HYD: నగరంలో శీతాకాల ప్రభావం కొనసాగుతోంది. ఆకాశం మేఘావృతమైనా చలి తీవ్రత తగ్గలేదు.నేడు నగరంలో పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీల నుంచి 12.8 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి.మౌలాలి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 9.8 డిగ్రీలతో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా, రాజేంద్రనగర్, తిరుమలగిరి, గచ్చిబౌలి, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో కూడా చలి ఉన్నట్టు DPS పేర్కొంది.