లేదని, ఒక నెలరోజులు ఇక్కడే ఉండి ఈ బంధాలు నేర్చుకుంటా అని వాళ్ల డాడిని కన్విన్స్ చేస్తుంది. కాలేజ్ స్టార్ట్ అవడానికి ఇంకో వన్ మంత్ టైమ్ ఉందని చెబుతుంది. దానికి వాళ్ల ఫాదర్ ఒప్పుకుంటాడు.
తరువాత సీన్లో మధు తన ఫ్రెండ్ భూషణ్ తో కలిసి మందు తాగుతుంటాడు. పిచ్చపాటిగా మాట్లాడుకుంటారు. శరత్ గురించి మాట్లాడుతుంటారు. వాడు పెళ్లికి ముందు వెస్ట్ ఫెలో లా ఉన్నాడు అని ఇప్పుడు ల్యాండ్ కొన్నాడు, ఐటీ కంపెనీ పెట్టినట్లు మాట్లాడుకుంటారు. తరువాత వాడు ఎంత సంపాదిస్తే మనకేంటి మనకేమన్నా ఇస్తాడా.. అయినా వాడు ఎలా ఎదిగాడో తెలియదా అని మాట్లాడుకుంటారు. మనం అలా చేస్తే మనం ఎదగొచ్చు.. కాని అలా చేయడాని మనసు ఒప్పదు అని భూషణ్ అంటాడు.
తరువాత సీన్లో మధు లేచి.. వాళ్ల గ్రాండ్ పేరెంట్స్ దగ్గరకు వెళ్తుంది. వారితో లంచ్ చేస్తుంది. యోగాలో జాయిన్ అవమని అడుగితే.. నాకు ఇలా ఉండడమే ఇష్టమని చెప్తుంది. తరువాత అది బీచ్ పక్కనే ఉందని ఒక సారి ట్రై చేస్తా అంటుంది. మరో సీన్లో మధుసుదన్ తన ఫ్రెండ్ బైక్ మీద నుంచి దిగి డబ్బులు అడిగి వాటర్ పాకెట్ కొనుకొని ఫేస్ వాష్ చేసుకొని సిగరేట్ తాగుతుండగా.. అక్కడికి మధు వస్తుంది. నిన్ను లాస్ట్ టైమ్ కలిసినట్లు చెప్తుంది… మళ్లీ ఎప్పుడైనా కలుద్దాం అని నీకు ఇక బాటిల్ తీసుకొస్తా అని చెప్పి వెళ్తుంది. అక్కడ బైక్ లో షేడీ ఫాలో అవుతాడు. కారు ఆపీ అతనితో మాట్లాడుతుంది. తన బైక్ ఎక్కి యోగ సెంటర్ కు వెళ్తుంది. అక్కడ యోగ చేస్తుంది. వాసుకితో ప్రతి రోజు వస్తా అని చెబుతుంది. అక్కడే ఉన్న దక్షని పరిచయం చేసుకుంటుంది. తరువాత సీన్లో పట్టుకుంటా అని చెప్పనా అని మధు ఇన్ స్టాగ్రామ్ లో మెస్సెజ్ చేస్తాడు షేడీ.. నెంబర్ ఇస్తుంది. అలా చాట్ చేసుకుంటారు. షేడీ ఆనందపడుతుంటాడు. తరువాత సీన్లో యోగ టీచర్ వాసుకితో మధు మాట్లాడుతుంది. అక్కడికి దక్ష వస్తాడు. తనను మధు చూస్తుంది.
తరువాత సీన్లో లేఖ హాస్పటల్ లో లంచ్ చేస్తుంది. రేపు లంచ్ హవర్ తరువాత వస్తాను. రేపు కోర్టు వాయిదా ఉందని చెప్తుంది. కట్ చేస్తే మధు దగ్గరకు లేఖ వస్తుంది. వారు రోమాంటిక్ గా మాట్లాడుకుంటారు. తరువాత వారు ఇంటిమేట్ అవుతారు. నెక్ట్స్ సీన్లో కోర్టులో మధుతో లాయర్ మాట్లాడుతుంటాడు. మూడు సంవత్సరాలు అవుతుంది. ఏదోటి తేల్చుకోరా అని లాయర్ అంటాడు. అసలు గొడవెందుకు అయిందిరా అని లాయర్ అడిగితే.. ఆ రోజు సోమవారం.. రమేష్ గాని కొట్టు కెళ్లి ముప్పావుకిలో మటన్ తీసుకొచ్చి కిచెన్ లో పెట్టాను అని ఆగిపోతాడు.. ఆ తరువాత అంటే.. ఎవరికి తెలుసు.. ఆ రోజు నుంచి రాలేదు. వెళ్లిపోయింది ఎవరికి తెలుసు అని అంటుండగా.. లేఖ కోర్టుకు వస్తుంది. తరువాత కేసు కోసం కోర్టు రూంలోకి వెళ్తారు. మధు ఆల్కాహాల్ లో ఉండడం వలన లేఖ మానసికంగా చితికిపోయింది అని తనకు డైవర్స్ ఇప్పించాలని లేఖ తరఫు లాయర్ చెప్తుంది. తరువాత మధు లాయర్ మాట్లాడుతూ.. నా క్లయింట్ ఆనారోగ్యం బాగలేక ఇలా తాగుతున్నాడు అని, ఈ సమయంలో పక్కన ఉండాల్సిన భార్య వదిలేసి వెళ్లిందని వారిని మీరే కలుపండి అంటాడు. ఇరు వార్గాల వాదనలు విని కేసును వచ్చే నెలకు వాయిదా వేస్తుంది కోర్టు.
తరువాత సీన్లో లాయర్ పిలుస్తున్నా మధు వెళ్లిపోతాడు. లేఖ లాయర్ దగ్గరకు వచ్చి తన చేతికి ఉన్న ఉంగురం వాళ్ల నాన్న జ్ఙాపకం అని.. ఎక్కడన్న తాకట్టు పెడితే చెప్పమనండి నేను డబ్బులిచ్చి తెచ్చుకుంటా అంటుంది. ఇవన్ని ఎందుకు అమ్మ సెటిల్ మెంట్ చేసుకోవచ్చు కదా అని లాయర్ అంటాడు. దేనికండి సెటిల్ మెంట్.. ప్రేమించినందుకా అని లేఖ అంటుంది. కట్ చేస్తే ఐ లవ్ మధు అని లేక అంటుంది. ఇంటర్ మిషన్.
తరువాత ఐ లవ్ మధు అని తన ఫ్రెండ్ మంజుతో చెప్తుంది. మధు మందుతాగుతాడట.. అనగానే హే మీ నాన్న, మీ అన్న తాగట్లేదా అని లేఖ అంటుంది. తరువాత సీన్లో నేనంటే నీకు ఇష్టమే కదా అంటే హా అంటాడు లేఖ వాల్ల నాన్న. ఐతే ఎప్పుడు చెప్పవెందుకు చెప్పాలి అని అంటుంది. తరువాత ఇంట్లో గోరింటాకు పెట్టుకుంటు వాళ్ల నాన్నమ్మతో మాట్లాడుతుంది. తరువాత సీన్లో వాళ్ల నాన్నతో స్కూటీ కొనమని చెప్తుంది. నీకు సైకిలే నడపడం రాదు.. స్కూటీ ఎందుకే అని వాళ్ల అమ్మ అంటుంది. సీనుగాడికి టెన్త్ అవగానే కొన్నారు నేను మీకు పుట్టలేదా.. దొరికానా అని అంటుంది.. అలా తన తమ్ముడితో, ఫ్రెండ్స్ తో ఎంతో సరదాగా ఉంటుంది. ముగ్గులేస్తుంది. పూజ చేస్తుంది. కుటుంబంతో కలిసి టెంపుల్ కు పోతుంది. నెక్ట్స్ సీన్లో మధు బైక్ పై ఇంటి చుట్టు చక్కర్లు కొడుతుంటాడు. తరువాత లేఖను తీసుకొని బైక్ లో వెళ్తాడు.
నెక్ట్స్ సీన్లో వాళ్ల అమ్మకు టిఫిన్ తీసుకొని వస్తుంది లేఖ. టాబ్లెట్స్ ఇస్తుంది. తరువాత సీన్లో వైన్స్ సాప్ దగ్గర మధు ఉంటే లాయర్ పిలుస్తాడు. ఉంగురం గురించి అడిగితే ఎవడికావాలి అని లాయర్ దగ్గర డబ్బులు తీసుకొని మందుకొనుకుంటాడు.
నెక్ట్స్ సీన్లో మధుతో మాట్లాడుతుంటాడు. నీ తాగుడు అలవాటు వల్లనే, లేదా నువ్వు కోపంగా ఉండడం వలనే నిన్ను వదిలేసి వెళ్లి ఉంటుంది అని మధు అంటుంది. దానికి మధుసుదన్ కొప్పడి వెళ్లిపో అంటాడు. తరువాత అతనికి స్కాచ్ ఇచ్చి యోగ చేయమంటుంది. తరువాత బాటిల్ తీసుకొని తాగుతాడు. ఇదే లాస్ట్ బాటిల్ అని చెప్తుంది. బాటిల్ జేబులో పెట్టుకొని రేపటి నుంచి ఇక్కడి రావద్దు ఇది మంచి ప్లేస్ కాదు అని చెప్పి బాటిల్ తీసుకొని వెళ్లిపోతాడు.
తరువాత సీన్లో లేఖ వాళ్ల అమ్మాను తీసుకొని హాస్పటల్ కు వస్తుంది. తన మదర్ హెల్త్ కన్నా నీ గురించి ఆలోచించి ఇలా అవుతుంది అని డాక్టర్ చెబుతుంది. తరువాత సీన్లో లేఖ బీచ్ లో కూర్చొని ఉంటుంది. నెక్ట్స్ సీన్లో మధు, తన ఫ్రెండ్ భూషన్ తో కలిసి మందు కొడుతుంటాడు. తాను జిమ్ కు వెళ్లినట్లు డబుల్ ఎక్సెల్ షర్ట్.. ఇప్పుడు లూజ్ అయిందని భూషన్ చెప్తాడు. తరువాత పిచ్చపాటిగా మాట్లాడుకుంటారు.
నెక్ట్స్ సీన్లో మధు, వాసుకితో మాట్లాడుతుంది. ఇక్కడికెందుకు దక్షను పిలిచావు అని అడుగుతుంది. నువ్వు చిన్నదానివి అని చెప్తుంది. తరువాత సీన్లో మధు, లేఖ, భూషన్ బేకరీలో మాట్లాడుకుంటారు. తనేంటి అలా అతుక్కొని మాట్లాడుతుంది నువ్వు కూడా కొంచెం కంట్రోల్ పెట్టాలి కదా అని భూషన్ అంటాడు. తరువాత సీన్లో భూషన్, మధు తన ఫ్రెండ్ తో సినిమాకు వెళ్తాడు. అక్కడ కొందరితో గొడవ పడుతుంటారు. ఇంటర్ మిషన్ లో కోక్స్ కొంటారు. అందులో మందుకలుపుకొని తాగి థియేటర్లో గోల చేస్తారు. మళ్లీ పైన సీటు వాళ్లు అరిస్తే వారితో గొడం పెట్టుకుంటారు. థియేటర్ నుంచి బయటకు వచ్చి ఓనర్ ను తిట్టి బయటకు వచ్చి అందరు తాగుతుంటారు. థియేటర్లో గొడవలో భూషన్ ను కొట్టాడు అని ఫ్రెండ్స్ అంటుంటారు. ఏం తాకలేదు.. గోరు తాకింది అని అంటాడు భూషన్. నన్ను వాడు కొడుతున్నా మధుగాడు సైలెంట్ గా ఉన్నాడు అని భూషణ్ బాధ పడుతుంటాడు.
తరువాత సీన్లో ఆసుపత్రిలో పనిచేసే రాజేష్ బర్త్ డేకి వస్తుంది. అక్కడ లేఖతో రాజేష్ మాట్లాడుతాడు.. లేఖ అంటే ఇష్టం అని చెప్తాడు. దాంతో ఎప్పుడు మీ కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకు అని హ్యాప్పి బర్త్ డేచ చెప్పి లేఖ వెళ్లిపోతుంది. తరువాత సీన్లో మధు, భూషన్ తన ఫ్రెండ్స్ తో బైక్ ల మీద వెళ్లి గ్రౌండ్ కు వెళ్లి థియేటర్లో గొడవ చేసిన ఫ్రెండ్స్ ను కొడుతారు. అక్కడ సీను వచ్చి మధుతో గొడవ పడుతాడు. కట్ చేస్తే సీను ఇంటికి వచ్చి మధుతో పరిచయం ఉందా.. అతన్ని రెగ్యూలర్ గా కలుస్తుంటావా.. ఆసుపత్రికి కూడా వెళ్లారా అని లేఖను అడుగుతాడు. అవును అని లేఖ చెప్తుంది.
నెక్ట్స్ సీన్లో సీను తో కలసి లేఖ ఒక ఫంక్షన్ కు వెళ్లి లంచ్ చేస్తుంటారు. సీను తనతో మాట్లాడు. నువ్వు చెప్పిందే జరిగిందని కోపమా.. సరే కోపం తగ్గాకే మాట్లాడు అని లేఖ అంటుంది. ఇదేంటి కొత్తగా.. మీ ఆసుపత్రిలో పనిచేసే రాజేష్ నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఆఫీస్ కు వచ్చి అడిగాడు అని చెప్తాడు. అప్పుడు వద్దన్నా వినకుండా మధును పెళ్లి చేసుకున్నావ్.. ఇప్పుడు వద్దంటున్నావ్ సమస్య ఏంటి అని సీను అడుగుతాడు. 20 ఏళ్ల బాధ నీకు 20 నిమిషాల్లో చెప్పలేను.. ఇంట్రెస్ట్ కూడా లేదు అని చెప్తుంది. అమ్మ ఎప్పుడూ నీతోనే ఉండదు, కొంచె అడ్జెస్ట్ అయితే వాడన్న నీ తోడు ఉంటాడు అని అంటాడు. వాన్ని పెళ్లి చేసుకునే ముందు హ్యప్పిగా ఉంటా అని చెప్పా.. కాని ఇప్పుడు నన్ను బ్లేమ్ చేసుకుంటున్నట్లు ఉందని చెప్తుంది.
తరువాత సీన్లో మధు, దక్షతో మాట్లాడుతుంది. అతను తనను ఫ్లర్టింగ్ చేస్తాడు. తరువాత భూషన్, మధు కూర్చొని మాట్లాడుకుంటారు. లేఖ రాజేష్ భర్త్ డే కు వెళ్లింది అని భూషన్ చెప్తాడు. ర్యాప్ సాంగ్ మొదలౌతుంది. మధు తాగుతుంటాడు. గొడవలు పడుతుంటాడు. తరువాత మధు అన్నం తింటుంటే వాళ్ల అమ్మ రోజంత బీచ్ లో ఎందుకు తిరుగుతావు అని అంటుంది. ఇక షేడీ మధుతో రీల్స్ చేస్తుంది. తరువాత యోగ టీచర్ మధుతో తన హస్పెండ్ గురించి మాట్లాడుతుంది. ప్రేమ అంతే లోపలికి వెళ్లడం, బయటకు రావడం అంత మనచేతులో ఉండదు అని చెప్తుంది. అలా షేడీ తో రీల్స్ చేస్తుంది. దక్షతో క్లోజ్ అవుతుంది మధు.
తరువాత రిపోర్ట్స్ వచ్చాయని లేఖకు ఇస్తుంది నర్సు. అవి చూసి సంతోషపడి లేఖ సినిమాకు వెళ్తుంది, బీచ్ లో ఆనందంగా తిరుగుతుంది. తరువాత మధు వాళ్ల మదర్ ను చూసి అక్కడినుంచి వెళ్లిపోతుంది. నెక్ట్స్ సీన్లో మధు, వాసుకి మాట్లాడుకుంటారు. తనకు ఫస్ట్ నచ్చేది కాదని ఇప్పుడు చాలా బాగా నచ్చావు అని వాసుకి చెప్తుంది. తరువాత వాళ్లిద్దరు కలిసి బోటులో వెళుతూ చిల్ అవుతారు. తను ఇప్పటి వరకు ఏ అబ్బాయితో మేకోవర్ చేయలేదు అని నిజాయితీగా చెప్తుంది మధు. తరువాత వాసుకికి మధుసుదన్ గురించి చెప్పి మీరు ఒక రోజు హ్యప్పిగా డేట్ చేయండి అని చెప్తుంది. అదే విషయాన్ని మధుతో చెప్తుంది. ఎందుకు చెప్పావు అని అంటాడు మధు. నువ్వు నా ఫ్రెండ్ వి కదా.. నీ ఫేస్ లో స్మైల్ చూడాలనుకున్న అని చెప్తుంది. మధు చిన్నగా నవ్వుతాడు.
తరువాత సీన్లో లేఖ గురించి సీను వాళ్ల నాన్న మాట్లాడుకుంటారు. అక్కడికి లేఖ వస్తుంది. మధు నీకు కరెక్ట్ కాదు అని సీను చెప్తాడు. నన్ను మధు చాలా ప్రేమిస్తాడు అని సీనుతో చెప్తుంది. తరువాత వాల్ల నాన్నతో మాట్లాడుతుంది. మీతో ఉన్నంత సేఫ్ ఫీలింగ్ మధుతో ఉంటే కలుగుతుంది. నేను సంతోషంగా ఉండే బాధ్యత నాదే అని చెబుతుంది. తరువాత వాళ్ల అమ్మతో, బామ్మతో కూడా మాట్లాడుతుంది. కట్ చేస్తే లాయర్ తో లేఖ మాట్లాడుంది. మా రిలేషన్ షిప్ లో మధు తప్పు ఏం లేదు, తను ఫస్ట్ నుంచి అలానే ఉన్నాడు.. మారుతాడు అనుకున్నా కాని నేనే మారా అని.. ఇంకో ఛాన్స్ ఇవ్వు అంటే ఓపిక పోయింది అని చెప్తుంది.
తరువాత సీన్లో వాసుకి ఇంట్లో మధు మందు తాగుతుంటాడు. మధు, వాసుకి ఇద్దరు రెడీ అవుతారు. తరువాత మధు దక్ష తో డేట్ కు వెళ్తున్నట్లు చెప్తుంది. మధు, వాసుకి కూర్చొని మాట్లాడుకుంటారు. వాసుకు తన భర్తగురించి, మధు తన వైఫ్ గురించి మాట్లాడుకుంటారు. తరువాత సీన్లో షేడీని తీసుకొని మధు, దక్ష ఉంటున్న ప్లేస్ దగ్గరకు వస్తుంది. షేడీకు ముద్దు ఇచ్చి బాయ్ చెప్తుంది. తరువాత దక్షతో క్యాంప్ ఫైర్ వేసుకొని వైన్ తాగుతుంటారు. ఇద్దరు ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటు రొమాంటిక్ గా మాట్లాడుకుంటారు. తరువాత సీన్లో వాసుకి, మధు ఇద్దరు మందు తాగుకుంటు మాట్లాడుకుంటారు. మొదటి సారి లేఖను కలిసిన విషయాన్ని వాసుకికి చెప్తాడు. తనమీద ప్రేమను లేఖతో చెప్పావా అంటే.. చెప్పాలా.. అర్థం కాదా అని హర్ష్ గా మాట్లాడుతాడు. మీకు ఒకరిమీద కోపం ఒకరిమీద చూపించే అలవాటు ఉందా అని వాసుకి అడుగుతుంది. మధుసుదన్ సైలెంట్ గా ఉంటాడు.
తరువాత దక్ష, మధు ఇంటిమేట్ అవుతారు. మరో సీన్లో వాసుకి తన హస్బెండ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవుతుంది. ఎందుకు వదిలివెళ్లావు అని గట్టిగా అడగాలని ఉందని చెప్తుంది. నీ వైఫ్ ఇక్కడే ఉంది కదా, నీకు ఛాన్స్ ఉంది కారణం ఏంటో కనుక్కో అంటుంది. అందరి లైఫ్ లో ఇది కుదరదు అని నేను సున్నితంగా పెరగలేదు అని మధు చెప్తాడు. నా ప్రేమ, కోపం అన్ని తనమీదే చూపించా అర్థం చేసుకోలేదు వెళ్లిపోయింది అని మాట్లాడుతాడు.
తరవాత దక్షను ప్రేమిస్తున్నట్లు మధు చెప్తుంది. దానికి దక్ష ప్రాక్టికల్ గా మాట్లాడు… నువ్వే నా వెంట పడ్డావు.. నువ్వు ఎవరికైనా ఈజీగా పడిపోతావు అని అంటాడు. దాంతో మధు బాధ పడుతూ నడుచుకుంటు వస్తుంది. అదే సమయంలో వాళ్ల అమ్మ డాడీ ఫోన్ నుంచి కాల్ చేస్తుంది. ఎలా ఉన్నావు అని అడిగితే.. నువ్వే గెలిచావు అని ఏడుస్తుంది మధు. నాకు ఎం కావాలో తెలియదు, నన్ను ఎందుకు ఎవ్వరు లవ్ చేయరో అర్థం కాదు అని ఏడుస్తుంది. ఆ మాటలకు మధు మదర్ బాద పడుతుంది. నేను నీ అమ్మను అని చనిపోయేంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్తుంది. చెప్పు ఏం అయిందో అని అంటుంది. కట్ చేస్తే మధు బార్లోకి వస్తాడు. అక్కడే సీను ఉంటాడు. చిన్నప్పుడు చాలా మాట్లాడేది, ఇప్పుడు మాట్లాడడమే మానేసింది అని తన ఫ్రెండ్స్ తో సీను అంటాడు. దాంతో మధును బయటకు పిలిచి ఫైట్ చేసుకుంటారు. మరో సీన్లో ఈ విషయం గర్ల్స్ మధ్యే ఉండాలి నాన్నకు చెప్పొద్దు.. వెంటనే బయలు దేరి అమెరికా వచ్చేయి అని మధు మదర్ అంటుంది. ఇటు పోలీస్టేషన్లో స్మోక్ చేస్తున్న మధును పోలీసులు పిలిచి కొట్టి షర్ట్ విప్పి కూర్చొబెడుతాడు. లేఖ దగ్గరకు వాళ్ల వదిన వచ్చి.. లోపలికి వెళ్లి అటెప్టూ మర్డ్రర్ కేసు పెడుదామని చెప్తుంది. దానికి లేఖ ఒప్పుకోదు.. మీరు మీరు ఒక్కటే అని వాళ్ల వదిన అంటుంది. తరువాత సీను తీసుకొని వెళ్లిపోతుంది.
తరువత సీన్లో షేడో దగ్గరకు వాళ్ల ఫ్రెండ్ వెళ్లి మధు వెళ్లిపోయిందట అని చెప్తాడు. షేడో బాధపడుతాడు. ఈ సారి నిజంగానే వెళ్లిపోయింది అనుకుంటాడు. మరో సీన్లో మధు రాత్రి జరిగిన గాయాన్ని అద్దంలో చూసుకుంటాడు. అక్కడికి వాళ్ల అమ్మ వచ్చి ఏందుకురా దెబ్బలు తాకించుకుంటావు.. ఎవరిమీదో కోపాన్ని ఎవరిమీదో చూపిస్తావు అంటుంది. స్నానం చేసి టిఫిన్ తింటుంటే.. మొదట్లో లేఖను చూస్తే కోపం వచ్చేది.. నా కన్న ఎక్కువగా ప్రేమిస్తుందని, తరువాత ధైర్యం వచ్చింది. ఒక సారి తనతో మాట్లాడు, మనల్ని పిచ్చిగా ప్రేమించే వాల్లు కూడా మొండొళ్లే అంటుంది. మధు లేఖతో గొడవ పడిన సందర్భాలను గుర్తు చేసుకుంటాడు. తన బైక్ మీద వెళ్తూ తనతో హార్ష్ గా మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటాడు. తనకు ఇష్టమైన షర్ట్ ఐరెన్ చేసుకుంటాడు. మార్వడి షాప్ కు వెళ్లి తాకట్టుపెట్టిన ఉంగురాన్ని తీసుకుంటాడు. తరువాత బీచ్ లో లేఖ ప్రేమగా మాట్లాడుతుంది. ఎప్పుడు వాగుతూనే ఉంటావా అని మధు అంటాడు. తరువాత ఆసుపత్రిదగ్గర వెయిట్ చేస్తుంటాడు. లేఖ చూస్తుంది. మధు దగ్గరకు వస్తుంది. తన చేతులో ఉంగురం పెడుతాడు. మ్యూచువల్ డైవర్స్ పేపర్లు ఇచ్చి వెళ్లిపోతాడు. లేఖ అలానే ఏ ఏమోషన్ లేకుండా చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే.. వాళ్ల యంగ్ ఏజ్ లో సముద్రం ఒడ్డున మధు, లేఖ ఇద్దరు ఉంటారు. నీ తప్పు ఏముంది నీకు తెలిసినట్లు నువ్వు ప్రేమించావు, నాకు తెలిసినట్లు నేను ప్రేమించాను అని లేఖ అంటుంది. ఇదే మంత్ ఆఫ్ మధు.