Kannur Squad: ఓపెన్ చేస్తే 2015 కన్నూరు, వీరాజ్ పెట్ బార్డర్.. టైమ్ ఉదయం 3 గంటల 30 నిముషాలకు కొంత మంది స్పెషల్ పోలీసులు తమ కార్లో వెయిట్ చేస్తుంటారు. పక్కనే ఉన్న టీ కొట్టులో టీ అడిగితే పాలు ఇంకా రాలేదు, ఇంకో పదిహేను నిముషాలు పట్టోచ్చు అని కొట్టు అతను చెప్తాడు. తరువాత జయంత్ టెన్షన్ గా ఉందని సిగరేట్ తాగుతున్నట్లు చెప్తాడు. అదే సమయంలో పాలు పోసే అతను వస్తాడు. అతన్ని వెంబడిస్తారు పోలీసులు. అతను అడవిలోకి తీసుకెళ్లి అక్కడ తన బండి ఆపీ, నడుచుకుంటూ వెళ్తాడు. అతని వెనుకాలే వీరు నడుచుకుంటు వెళ్తారు. అలా కొంత దూరం వెళ్లిన తరువాత వారికి ఒక చోటును చూపించి డబ్బులు తీసుకొని అతను వెళ్లిపోతాడు. పోలీసులు టార్చ్ లైట్ పట్టుకొని అడవిలో ఉన్న చెక్కలతో నిర్మించిన ఒక పాక దగ్గరకు వెళ్తారు. అక్కడ ఒక కుక్క కనిపిస్తుంది. అదే సమయంలో ఫోన్ మాట్లాడుతున్న అతను బయట పోలీసుల అలికిడి విని అక్కడ పడుకున్న గ్యాంగ్ ను నిద్ర లేపుతాడు. ఇంటి డోర్ దగ్గరకు వెళ్లగానే కుక్క పోలీసును కరుస్తుంది. దాని నుంచి విడిపించుకోవడానికి జార్జ్, మరో పోలీసు ప్రయత్నిస్తుండగా ఇంటిలోపల ఉన్న విక్టిమ్స్ ఒక బాంబును ఇంట్లో విసురుతారు. అది చూసి కుక్క అక్కడికి వెళ్తుంది. అంతలో బాంబ్ పేలుతుంది. తరువాత వారు తప్పించుకుందామని ప్లాన్ చేస్తుండగా వారిపై పోలీసులు ఎటాక్ చేస్తారు. ఫైట్ జరుగుతుంది. ఆ గ్యాంగ్ నుంచి ఒక విక్టిమ్ తప్పించుకొని అడవిలోకి పారిపోతాడు. అతన్ని తరుముతూ జార్జ్ కూడా వెళ్తాడు. పారిపోయేవాడికి గాజు పెంకులు గుంచుకుంటాయి. దాంతో ఒక చెట్టుకింద కూర్చొని వాటిని తీసీ జార్ట్ కోసం చూస్తుంటాడు. అతన్ని వెతుకుతూ దగ్గరకు వస్తున్నాడని జార్ట్ కొడుదామని పక్కనే ఉన్న కట్టే తీసుకొని చూస్తుండగా అతని ముఖంపై చెట్టునుంచి ఏదో పడినట్లు అనిపించి పైకి చూస్తాడు. తరువాత గట్టిగా భయంతో అరుస్తాడు. అతని అరుపులు విన్న జార్జ్ చెట్టుపైకి చూస్తే శవం వేలాడుతుంది.
చదవండి:Prashanth Neel: ఆయన లేకపోతే సలార్‌ను ఊహించలేము
కట్ చేస్తే పోలీసు స్టేషన్లో వారిని అప్పగిస్తారు. వాంటెడ్ కిల్లర్స్ ఫోటోలు చూస్తూ వీరు మర్డర్స్ లా ఉన్నారా సర్ అని రఘు జార్జ్ తో అంటుంటాడు. తరువాత చెట్టుపై దొరికిన బాడీని ఫోటో షాప్ చేసినట్లు మరో పోలీసు కొన్ని ఫోటోలు చూస్తుంటాడు. జార్జ్ తీసుకొచ్చిన కేసును సాల్వ్ చేయాలంటే కష్టం, అతనికి కుటుంబం లేదు, ఇల్లు లేదు మనకు అలా కాదుకదా అని హెడ్ అంటుండగా.. వారిని తక్కువ అంచనా వేయకు వారు ఎస్పీ గారి స్పెషల్ స్క్వాడ్స్ అని సీఐ అంటాడు. తరువాత జార్ట్ దగ్గరకు వెళ్లి ఇక మీరు వెళ్లిపోండి అని చెప్తాడు. దానికి చెట్టుకు వేలాడిని శవం దర్యాప్తు కూడా చేస్తాము అంటాడు జార్జ్. ఏవరో ఆదివాసి అయి ఉంటాడు. అయినా ఇక్కడ మావోయిస్టులతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు వెళ్లండి అని సీఐ అంటాడు. అందరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వెళ్లిపోతారు.
కట్ చేస్తే 2017 కన్నూరు పోలీసు కాంటీన్ లో జార్జ్ తన గ్యాంగ్ తో కలిసి ఒక రిపోర్టర్ తో కూర్చుంటాడు. ఇలాంటి అవమానం
ఇంకేదైన పోలీసు స్టేషన్లో ఎదురైందా అని రిపోర్టర్ అడుగుతాడు. దానికి ఇది కామన్ అని రఘు చెప్తాడు. అలా కాదు పోలీస్ స్టేషన్లో చాలా కేసులు ఉంటాయి వాటిని సాల్వ్ చేయడానికి తగినంత మ్యాన్ పవర్ లేదని జార్జ్ చెప్తాడు. అందుకే ఈ స్క్వాడ్ ను శ్రీజిత్ సార్ 2007లో ఫామ్ చేసినట్లు చెప్తాడు. ఇక తన ఇన్వెస్టిగేషన్ గురించి చెప్తాడు. అది తొంబై శాతం సూసైడే కాని పది శాతం కాదని జార్జ్ అంటాడు. ఆ బాడీ ఆదివాసిది కూడా కాదు, ఆదివాసులు ఎవరికి తెలియకుండా ఎక్కువ ఎత్తులో సూసైడ్ చేసుకుంటారు. అది ఒక మగవాడి బాడీ అని, అతని కాలుకు ఒక మెటల్ ప్లేట్ ఉంది. అదివాసులు అంత ఖర్చుచేసి ఆపరేషన్ చేయించుకోరు. ఇక అటాప్సీ చేసిన డాక్టర్ ఇచ్చిన వివరాల ప్రకారం ట్రాక్ చేస్తే త్రివేండ్రంలోని ఆసుపత్రి అని చెప్పారు. అక్కడ డేటా తీసుకొని అందరికి కాల్ చేస్తే మురగన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అతని భార్య వనజ అని వారి అడ్రస్ కూడా ఉందని తెలిసి, జార్జ్ తన టీమ్ తో వారి ఇంటికి వెళ్తారు. ఒక నెల క్రితం వనజ ఇక్కడికి వచ్చి మురగన్ వాళ్ల బాబాయ్ చనిపోయాడు అని సామాను తీసుకొని వెళ్లిపోయారు అని ఇంటి ఓనర్ చెప్తాడు. తరువాత ఇళ్లంతా గాలిస్తారు. జార్జ్ కు గోడపై ఒక బొమ్మ కనిపిస్తుంది. అద్దం వెనుకాల లారీకి సంబంధించిన ఫేపర్స్ దొరుకుతాయి. వాటిని తీసుకొని ఆర్టీఓ ఆఫీస్‌లో వెతికితే అతని ఫోటో దొరుకుతుంది. తన లారీని ఇప్పుడు కోయం బత్తురుకు మార్చుకన్నారని అక్కడికి వెళ్తారు జార్జ్ టీమ్.
తరువాత సీన్లో మురగన్ లారీ నడిపే ఓనర్ దగ్గరికి వెళ్తే అతన్ని పనిలో పెట్టింది రాకేష్ అని చెప్తాడు. అతని అడ్రస్ తీసుకొని రాకేష్ ఇంటికి వెళ్లి డోర్ కొడితే అక్కడ చిన్న పాప ఎవరు అని అడుగుతుంది. అక్కడికి వనజ వచ్చి ఎవరు కావాలి అంటుంది. అదేసమయంలో రాకేష్ డోర్ తీసి ఎవరు అని అడుగుతాడు. మురగన్ వాళ్ల చిన్నాన్న అని చెప్తాడు జార్జ్. దాంతో వారు షాక్ అవుతారు. ఇక వనజ నిజం చెప్పేస్తుంది. మురగన్ అంటే తనకు ఇష్టం లేకున్నా తాగుబోతు వాళ్ల నాన్న బలవంతంగా పెళ్లి చేశాడు అని, ఎంతో కష్టపడి డబ్బుసంపాదిస్తే లారీని కొని దొంగపనులు చేసేవాడు అని చెప్తూ ఏడుస్తుంది. తరువాత రాకేష్ దగ్గరయ్యాడని అదే సమయంలో మురగన్ ఇద్దరు కలిసి ఉరి తీశామని చెప్తుంది. ఇక పాపను ఆనద శరణాలయంలో అప్పగించి వారిని జైలుకు పంపిస్తారు.
ఇందులో వనజ తప్పేమి లేదు. పాప పాపం కదా దీన్ని సూసైడ్ గా కేసు క్లోజ్ చేయొచ్చు కదా అని రిపోర్టర్ అడుగుతాడు. మేము కేవలం మనుషులం మాత్రమే కాదు పోలీసులము కూడా నేరస్తులను చట్టానికి అప్పగించడం మా బాధ్యత అని జార్ట్ అంటాడు. ఇదంతా రిపోర్ట్ చేసుకుంటాడు. జార్జ్ టీమ్ లో నలుగు అలా నడుచుకుంటు వస్తుంటే మూవీ టైటిల్ పడుతుంది.
నెక్ట్స్ సీన్లో పోలీసు పదవి విరమణ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అదే సమయంలో జయంత్ ఇంటి లోన్ కోసం ఆఫీసర్ తో గొడవ పడుతాడు. రఘు, జయంత్ ను బయటకు తీసుకొచ్చి లాస్ట్ మంత్ కదా జార్జ్ సర్ నేను డబ్బులు ఇచ్చాము అంటే అది ఖర్చు అయిపోయింది అంటాడు. తరువాత సీన్లో జార్జ్ దగ్గరకు వెళ్లి మీరు త్వరగా రండి అని తీసుకోస్తాడు రఘు. ఇక్కడ జయంత్ లోన్ ఆఫీసర్ తో గొడువపడుతాడు. అక్కడి వచ్చిన జార్ట్ వారితో మాట్లాడి సెటిల్ చేస్తాడు. తరువాత అందరితో కలిసి ఫోటో దిగుతారు.
తరువాత సీన్లో కసరగాడ్ ఉదయం 3 గంటల 50 నిమిషాలు అని టైమ్ పడుతుంది. వర్షం పడుతుంది. ఒక ఇంట్లో నుంచి కొంత మంది వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తారు. కట్ చేస్తే ఎస్పీ కృష్ణ లాల్ దగ్గరకు జార్జ్ జోసఫ్ వస్తాడు. అతని చేతికి కొన్ని రిపోర్ట్స్ ఇచ్చి జయంత్
సాండ్ మాఫీయా దగ్గర లక్షన్నర లంచం తీసుకొని వారికి సపోర్ట్ చేస్తున్నాడు ఎక్వైరీ వేస్తే నిజమే అని తేలింది. టీమ్ హెడ్ అయినందుకు నువ్వు కూడా సమాధానం ఇవ్వాలి అని చెప్తాడు. అతనితో మాట్లాడి చూస్తా అంటే అవసరం లేదని చెప్తాడు. తరువాత బయటకు వచ్చి జయంత్ కు ఆ రిపోర్ట్స్ ఇచ్చి వెళ్లిపోతాడు. నెక్ట్స్ సీన్లో సాండ్ మాఫీయాకు జయంత్ కు ఉన్న సంబంధం గురించి న్యూస్ ఛానెళ్ లో వార్తలను చూసి జయంత్ భార్య కూతురు ఏడుస్తారు.. అక్కడికి వచ్చిన జయంత్ కూడా ఏడుస్తాడు.
కట్ చేస్తే కొన్ని రోజుల తరువాత అని పడుతుంది. మాకు నిజం చెప్పాలి ఈ హత్య ఎలా జరిగింది అని కసరగాడ్ హెడ్ క్వర్టర్స్ లో కొంత మంది ప్రొటెస్ట్ చేస్తుంటారు. అదే సమయంలో అక్కడికి సూపరింటిండెంట్ మను నీది చోళన్ వస్తాడు. ఎందుకు వీరిని క్లియర్ చేయలేదు అని అడుగుతాడు. వాళ్ల చాలా మంది ఉన్నారని పోలీసు చెప్తాడు. ఏం చేస్తారో నాకు తెలియదు ఇక్కడ ఒక్కరు కూడా ఉండకూడదు అని చెప్తాడు. హత్య దర్యాప్తు గురించి కొప్పడుతాడు. అదే సమయంలో చోళన్ కు ఐజీ పోన్ చేసి దీన్ని త్వరగా క్లోజ్ చేయండి లేదంటే గందరగోళం అయ్యేలా ఉందని చెప్తాడు. తరువాత తాను రెండు సంవత్సరాల క్రితం మాయ చౌకీలో సీఐగా ఉన్నప్పుడు ఒక గ్యాంగ్ దొంగతనాలు చేసి తప్పించుకునే వారని, వారిని పట్టుకోవడం తమ వళ్ల కాలేదని, అలాంటి సమయంలో వారు ఒక ముసలావిడ చెవిని కట్ చేయడంతో కన్నూర్ స్క్వాడ్ టీమ్ తమకు హెల్ప్ చేసిందని, వెంటనే ఆ ముఠాను పట్టుకున్నట్లు చెప్తాడు. కట్ చేస్తే జార్జ్ షఫీతో మాట్లాడుతుంటాడు. అదే సమయంలో అక్కడికి మరో పోలీసు ఆఫీసర్ వచ్చి మాట్లాడి వెళ్తాడు. తరువాత జయంత్ పేపర్లో తన గురించి వచ్చిన ఆర్టికల్ ను చూస్తూ బాధపడుతుంటాడు. జార్జ్ కూడా సముద్రం ఒడ్డున నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు.
కన్నుర్ డిస్ట్రిక్ హెడ్ కోర్టర్స్ లో ఎస్పీ కృష్ణ లాల్ తో జార్జ్ మాట్లాడుతుంటాడు. కసరగాడ్ కేసును నేను హ్యాండిల్ చేయగలను కాని జయంత్ ను కూడా టీమ్ లో ఉండేలా చూడండి అని చెప్తాడు. అది ఐజీ చేతుల్లో ఉంది అని అంటాడు ఆఫీసర్. తరువాత చోళన్, కృష్ణ లాల్ ఐజీతో మాట్లాడుతారు. బీ టీమ్ బీహార్ లో ఉంది, ఏ టీమ్ హ్యాండిల్ చేయాలంటే వారికి జయంత్ కూడా కావాలి అంటున్నారు. వారు నలుగురే ఎన్నో కేసులను సాల్వ్ చేశారు అని చెప్తాడు. దానికి ఐజీ ఒప్పుకుంటాడు. తరువాత చోళన్ ను జార్జ్ కు పరిచయం చేస్తాడు కృష్ణ లాల్. ఇది చాలా అరుదైన కేసు, కసరగాడ్ లాంటి సెన్సిటీవ్ ఏరియాలో అబ్దుల్ వాహబ్ హత్య జరిగింది. హోం మినిస్టర్ మనకు కేవలం 10 రోజులు మాత్రమే టైమ్ ఇచ్చారు అని చెప్తాడు. దానికి ఓకే చెప్తాడు జార్జ్. గుడ్ లక్ అంటాడు చోళన్.
తరువాత సీన్లో జార్ట్ తన టీమ్ మెంబర్ తో మాట్లాడుతాడు. ఇది చాలా సెన్సిటీవ్ కేసు అని చెప్తాడు. దానికి అందరు ఒకే అంటారు. కాసరగాడ్ డే 1 అని టైటిల్ పడుతుంది. జార్జ్ టీమ్ అబ్దుల్ ఇంటికి వెళ్తారు. అక్కడ చాలా మంది పోలీసులు ఉంటారు. తరువాత జార్జ్ ఇన్విస్టిగేషన్ మొదలుపెడుతాడు. తరువాత బాత్రూంంలో అబ్దుల్ పడిపోయిన చోట ఆధారాలకోసం వెతుకుతారు.
నెక్ట్స్ సీన్లో చోళన్, మర్డర్ గురించి జార్జ్ తో మాట్లాడుతాడు. లూటీ చేసే గ్యాంగ్ మర్డర్ చేయరు అని చెప్తాడు చోళన్. ఇది పొలిటికల్ మర్డర్ అయ్యే ఛాన్స్ ఉందని, కాల్ డిటైల్స్ కావాలి అని చెప్తాడు జార్జ్. కట్ చేస్తే సైబర్ ఆఫీస్ లో నెంబర్స్ కావాలని అడుగుతాడు. మొత్తం రెండున్నర లక్షల కాల్స్ వచ్చాయని చెప్తాడు వినోద్. అందులో రెండు నిమిషాలు మాత్రమే ఉన్న కాల్ డిటైల్స్ కావాలి అంటాడు జార్జ్. రెండవ రోజు ఆఫీసర్లందరు రెడీ అవుతుంటారు. ఒక కారు, బస్ నెంబర్ ప్లేట్ తో వెళ్లిందని ట్రాక్ చేస్తారు. ఇక రెండు నిముషాల కన్నా తక్కువ మాట్లాడిన కాల్స్ 7వేలు ఉన్నాయని చెప్తాడు. జార్జ్ వన్ టు వన్ మాట్లాడిన నెంబర్స్ కావాలి అని చెప్తాడు. దాంతో ఫోన్ నెంబర్స్ లో ఉన్న అడ్రెస్ లు వెతుకుతూ సెబస్టీన్ ను పట్టుకుంటారు. అతన్ని తీసుకెల్లి సిమ్ షాప్ లో అడిగి రియాజ్ ను పట్టుకుంటారు. అతను వారిని కొట్టి పారిపోతుంటాడు. జయంత్ కూడా కారుతో వెంబడిస్తారు. అతన్ని పట్టుకుంటారు. తరువాత సీన్లో రియాజ్ ను పట్టుకొని విచారిస్తుంటారు. పోలీసులు కొడుతుంటారు అదే సమయంలో జార్జ్ పేపర్స్ పట్టుకొని తన టీమ్ మెంబర్లను బయటకు పంపిస్తాడు. తరువాత రియాజ్ తో అబ్దుల్ ను ఎందుకు చంపావు అని అడుగుతాడు. తరువాత బ్లడ్ షాంపిల్స్ ఆధారంగా నిన్ను పట్టుకున్నట్లు జార్జ్ చెప్తాడు.
దాంతో నిజం చెప్తాను అని అంటాడు రియాజ్. పోలీసులు కెమెరా ఆన్ చేస్తారు. అమీర్, జులిఫికర్ అనే ఇద్దరికి బిజినెస్ చేయడానికి డబ్బులు కావాలంటే తాను హెల్ప్ చేస్తా అని చెప్తాడు. అబ్దుల్ ఇంట్లో సీసీ కెమెరా ఫిట్ చేస్తుంటే అబ్దుల్ ఇంట్లో డబ్బులు ఉన్న విషయం తెలుస్తుంది. అదే విషయాన్ని వారికి ఫోన్ చేసి చెప్తాడు రియాజ్. మొదట యూపీ నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తరువాత అమీర్, జులిఫికర్ ఇద్దరు వచ్చారు అని చెప్తాడు. సోషల్ మీడియా ద్వారా వారి ముఖాలను చూస్తారు జార్జ్ టీమ్. నెక్ట్స్ ఫేక్ సిమ్ లు తీసుకున్నట్లు, అబ్దుల్ ఇంట్లో బర్త్ డే పార్టీకి వెళ్లీ ఇంటిని మొత్తం వారికి ఫోన్ లో చూపిస్తాడు రియాజ్. 2017 ఆగస్టు 27 ఉదయం 3 గంటల 15 నిమిషాలు అని టైమ్ పడుతుంది. వర్షం పడుతుంది. మొత్తం 5 గురు ముసుగులు వేసుకొని ఇంటికి వెళ్తారు. డోర్ బెల్ కొడుతారు, అబ్దుల్ కొడుకు వచ్చి డోర్ తీస్తాడు. అతన్ని ఇంట్లోకి వెళ్లీ సీసీ కెమెరా హార్డ్ డిస్క్ తీసుకుంటారు. ఆ తరువాత అబ్దుల్ వైఫ్ ను కొడుతారు. నెక్ట్స్ అబ్దుల్ పట్టుకునే వస్తుండగా అతని కూతురు అడ్డం వస్తుంది. తనను కూడా కొడుతారు. లాక్ రూమ్ కు వెళ్లి లాక్ ఓపెన్ చేస్తే మొత్తం 5 లక్షలే ఉంటాయి. ఇళ్లంత సోదా చేస్తారు. ఎంత వెతికినా డబ్బులు దొరకవు, బంగారం తీసుకుంటారు. అదే సమయంలో రియాజ్ కు కిడ్నిల్లో రాళ్లు ఉండడం వలన టాయిలెట్ వస్తుందని వాష్ రూమ్ కు వెళ్తాడు. బ్లడ్ వస్తుంది. అరుపు వినిపిస్తుంది. అతను పరుగెత్తుకుంటు వచ్చే లోపే అబ్దుల్లాను చంపేస్తారు. అది చూసి రియాజ్ అమీర్ ను అడుగుతాడు. దొంగతనం తప్పా ఏం చేయనన్నారు అంటే.. నువ్వు కోట్లు ఉన్నాయి అన్నావు, ఇక్కడ చూస్తే 5 లక్షలే ఉన్నాయి అని, ఈ విషయం ఎవరికన్నా చెప్తే చంపేస్తా అని బెదిరిస్తారు. ఇదే విషయాన్ని జార్జ్ ఆఫీసర్ చోలేన్ తో చెప్తాడు.
క్రైమ్ జరిగిన తరువాత వారు ఎక్కడికి వెళ్లారు అనేది తెలియదు అని చెప్తాడు. తరువాత అమీర్, జుల్పీ మంజిరియా వెళ్లిపోయారని కాల్ ట్రేసింగ్ ద్వారా తెలుసుకుంటారు. కట్ చేస్తే సుభాష్ వాళ్ల ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ల డిటైల్స్ పంపిస్తాడు. తరువాత రియాజ్ చెప్తున్న పోలికలతో ఆర్టిస్ట్ బొమ్మ గీస్తుంటాడు. తరువాత సీన్లో అబ్దుల్లా కుతురు ఫారాను కలవడానికి ఆసుపత్రికి వెళ్తాడు జార్జ్. ఫారాను కలిసి అక్కడ ఏం జరిగిందో చెప్పగలవా అని అడుగుతారు. తాను ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. అబ్దుల్లాను కొడుతారు. ఫారాను కొడుతారు. తండ్రి ముందే రేప్ చేస్తారు. తరువాత డబ్బు ఎక్కడ అని అడిగి కోపంతో అబ్దుల్లాను చంపేస్తారు. కట్ చేస్తే ఫారా ఏడుస్తుంది. ఆసుపత్రినుంచి బయటకు వచ్చిన జార్జ్ తన టీమ్.. ముంబాయ్ లో అమీర్, జులిఫీకర్ లు ఉన్నట్లు అనుమానం ఉందని అక్కడి బయలుదేరుతారు.
5వ రోజు జార్జ్ టీమ్ ముంబాయికి వెళ్తారు. జులిఫీకర్ నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తాడు. హెల్త్ డిపార్ట్ మెంట్ అంటూ వచ్చినవారు పోలీసులేనా .. అని బయపడుతుంటాడు. వారిని ఎవరో ఫోలో అవుతున్నారని డౌట్ పడుతారు. 6వ రోజు జార్జ్ టీమ్ వారి ఫోటోలను చూపిస్తూ వెతుకుతుంటారు. ల్యాండ్ లైన్ వాళ్లను అడుగుతారు. సీసీ కెమెరా చెక్ చేస్తారు. ఒక దాంట్లో వారు రికార్డు అవుతారు. వాళ్ల ఇంటికి కాకుండా మరో నెంబర్ కు ఫోన్ చేశారని అతన్ని వెతుక్కుంటే వెళ్తారు. అతను సిజ్జు అని అతని కోసం జార్జ్ అండ్ టీమ్ వెయిట్ చేస్తుంటారు. అదే సమయంలో సిజ్జు ఇంటికి వస్తాడు. అతన్ని కొడితే భువనేశ్వర్ కు వెళ్లారని చెప్తాడు. దాంతో భువనేశ్వర్ వెళ్దామని ప్లాన్ చేస్తుంటే అది వద్దంటాడు జార్జ్. అదే సమయంలో వారు నార్త్ లోనే ఉన్నారని వారికి ఫోన్ వస్తుంది. దాంతో మళ్లీ కార్లో బయలు దేరుతారు. 8వ రోజు బంక్ లో పెట్రోల్ కొట్టించుకొని బిల్లులన్ని ఆర్డర్లో వేసుకుంటారు. ఉత్తరప్రదేశ్ లోని పైజామకు జార్జ్ అండ్ టీమ్ వెళ్తారు. వారిని పట్టుకోవడానికి పోలీసులను హెల్ప్ కావాలని చెప్తాడు.
తరువాత సీన్లో జయంత్ లంచం తీసుకుంటున్న వీడియో వైరల్ అవుతుంది. అబ్దుల్ కేసును ఇలాంటి వారికి ఇచ్చారని మీడియా ప్రచారం చేస్తుంది. జార్జ్ అమీర్ ను వెతకడానికి టిక్రి విలేజ్ కు వెళ్తారు. తరువాత వినోద్ కు ఫోన్ చేసి లోకేష్ ను ట్రాక్ చేయమని ఫోన్ చేస్తారు. అతను చెప్తుంటే జార్జ్ టీమ్ వెతుకుతారు. వాళ్ల దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ తో కాల్ చేసి రింగ్ అవుతున్న ఇంట్లోకి వెళ్తారు. అక్కడ పవన్ ఉంటాడు. తన భార్యపై కత్తి పెట్టి అడుగుతారు. దాంతో వారు బయట ఉన్నట్లు చెప్తాడు పవన్. అంతలో తన వైఫ్ గన్ పేలుస్తుంది. అతను పారిపోతాడు. ఊరంత మేల్కొని కాగడాలు అంటించుకొని వీరిని చంపడానికి వెంటపడుతారు. దాంతో పోలీసులు దాక్కుంటారు. వారిని ఒకతను చూసి అందరికి చెప్తాడు. వారు కాగడాలతో వీరిపై ఎటాక్ చేస్తారు. పోలీసులు డెఫెండ్ చేస్తారు. అయిన వీలేజర్స్ వినరు. తరువాత పోలీసులు వారితో ఫైట్ చేస్తారు. ఊరంతా కలిసి ఫైట్ చేస్తారు. అమీర్ కు హెల్ప్ చేసిన పవన్ మళ్లీ వెనకు వస్తాడు. అతన్ని పట్టుకొని తీసుకెళ్తారు. మధ్యలో వారిని కొరికి పారిపోతాడు. మళ్లీ ఊరంత తరుముతుంది. కార్లో పారిపోతారు. కౌశిక్ మిస్ అయిండని వెనక్కి వచ్చి అతన్ని తీసుకొని వెళ్లిపోతారు. ఐదుగురి వచ్చి ఊరంతా ఆగం చేశారు అని మాట్లాడుతుంటాడు పవన్. అంతలో జార్జ్ కార్లో వచ్చి పవన్ లాగి కార్లో పడేసుకొని వెళ్లిపోతారు.
9వ రోజు కార్లో ఉన్న గాజుపెంకులను, బుల్లెట్లను తీస్తుంటారు. అదే సమయంలో చోళన్ ఫోన్ చేసి టైమ్ దగ్గర పడుతుంది అని చెప్తాడు. వాళ్లకు సంబంధించిన ఒకడిని తీసుకొచ్చామని ఇంటరాగేట్ చేస్తున్నామని జార్జ్ చెప్తాడు. తరువాత పవన్ ను హింసిస్తారు. మొత్తం 5గురు కలిసి పెద్ద బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఏనుగు దంతాలను దొంగలించి విదేశాలను ఎక్స్ పోర్ట్ చేసే వ్యాపారం గురించి చెప్తాడు. తరువాత సీన్లో అబ్దుల్లా మరణం గురించి పోలీసు స్టేషన్ల ముందు ప్రజలు ఆందోళన చేస్తుంటారు. తరువాత జోష్ కు ఇంటినుంచి ఫోన్ వస్తుంది. అతను బండి దిగి మాట్లాడుతాడు. తరువాత జయంత్ వీడియో బయటకు వచ్చిందని ఇద్దరు గొడవ పడుతుంటారు. జయంత్ పై జార్జ్ చేయి చేసుకుంటాడు. తన కూతురి ఆరోగ్యం బాగలేదని తన కూతురుకోసమే లంచం తీసుకున్నానని జయంత్ ఏడుస్తాడు. తరువాత అందరిని కూల్ చేసి మళ్లీ మిషన్ కోసం వెళ్తారు. తరువాత సీన్లో లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న టీమ్ కా కేసును అప్పగించేది అని సీఎం ఐజీని తిడుతాడు.
నెక్ట్స్ సీన్లో ట్రైన్లో వారి ఫోటొలతో వెతుకుతుంటారు. అందులో ఒకడు కనిపిస్తాడు. అతన్ని జార్జ్ కొడుతాడు. మరొకడు అక్కడే ఉంటాడు. ఇద్దర్ని పట్టుకుంటారు. తరువాత ట్రైన్ కదులుతుంది. రషుుకు ఫోన్ చేసి ట్రైన్ లో అమీర్, జుల్ఫీలు ఉన్నారని జార్జ్ చెప్తాడు. తరువాత వాళ్లిద్దరిని కార్లో ఎక్కించుకొని, పవన్ కు కింద పడేస్తారు. కార్లో వాళ్లను కొడుకుత మిగితా ఇద్దరిగురించి అడుగుతారు. అక్కడ వారి ఫోన్ దొరుకుతుంది. దాంతో లాస్ట్ ఫోన్ ట్రేజ్ చేయమని వినోద్ కు కాల్ చేస్తారు. అదే సమయంలో డీజీపీ సర్ ఫైర్ అయ్యారని చోలెన్ తో ఐజీ అంటారు. వారిని వెనక్కు రమ్మంటారు. దానికి చోళన్ ఒప్పుడకోడు ఆఫీసర్ పై అరుస్తాడు. వెనక్కి వచ్చేయమంటాను అని జార్జ్ కు ఫోన్ చేస్తాడు.
అదే సమయంలో జార్జ్ వారి ఫోటోలను అందరికి చూపిస్తూ వెతుకుతుంటాడు. చోళన్ రఘుకు ఫోన్ చేస్తుంటాడు. జార్జ్ కు ఫోన్ చేస్తుంటే చోళన్ కాల్ కట్ చేస్తాడు. తరువాత ఒక పిల్లాడు అతన్ని బాబాగంజ్ బస్ లో చూశానని చెప్తాడు. అదే సమయంలో షఫీ, రఘు బాబాగంజ్ ట్రైన్ దిగామని చెప్పగానే మళ్లీ ఎక్కండి అని చెప్తాడు వారు పరిగెత్తుకుంటూ వెళ్లి ట్రైన్ ఎక్కుతారు. తరువాత షఫీకి ఆడపిల్ల పుట్టిందని వాళ్ల అమ్మా కాల్ చేస్తుంది.
తరువాత సీన్లో చోళన్ సార్ లైన్లో ఉన్నారని వినోద్ ఫోన్ చేస్తారు. వారిని తిట్టి, మిషన్ కాన్సిల్ చేసి వచ్చేయమని చెప్తాడు. దానికి జార్జ్ ఒప్పుకోడు.. ఏమైనా సరే నేను మిషన్ కంప్లీట్ చేసుకొనే వస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. తరువాత కార్లో బాబాగంజ్ కు బయలుదేరుతారు. కారు స్పీడ్ గా నడుపుతూ.. బస్ ను క్యాచ్ చేస్తారు. కాని అందులో జుల్ఫీ ఉండడు. ఎప్పుడో దిగిపోయాడు అని కండక్టర్ చెప్తాడు. ఇక ముందుకు వెళ్లలేమని నెక్ట్స్ వచ్చేది ఒరిస్సా బార్డర్ అని యోగేష్ చెప్తాడు. దాంతో కార్లో విక్టిమ్స్ తో డీల్ మాట్లాడి వారిని పట్టిస్తే మిమ్మల్ని వదిలేస్తా అని చెప్తాడు జార్జ్. దానికి వాళ్లు సరే అని ఒప్పుకుంటారు. తరువాత ఒక అడవిలోకి తీసుకెళ్లి దారి తప్పు చెప్తాడు. వారి బాడీ లాంగ్వేజ్ ను కనిపెట్టిన జార్జ్ ఒకడి వేలును గన్ తో పేలుస్తాడు. రెండో వాడు నిజం చెప్తాడు. ఇద్దరిని కార్లో ఎక్కించుకొని అమీర్ కోసం వెళ్తుంటే కారుపై ఫైరింగ్ జరుగుతుంది. కారు కంట్రోల్ తప్పి బోల్తా పడుతుంది. అక్కడికి అమీర్, జుల్పీ వాళ్ల గ్యాంగ్ వస్తుంది. జయంత్ ను, యోగేష్ ను కొడుతారు. కార్లో జార్జ్ ఉండడు. జయంత్ ను అమీర్ కాల్చబోతుంటే జార్జ్ గన్ ఫైర్ చేస్తాడు. తరువాత వాళ్లతో ఫైట్ చేస్తాడు. జార్జ్ అమీర్ అండ్, జుల్ఫీలను కొడుతాడు. అదే సమయంలో అక్కడికి బార్డర్ దళాలు వస్తాయి. విషయం తెలుసకుంటారు. అదే సమయంలో షఫీ, రఘు ఇద్దరు అక్కడికి వస్తారు. తరువాత కారును చూసి బాధ పడుతారు.
తరువాత సీన్లో జార్జ్ కృష్ణ లాల్ కు ఫోన్ చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్లు.. చోళన్ సర్ వలనే ఇది సాధ్యం అయిందని జార్జ్ చెప్తాడు. దాంతో సీఎం ప్రెస్ మీట్ పెడుతాడు. తరువాత జార్జ్ అలా కోపంగా మాట్లాడినందుకు ఫీల్ అవద్దు అని కృష్ణలాల్, చోళన్ తో అంటాడు. దానికి చోళన్ సంతోషపడుతాడు. అలాంటి సిన్సియర్ ఆఫీసర్లు ఉండటం వలనే మన డిపార్ట్ మెంట్ మీద ఇంకా నమ్మకం ఉంది సర్ అని అంటాడు. తరువాత నలుగురి నెరస్తులను తీసుకొని జార్జ్ తన టీమ్ తో వస్తుంటాడు.