Kaathal the Core: ఓపెన్ చేస్తే ఓ చర్చీలో ప్రేయర్ జరుగుతుంది. అక్కడే ఓమన, మాథ్యూ కూడా ఉంటారు. ఇద్దరు భార్యభర్తలు. ప్రేయర్ ముగిసిన తరువాత ఓమన తన ఫ్రెండ్ తో కలిసి నటుచుకుంటూ వస్తుంది. మేరీ మాత టెంపుల్ దగ్గర క్యాండిల్ ముట్టించడానికి ఆగుతుంది. అక్కడ క్యాండిల్స్ వెలిగిస్తుంటే తన కూతురు ఫెమి వస్తుంది. నాన్న రాలేదా అంటే చర్చీలో ఉన్నప్పుడు ఆ సెబీ వచ్చి తీసుకెళ్లాడు అంటుంది. పార్టీ పని మీద వెళ్లాడా అని కూతురు అడిగితే ఏమో తెలియదు అని ఓమన చెప్తుంది. నాన్నతో చెప్పావా అని ఫెమి అడిగితే ఓమన ఆలోచనలో పడుతుంది. తరువాత సీన్లో మాథ్యూవ్, సెబి కార్లో వెళుతూ ఒక లవ్ మ్యాటర్ గురించి మాట్లాడుకుంటారు. ఈ సమస్యను మీరు సాల్వ్ చేస్తే మొత్తం నాలుగు ఓట్లు మనకే అని సెబి అంటాడు. ఇలాంటివి నావల్ల కాదు అంటే మీరే ఎలాగైనా లవ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలని చెప్తాడు. తరువాత రెహానా ఇంటికి వెళ్తారు. ఇంట్లో పని చేసే వాడు నా కూతుర్ని ప్రేమించాడు అని రెహానా తండ్రి అంటాడు. ఈ విషయం గురించి వీళ్లకు ముందే చెప్పాను అని రెహానా అంటుంది. మేము ఇద్దరం ప్రేమించుకున్నాము అని అబ్బాయి అంటాడు. దాంతో పిల్లల ప్రేమను అర్థం చేసుకొని వారి ఇష్ట ప్రకారమే పెళ్లి చేయండి అని మాథ్యూవ్ అంటాడు. దాంతో నా బాధ ఎవరి చెప్పాలి అంటూ తండ్రి లోపలికి వెళ్తాడు. అక్కడి నుంచి మాథ్యూవ్, సెబి వెళ్లిపోతారు.
చదవండి:Animal Movie: యానిమల్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన అక్తర్
నెక్ట్స్ సీన్లో మాథ్యూవ్ ఇంట్లో నైట్ డిన్నర్ చేస్తుంటారు. పార్టీలో నిలబడడం మంచిదే అని ఓమన అన్నయ్య టామీ అంటాడు. టామీ మాథ్యూవ్ ఫాదర్ దేవస్యని పెగ్ తాగు అని అంటాడు. అక్కడికి ఫెమి వస్తుంది. తరువాత ఫెమికి కూడా ఓ పెగ్ పోస్తాడు. కాసేపు మాట్లాడుకుంటారు. నెక్ట్స్ సీన్లో రంగన్న లేడీస్ కు డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు. అదే సమయంలో వాళ్ల అల్లుడు స్కూల్ ఫ్రెండ్ తో గొడవ పడుతున్నాడు కార్లో ఉన్నావిడ చెప్పడంతో రంగన్న కిందకు దిగి వాళ్లను విడిపించి పక్కకు తీసుకొని వస్తాడు. ఈ కొట్లో కొనుక్కో అని చెప్తాడు. కట్ చేస్తే అల్లుడిని తీసుకొని ఇంటికి వస్తే అక్కడే వాళ్ల అమ్మ తన చెల్లిని ఎత్తుకొని ఆడిస్తుంది. చెల్లిని తీసుకొని ఇంట్లోకి వెళ్తుండగా.. వీకెండ్స్ ఇంటికి రావచ్చు కదా అని అంటే.. నీ మొగుడు లేనప్పుడు చెప్పమ్మ ఆలోచిస్తాను అంటాడు.
నెక్ట్స్ సీన్లో మాథ్యూవ్ సీఆర్పీ పార్టీ మీటింగ్ లో ఉంటాడు. 3వ వార్డు నెంబర్ నుంచి పోటీ చేయాలని మాథ్యూవ్ ను పార్టీ నియమించిందన నబీ చెప్తాడు. సర్వీస్ బ్యాంక్ లో ఆయన ఎంతో సేవా చేశాడు అందుకే ఆయనే పోటీ చేయడమే మంచిదని నబీ చెప్తాడు. దానికి మాథ్యూవ్ థ్యాంక్స్ చెప్తాడు. తనకు పోటీ చేయడం ఇష్టమే అని చెప్తాడు. అందరూ చప్పట్లు కొడుతారు. రాత్రి పడుకునే ముందు ఎలక్షన్స్ గురించి ఓమనతో అడిగితే నువ్వు సమర్థుడివే అని చెప్తుంది. అమ్మాయి త్వరగా వచ్చి వెళ్లింది అని అడిగితే కాలేజీలో ఏదో ఫెస్ట్ జరుగుతుందట అందుకే త్వరగా వెళ్లిపోయింది అని చెప్తుంది. ఓమన ఏదో డిప్రెస్ డ్ గా ఉన్నట్లు కనిపిస్తుంది.
ఉదయం ఓమన తాను రాసిన కథను పబ్లిషర్ కు ఇస్తుంటే వాళ్ల మామ వస్తాడు. అదే సమయంలో పేపర్ చదువుతున్న మాథ్యూవ్ ఇంట్లోకి వెళ్తాడు. కట్ చేస్తే ఈ రోజు నుంచి ఎలక్షన్ పనులు మొదలు అవుతున్నాయి అంటే ఓమన శుభాకాంక్షలు చెప్తుంది. ఈ విషయాన్ని నాన్నతో నువ్వు చెప్పు అంటాడు. తరువాత ఆఫీస్ కు వెళ్తాడు. మరో సీన్లో ఓమన తన పని మీద బయటకు వెళ్తుంది. మరో సీన్లో సీఆర్పీ పార్టీ ఆఫీస్ లో నామినేషన్ల గురించి మాట్లాడుకుంటే అక్కడికి నబీ తమ్ముడు వచ్చి నబీని పక్కకు పిలిచి ఇలాంటి టైమ్ లో కేసు ఏంటని టెన్షన్ పడుతుంటాడు.
తరువాత రంగన్న అల్లుడు ఇంటికి వచ్చి చిరాకుగా కూర్చుంటాడు. ఏం జరిగింది అని రంగన్న అంటే మీకు మాథ్యూవ్ సర్ కు మధ్య ఏం జరుగుతుంది అని చెప్పి ఇంట్లోకి వెళ్తాడు. రంగన్న అలానే చూస్తూ ఉంటాడు. మరో సీన్లో టామీ ఓమన్ తో మాట్లాడుతాడు. కుటుంబం అన్నాకా గొడవలు సహజం అని సర్దుకుపోవాలి అని టామి అంటాడు. ఈ వయసులో డివోర్స్ తీసుకొని ఏం చేస్తావు అని, అడ్డమైన బుక్ లు చదివి, రాసి నీ బుర్ర పాడైపోయింది అని తిట్టి బయట కూర్చుంటాడు. అదే సమయంలో మాథ్యూవ్ వస్తాడు. ఇంట్లోకి రాగానే ఓమన ఏమి మాట్లాడదు. ఫేస్ వాష్ చేసుకొని ఇంట్లో ప్రేయర్ లో పాల్గోంటాడు. ప్రేయర్ ముగిసిన తరువాత అందరూ ప్రేస్ ద లార్డ్ చెప్పుకుంటారు. నెక్ట్స్ సీన్లో అక్కడ ఏం జరుగుతుంది నాన్న అని ఫారెన్ లో తన కూతురు వీడియో కాల్ చేస్తుంది. దేవస్య ఆలోచనలో పడుతాడు.
నెక్ట్స్ సీన్లో ఓమన కథ రాసుకుంటుంటే మాథ్యూవ్ వచ్చి కోపంగా ఇది ఎంత సీరియస్ విషయమో తెలుసా అని అంటాడు. నేను ఎలక్షన్లో నిలబడుతున్న అని చెప్పాగా అంటాడు. ఈ పిటిషన్ రెండు నెలల ముందే ఇచ్చాను అని చెప్తుంది. తరువాత సీన్లో సీఈర్పీ పార్టీ మీటింగ్ లో నబీతో వాళ్ల తమ్ముడు మాట్లాడుతుంటాడు. మాథ్యూవ్ ను ఎలక్షన్లో నిలబెట్టడం కరెక్ట్ కాదు అని అంటాడు. అది అతని పర్సనల్ విషయం అని నబీ అంటాడు. అదే సమయంలో మాథ్యూవ్ వచ్చి నేను పోటీనుంచి తప్పుకుంటాను అని అంటే.. లేదు పార్టీ హైకమాండ్ మిమ్మల్నే నిలబడమన్నది అని నబీ చెప్తాడు. సరే అని మాథ్యూవ్ వెళ్లిపోతాడు. అక్కడి నుంచి స్కూటర్ పై వెళ్లుంటే రంగన్న స్టూడెంట్స్ మాథ్యూవ్ గురించి మాట్లాడుకుంటారు. రంగన్న కోపంగా కార్లో కూర్చుంటాడు.
మరో సీన్లో పార్టీ ప్రచారంలో భాగంగా మాథ్యూవ్ ఫ్లెక్సీలను కడుతారు. తరువాత రోజు అపోజిట్ పార్టీ వాళ్లు ప్రచారం చేస్తుంటారు. మాథ్యూవ్ పై ఎలాంటి కేసు ఉందో తెలుసా అలాంటి వాడికి ఓటు వేయకండి అని చెప్తాడు. నేను ఎవరికి వెయ్యాలో నాకు తెలుసు అని వాళ్లతో చెప్తాడు ఓటర్. అందరి మొహాలు వాడిపోతాయి. తరువాత మాథ్యూవ్ తో సెబీ మాట్లాడుతాడు. మీరు కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండాలి అని చెప్తాడు. ఫెమికి దీని గురించి తెలుసా అంటే తెలుసనే అనుకుంటున్నాను అంటాడు. కట్ చేస్తే ఫెమి బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడికి మాథ్యూవ్ వస్తాడు. మీ అమ్మ ఎందుకు ఆ డిసిషన్ తీసుకుందో అని, ఏదైనా చెప్తేనే కదా నాకు తెలిసేది అని అంటాడు. నాకు అబద్దం ఆడని నాన్నంటేనే ఇష్టం అని చెప్పి… ఉండండి గేమ్ ఫినిష్ చేస్తా అని వెళ్లిపోతుంది. తరువాత మాథ్యూవ్ కూడా వెళ్తాడు.
మరో సీన్లో రంగ తన అల్లుడిని తీసుకొని వెళ్తుంటే అక్కడే ఉన్న కొంత మంది నీ అల్లున్ని ముందు కూర్చొబెట్టి నువ్వు వెనుక కూర్చో అని కామెంట్ చేస్తుంటారు. దాంతో తన అల్లుడు వెళ్లిపోతాడు. రంగన్న అలా చూస్తుంటాడు. తరువాత సీన్లో మాథ్యూవ్ ఇంట్లో ఆలోచిస్తూంటే ఫోన్ రింగ్ అయిందని ఓమన వస్తుంది. నా గురించి కొంచెం అన్నా ఆలోచించవ, ఈ పిటీషన్ తో నేను ఏం చేయాలి అని అంటాడు. నీకే అలా ఉంటే నాకు ఎలా ఉంటుంది. ఆ పిటీషన్ తప్పు అనిపిస్తే నువ్వు ఓ లాయర్ ను పెట్టుకొని వాదించు అని వెళ్లిపోతుంది. మాథ్యూవ్ ఆలోచిస్తూ ఉంటాడు.
తరువాత సీన్లో సెబీతో కలిసి క్రాస్ పిటీషన్ వెయడానికి లాయర్ దగ్గరకు తీసుకెళ్తాడు. మాథ్యూవ్ తో మాట్లాడుతుంది. మీ వైఫ్ తరుపున ఉన్న లాయర్ అమిరా గురించి తనకు బాగా తెలుసు అని చెప్తుంది. మీ వైఫ్ ను ఫిజికల్ గా సంతోషపెట్టడం లేదని పిటీషన్ లో ఉందని అంతకు మించి ఏం లేదని, దాన్ని మనం అపోజ్ చేస్తే ఈ కేసు ఎప్పటికి తేలదు అని చెప్తుంది. అయితే ఎలక్షన్స్ ఉన్నందున త్వరగా తేలితే బాగుంటుందని సెబీ అంటాడు. అయితే మనం హైకోర్టుకు ఓ అర్జీ పెట్టుకందామని అంటుంది. మీ వైఫ్ ఎవరితో అన్న రిలేషన్ షిప్ లో ఉందా అంటే అదేమి లేదని చెప్తాడు. తరువాత రంగ పేరు ప్రస్తావించారు అతనితో మీ రిలేషన్ ఏంటి అంటే జస్ట్ హాయ్, బాయ్ మాత్రమే అని చెప్తాడు. తరువాత మీ ఇద్దరి రిలేషన్ ఎలా ఉంది అంటే బాగుందని సెబీ అంటాడు. నేను అడిగేది అతన్ని అంటుంది. 20 సంవత్సరాలుగా కలిసే ఉన్నాము కొత్తగా ఏ ప్రాబ్లమ్ ఉంటుంది అని మాథ్యూవ్ అంటాడు. తన భార్యకు డైవర్స్ ఇవ్వాలని లేదు అని అంటాడు. తరువాత నీతో పర్సనల్ గా మాట్లాడాల్సి ఉంటుంది అని లాయర్ చెప్తుంది.
కట్ చేస్తే ఓమన, మాథ్యూవ్ కోర్టులో ఉంటారు. ఇద్దరి పిటీషన్లు విని కౌన్సిలింగ్ తీసుకోండి అని జడ్జ్ చెప్తారు. ఓమన కౌన్సిలింగ్ లో ఉంటుంది. మాథ్యూవ్ బయట కూర్చొని ఉంటాడు. అక్కడే ఒక లేడీ వచ్చి నా దగ్గర ఒక ముంబాయి అమ్మాయి ఫ్రొఫైల్ ఉందని తను నీకు చక్కగా సెట్ అవుతుంది అని అంటుంది. మాథ్యూవ్ పట్టించుకోడు. అక్కడికి ఓమన వచ్చి కౌన్సిలింగ్ కు రమ్మంటుంది. ఓమన చాలా క్లియర్ గా ఉంది. మీరు ఏదైనా చెప్తేనే కదా ప్రాబ్లమ్ ఏంటో తెలిసేది అని మేడమ్ అంటుంది. మాథ్యూవ్ అలానే చూస్తూ ఉంటాడు. తరువాత ఇద్దరు కలిసి కార్లో ఇంటికి వస్తారు.
మరో సీన్లో రంగ ఇంటి దగ్గర ఏదో పని చేపిస్తుంటాడు. నీకే బోలేడు సమస్యలు ఉన్నాయి మాథ్యూవ్ తో ఏంటి సంబంధం, రేపు ఏదైనా సమస్య వస్తే ఎవరు నీకు హెల్ప్ చేయరు అని రెహాన తండ్రి అంటాడు.
తరువాత సీన్లో అపోజిట్ పార్టీ వాళ్లు ప్రచారం చేస్తూ ఉంటారు. మాథ్యూవ్ లాంటి వారు మనకు అవసరం లేదని, ఆయన సమస్యను కూడా సీఆర్పీ పార్టీ ప్రచారం చేస్తుందని మాథ్యూవ్ పై నెగిటీవ్ గా కామెంట్ చేస్తూ ప్రచారం చేస్తారు. అదే సమయంలో మాథ్యూవ్ తన టీమ్ తో కరపత్రాలు పంచుతుంటారు. వర్షం స్టార్ట్ అవుతుంది. నా ఓటు మాథ్యూవ్ సర్ కే అని ఒక అతను వస్తే అతని కరపత్రం ఇస్తాడు. అక్కడే రంగ ఉంటాడు. అతనికి కూడా కరపత్రం ఇస్తాడు. తాను వెళ్లి కార్లో కూర్చుంటారు. రంగ మాథ్యూవ్ ను చూస్తాడు. మాథ్యూవ్ అలా చూస్తుంటే రంగ వెళ్లిపోతాడు. ఫెమి కాలేజీలో ఫెస్ట్ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే తాను ఆందోళనగా ఉంటుంది. వర్షం పడుతుందని ఓమన మేరీ మాత చర్చి దగ్గర నిలుచొని ఉంటుంది. అక్కడే మాథ్యూవ్ ఫోటో కనిపిస్తుంది. తరువాత మాథ్యూవ్ ఫాదర్ అలా చూస్తూ ఉంటాడు. తరువాత రంగ తనకు ఇచ్చిన మాథ్యూవ్ ఫోటోను తీసుకొని చూస్తుంటాడు.
తరువాత కోర్టులో మాథ్యూస్ బై ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు కాబట్టి మూడు నెలల్లో పూర్తి కావాలని హై కోర్టుకు పిటీషన్ పెట్టుకున్నట్లు లాయర్ చెప్తుంది. సరే అని వచ్చే నెల 18కి పెట్టుకుందాం అని జడ్జి చెప్తాడు. ఇద్దరు లాయర్లు ఓకే అంటారు. తరువాత సీన్లో రంగ కిరణం కొట్లో పాలపాకెట్ తీసుకొని వెళ్తుండగా అక్కడికి మాథ్యూవ్ నాన్న వచ్చి పల్లి పట్టీలు అడుగుతాడు. రంగ వెళ్తుండగా పెద్దయానకు అవి ఇవ్వు అన్న అని బిన్ని చెప్తాడు. దాంతో రంగ మొహం చాటేసుకొని ఏదో అపరాధ భావంతో పల్లీ పట్టీలు ఇస్తాడు.
ఫాదర్ ఇంటికి వస్తాడు. ఓమన నిర్ణయం వలన వాళ్ల అమ్మకు హార్ట్ ఎటాక్ వచ్చిందని టామీ అంటాడు. రేపు వయసు అయిపోయిన తరువాత ఎవరు చూసుకుంటారు అని అంటాడు. అదే లేదు ఫాదర్ నేను అమ్మ కలిసే ఈ పిటీషన్ ఇచ్చాము అని ఓమన అంటుంది. మన చర్చిలో కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు అని చర్చి నుంచి మాథ్యూస్ తొలగించాలి అంటున్నారని ఒకరు అంటాడు. వీటిన్నింటికి ఒకే పరిష్కారం మీరు మనుసు మార్చుకోండి, మాథ్యూవ్ కంప్రమైజ్ కు రెడీగానే ఉన్నాడు అని ఫాదర్ అంటాడు. అలా అయితే నేను సంతోషంగా ఉండకూడదా, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని ఓమన అంటుంది. మీరు మాట్లాడరా అంకుల్ అని టామీ అంటే దెవస్య మౌనంగా ఉంటాడు. అందరూ లేచి వెళ్లిపోతారు. తరువాత టామితో ఓమన మాట్లాడుతూ నా సంతోషాన్నే కోరుకుంటే నాకు తోడుగా ఉండండి అని చెప్పి వెళ్తుంది.
తరువాత సీన్లో సెబీ ఫోన్ చేసి ఓమన్ అక్కకు ఒక ఫోన్ వస్తుంది దాని గురించి అడిగితే ఏం చెప్పకండి అని అంటాడు. తరువాత ఓమనకు క్రిష్ అనే వ్యక్తితో సెబిన్ ఫోన్ చేయిస్తాడు. మీ హస్బెంబ్ పరువు తీయాలంటే మీరు చేస్తున్న పనే సరైనది, మీకు సపోర్ట్ గా మేము ఉంటాము. మీరు దేనికి బయపడకండి. ఎన్నికల్లో ఎలాగో ఓడిపోతాడు. ఇక కేసులో ఓడిపోతే నీ హస్బెండ్ రోడ్డుమీద నిలబడుతాడు అని అంటాడు. అలాగే కానివ్వండి అని ఓమన అంటుంది. తరువాత మాథ్యూవ్ నడుచుకుంటూ వెళ్తుంటే నిన్ను బాధ పెడితే నేను బాధ పడుతా అని మీకు తెలుసు కదా.. అందుకే కదా ఇలా ఫోన్ చేయించారు అని అంటుంది. తరువాత సీన్లో చర్చిలో ప్రేయర్ చేసి మేరి మాత విగ్రహంతో అందరూ పాదయాత్ర చేస్తుంటారు. అక్కడే మాథ్యూవ్ ఫ్యామిలితో చూస్తుంటాడు.
నెక్ట్స్ సీన్లో కోర్టులో ఓమన, మాథ్యూవ్ ఉంటారు. ఓమనను క్వశ్చన్స్ అడుగుతారు. నీ భర్త హోమో సెక్స్ వల్ అని కేసు పెట్టారు కదా, మీకు పాప ఉంది, తన వయస్సు 19 సంవత్సరాలు కదా అని అడుగుంది. ఓమన అవును అంటుంది. నీ భర్త హోమో సక్స్ వల్ అయినప్పుడు ఆ బిడ్డను ఎలా కన్నావు అంటే, నాకు బిడ్డ కావాలిని అడిగాను, ఇద్దరము కలిసే తమ బిడ్డను కన్నట్లు చెప్తుంది. మీ భర్తతో ఫిజికల్ రిలేషన్ షిప్ ఎలా ఉంటుంది. ఎన్నిసార్లు కలిశారు అని లాయర్ అడిగితే నాలుగు సార్లు అని ఓమన చెప్తుంది. నెలకు నాలుగు సార్లు అంటే ఇది మంచి రిలేషన్ షిపే కదా అంటే.. పెళ్లి అయిన దగ్గర నుంచి మొత్తం నాలుగు సార్లు అని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. రంగతో మీ హస్పెండ్ కలిసి ఉన్నప్పుడు చూశావా అంటే లేదు అని చెప్తుంది. అమీర తల పట్టుకుంటుంది. దాంతో అతడు తప్పు చేశాడు అని ఎలా డిసైడ్ అయ్యావు అని లాయర్ అంటుంది.
తరువాత మాథ్యూవ్ బోనులో నిలబడి ఉంటాడు. హోమో సెక్స్ వల్ అనేది పర్సనల్ ఛాయిస్ కదా అంటే అవును అంటాడు మాథ్యూవ్. నీకు రంగకు ఏంటి సంంబంధం అంటే, ఏం లేదని అంటాడు. మీ భార్యను నీతో సంతోషంగా లేదని తెలియదా అంటే తాను బానే ఉంటుంది అనుకున్నట్లు చెప్తాడు. తీర్పు వాయిదా పడుతుంది. బయటకు వస్తూ లాయర్ మాథ్యూవ్ పై అరుస్తుంది. సొంత లాయర్ దగ్గర నిజాలు దాచిపెడితే ఎలా వాదించేది అని అంటుంది. మాథ్యూవ్ సైలెంట్ గా ఉంటాడు. తరువాత తన కారు దగ్గరకు వస్తుంటే.. అక్కడ ఎల్ జీబీటీ కమ్యూనిటీ నుంచి తాను వచ్చినట్లు ఒక అతను చెప్తాడు. ఈ సమస్యతో చాలా మంది బాధ పడుతున్నారు అని మీకు సపోర్టుగా మన కమ్యూనిటీ ఉంటుంది అని చెప్తాడు. అతన్ని పట్టుంచుకోకుండా మాథ్యూవ్ కార్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు.
తరువాత సీన్లో ఓమన బైబిల్ చదువుతుంది. దేవస్య అక్కడే మౌనంగా కూర్చొని ఉంటాడు. మాథ్యూస్ కూడా తన గదిలో మౌనంగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఓమన వేదనతో పడుకుంటుంది. మరో సీన్లో రంగ తన ఇంట్లో ఆలోచిస్తూ ఉంటాడు. తరువాత సీన్లో మాథ్యూవ్ ఇంటికి వస్తాడు. అక్కడే టామీ ఉంటాడు. తన కొడుకు యూఎస్ వెళ్తున్నాడు అని చెప్తాడు. దానికి మాథ్యూవ్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాడు. పెళ్లికి ముందు ఓమన ఒకతన్ని ఇష్టపడింది అని అప్పుడు తాను సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు నీ విషయంలో సపోర్ట్ చేయమంటుంది అని అంటాడు. ఓమన చాలా మంచింది బావ అంటాడు. మీ వల్ల అయితే తన మంచి కోరుకోండి అని అంటాడు. మరో సీన్లో దేవస్య దేవుడికి ప్రేయర్ చేస్తాడు. తరువాత ఇంటికి వస్తాడు. మామ టీ తాగుతారా అంటే వద్దంటాడు. మాథ్యూవ్ తో సర్దుకుపోయే దారి ఉంటే సర్దుకుపో అమ్మ అని అంటాడు. ఈ సమయంలో మాథ్యూవ్ ని చూడాలంటే భయమేస్తుంది అని అంటాడు. ఇన్ని రోజులు సర్దుకుపోయాను అది మీ మొహం చూసే, మీరు నా తండ్రి కన్న ఎక్కువ అని అంటుంది. కానీ ఇక మీదట ఇలానే ఉండలేను అని చెప్తుంది.
మరో సీన్లో రంగ తన ఫ్రెండ్ తాగుతుంటారు. ఇంకా మందు తాగు అని రంగ అంటాడు. మన డ్రైవింగ్ స్కూల్ కు చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు. ఎందుకంటే నేను వాళ్లను ఏం చేయనని నమ్మకం, నా టేస్ట్ వేరే అని అందరికీ తెలిసిపోయింది అని ఫీల్ అవుతాడు. తరువాత అక్కడి నుంచి వెళుతుంటే కింద తన అల్లుడు వాప్టింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు తాగావురా అంటే నన్ను అందరూ ఎగతాలి చేస్తున్నారు అని ఏడుస్తాడు. నీకు అమ్మ, చెల్లెలు ఉంది ఇలా తాగితే ఎలా అని దగ్గరకు తీసుకొని ఓదారుస్తాడు రంగ.
నెక్ట్స్ సీన్లో సీఆర్పీ పార్టీ మీటింగ్ జరుగుతుంది. అపోజిట్ పార్టీ వాళ్లు చాలా స్పీడ్ గా ప్రచారం చేస్తున్నారు అని మనం కూడా స్పీడ్ పెంచాలని అంటారు. ఎన్నికల లోపు తీర్పు కూడా వచ్చేస్తుంది అని మాట్లాడుకుంటారు. మీటింగ్ ముగిసింది, అందరూ టీలు తాగి నెక్ట్స్ ప్రచారం చేద్దామని అంటుండంగా మాథ్యూవ్ కు ఫోన్ వస్తుంది. చెప్పండి లాయర్ అంటే కేసు ఇంకా కాంప్లికేట్ అవుతుంది. రేపు వాళ్లు విట్ నెస్ కూడా తీసుకొస్తున్నారట అని చెప్తుంది. ఎవరు ఆ విట్ నెస్ అని అడిగి షాక్ అవుతాడు. తన చేతులో ఉన్న ఫోన్ జారి కింద పడుతుంది. కట్ చేస్తే కోర్టులో కేసు నడుస్తుంది.
ఈ కేసులో సాక్షి ఉండని లాయర్ చెప్తుంది. సాక్ష్క్షి ఎవరు అంటే దేవస్య అని పిలుస్తాడు. ఆయన వచ్చి బోనులో నిలబడుతాడు. అంతా నిజమే చెప్తా అంటాడు. తన కొడుకు గురించి ఎలా తెలుసు అంటే అతను నా కొడుకు అంటాడు. ఎప్పుడు తెలిసింది అంటే… తన కొడుకు హోమో సెక్స్ వల్ అని చిన్నప్పుడే తెలిసిందని, తన బలవంతం వలనే పెళ్లికి ఒప్పుకున్నట్లు చెప్తాడు. తరువాత ఓమన వచ్చి తన మామను తీసుకెళ్తుంది.
మరో సీన్లో రంగ వాళ్ల అల్లుడిని తన చెల్లితో పంపించేస్తాడు. రెండు రోజుల్లో తిరిగి పంపిస్తాను అని తన చెల్లెలు అంటుంది. రంగ అలా దిగాలుగా కూర్చొని ఉంటాడు. తరువాత దేవస్య ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అక్కడికి మాథ్యూవ్ వస్తాడు. తన తండ్రితో మాట్లాడుతాడు. కేసు అందరికి తెలిసిపోయింది అని అంటాడు. డాక్టర్ చెప్పిన వినకుండా పెళ్లైతే అన్ని సర్దుకుంటాయి అన్నారు. ఇప్పుడు ఏం అయింది నా భార్యకు అన్యాయం జరిగిందని అని బాధపడుతాడు. తన తండ్రి తన భుజంపై వాలి ఈ తప్పంత తనదే అంటాడు. ఇద్దరు ఏడుస్తారు. వీళ్ల మాటలను ఓమన వింటుంది.
తరువాత రంగ మాథ్యూవ్ కు కాల్ చేయాలని ట్రై చేస్తాడు, కానీ ధైర్యం సరిపోక కట్ చేస్తాడు. నెక్ట్స్ సీన్లో ఓమన పడుకొని ఉండగా మాథ్యూవ్ వస్తాడు. తాను లేచి కూర్చుంటుంది. తాను కూర్చొని సారీ చెప్తాడు. ఈ విషయాన్ని ఎన్నో సార్లు చెప్పాలని చూశాను కానీ భయంతో చెప్పలేదు. ఇంతకాలం నన్ను భరించావు అని సారీ చెప్తాడు. ఓమన ఏడుస్తుంది. మన ఇద్దరం ఇంకా ఎంత కాలం ఇలానే ఉంటాము. నీకు నచ్చినట్లు బతకాలని నీకు లేదా, నేను పోరాడుతుంది కేవలం నాకోసమే కాదు, నీ కోసం కూడా అని అంటుంది. ఈ రోజు మనం ఇద్దరం కలిసే పడుకుందాం అని మాథ్యూవ్ ని పట్టుకొని ఏడుస్తుంది. దేవుడా ఏంటీ శిక్ష అని మాథ్యూవ్ కూడా ఏడుస్తాడు.
ప్రచారం కోసం వీడియో రికార్డు చేస్తాడు మాథ్యూవ్. తరువాత సీన్లో ఇద్దరు లాయర్లను కలిసి మ్యూచ్ వల్ అండర్ స్టాండ్ పేపర్స్ పై సైన్ పెడుతారు. రంగ తన ఇంటి దగ్గర మాథ్యూవ్ పోస్టర్ అతికిస్తాడు. ఓమనను తీసుకెళ్లి వాళ్లింట్లో వదిలేస్తాడు. తరువాత మాథ్యూవ్ ఇంట్లో డిన్నర్ చేస్తూ ఉంటారు. తరువాత మాథ్యూవ్ ప్రచారాన్ని టీవీలో చూస్తుంది ఓమన్. నెక్ట్స్ మాథ్యూవ్ కోసం ప్రచారంలో పాల్గొంటుంది. చాలా మంది ప్రచారం చేస్తారు. ఓటింగ్ జరుగుతుంది. రంగ ఓటు వేసి బయటకు వస్తూ ఉంటాడు. నెక్ట్స్ సీన్లో ఓమనను పెళ్లి చూపులకు తీసుకెళ్తాడు మాథ్యూవ్. తనకు భయం వేస్తుంది అని అంటుంది. అదే సమయంలో తన కూతురు ఫోన్ చేస్తుంది. తరువాత ఒక అతను రాగానే తనను అక్కడే వదిలి బయటకు వచ్చేస్తాడు. బయట రంగ వేయిట్ చేస్తూ ఉంటాడు. కారు అద్దంలో మాథ్యూస్ నిలబడి చూస్తుంటాడు. కట్ చేస్తే ఇద్దరు కార్లో వెళ్లిపోతారు. ఇది కాదల్ ది కోర్ మూవీ.