»Animal Movie Akhtar Made Sensational Comments On Animal Movie
Animal Movie: యానిమల్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన అక్తర్
బాలీవుడ్ సినియర్ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరైన అతను అలాంటి సినిమాలను ప్రజలు ఎలా ఆదరిస్తున్నారని వ్యాఖ్యనించారు.
Animal Movie: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన యానిమల్ సినిమా బాక్సాఫిస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. గతేడాది డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం రూ.890 కోట్లకు పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఏ స్థాయిలో పాజిటివ్ రివ్యూలు వచ్చయో.. అదే స్థాయిలో నెగిటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. సినిమాలో మితిమీరిన హింస, సెక్స్ సీన్లు, మహిళలను కించపరిచేలా డైలాగ్‌లు ఉన్నాయని విమర్శలు వెల్లువత్తాయి. తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ సినియర్ లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో పొల్గొన్న జావేద్ యానిమల్ సినిమాను పరోక్షంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో ఓ మగాడు ఓ ఆడదానితో తన షూ నాకాలని అడిగే సీన్ ఉంది. ఓ ఆడదాన్ని కొడితే తప్పేముందని ఓ మగాడు అనే చిత్రం అది. అలాంటి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిందంటే అది చాలా ప్రమాదకరమైన విషయమని జావెద్ అక్తర్ వ్యాఖ్యనించారు. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా హిట్ చేస్తున్నారో అర్థం కావడంలేదని జావేద్ అక్తర్ తెలిపారు. సమాజానికి ఇలాంటి సినిమాలు ఎంతో ప్రమాదకరమని తెలిపారు.