King of Kotha: ఏరియల్ షాట్ వాయిస్ ఓవర్ తో సీన్ ఓపెన్ అవుతుంది. కోతా.. బ్రిటీష్ రాజ్యంగ కాలంలో క్రూర నేరస్తులను ఏలాంటి విచారణ లేకుండా చంపి పారేసిన బంజర్ భూమి. ఆ తరువాత రాష్ట్రంలో పలు ప్రదేశాలనుంచి ప్రజలు ఇక్కడ నివాలసాలు ఏర్పాటు చేసుకోవడం వలన ఇది ఒక టౌన్ గా మారింది. ఒక వైపు వ్యాపారుల భాగ్యవంతమైన జీవితం, ఇంకో వైపు వీధుల్లో పేదవాళ్ల దిక్కుమాలిన జీవితం కలిసిపోయి వున్న కోతాలో ఆ భూమిలో చిందిన రక్తపు వాసనతో నేరుస్తుల సామ్రాజ్యం ఒకటి ఉదయించింది. దేనికి భయపడని ఆ ముఠా అక్కడ దొరపరిపాలన చేసింది. పోలీసు డిపార్ట్ మెంట్ లో ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే కోతాకి వచ్చి తల వంచడం చూసిన ప్రజలు ఒక విషయం అర్థం చేసుకున్నారు. ఇదే కోతాలో ఉన్న విధీ అని అనే వాయిస్ ఓవర్ తో టైటిల్స్ పడుతాయి.
కట్ చేస్తే 1996 లో ఒకడు విధి ఆడిన వింత ఆట వలన ఆ కోతాకు వచ్చాడు అనే వాయిస్ ఓవర్ తో షావుల్ అజిమ్ ఎనే పోలీసు ఆఫీసర్ కోతాకు తన భార్యతో కార్లో వస్తాడు. అదే సమయంలో బ్రిడ్జీ మీద ఒకడు కారు అడ్డం వస్తాడు. చాలా ఆకాలిగా ఉందంటే వాడికి 10 రూపాయాలు ఇస్తాడు అజిమ్. తరువాత కారు అద్దంలోంచి చూస్తే వాడు బీడీ తాగుతూ కనిపిస్తాడు. వాన్ని చూసి ఏం అనకుండా వెళ్లిపోతాడు. తరువాత సీన్లో బజ్జీల కొట్టులో పిల్లి అరుస్తా ఉంటుంది. అక్కడికి వచ్చిన షావుల్ అజిమ్ 5 గారెలు పార్సెల్ అడుగుతాడు. బజ్జిల కొట్టామెతో పదిరూపాలు తీసుకున్న అబ్బాయి గురించి అడుగుతాడు. గంజాయి కోసం తీసుకొని ఉంటాడు అని ఆ అబ్బాయి గురించి చెప్తుంది. తరువాత ఈ టౌన్ గురించి అడుగుతుంటే మీరా పోలీసా అని అడుగుతుంది. ఎలా కనిపెట్టావు అని తనను పరిచయం చేసుకుంటాడు. పనిష్మెంట్ ట్రాన్స్ ఫరా సర్ అని అక్కడున్న కొంత మంది అంటారు. అవును ఇక్కడ కొంత మందికి పనిష్మెంట్ ఇవ్వాలి అని వారిని గద్దిస్తాడు. తరువాత కన్నాబాయ్ గురించి అడుగుతే తెలియదు అని చెప్తుంది. అతను వెళ్లిపోతాడు.
చదవండి:Salaar: యుద్ధానికి సిద్ధమవ్వండి..’సలార్’ ట్రైలర్ డేట్ లాక్!
తరువాత సీన్లో అజిమ్ ఇంట్లో టీవీ చూస్తుంటే వారింటికి తారా కొంత మందితో వచ్చి కొన్ని రహస్య విషయాల గురించి మాట్లాడాలని, ఇంట్లోకి వచ్చి కూర్చొని కొంత మంది అబ్బాయిల ఫోటోలను ఇస్తుంది. కోతాలో ఉన్న కొత్త తరం మత్తుకు, గంజాయికి బానిసా అయినట్లు, వారు రిహాబిలిటేషన్ లో గడుపతున్నట్లు చెప్తుంది. వారంత ఇప్పుడు జీవచ్చావాలుగా మారిపోయారని వీటి వెనుక కన్నా బాయ్ ఉన్నట్లు చెప్తుంది. దాంతో ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి వాడి పేరే వినిపిస్తుందని అంటాడు. తాను పనిచేసిన అన్ని ఊర్లను బాగుచేశాడని ఈ ఊరును కూడా కాపాడండి అని అజిమ్ ను అడుగుతారు. అది తన డ్యూటీ అని వారికి అజిమ్ భరోసా ఇస్తాడు. నెక్ట్స్ సీన్లో పోలీసు అధికారులు అజిమ్ గురించి మాట్లాడుకొని పరిచయం చేసుకుంటాడు. టౌన్లో గొడవ చేసే వారి ఫైల్ ను అడిగితీసుకొని చూస్తాడు. అందులో 7 గురి సంతకాలు మిస్ అవుతాయి. అవి కన్నా మనుషుల సంతకాలు అని టోని చెప్తాడు. అయితేంటి అని అడిగితే మీ కన్నా ముందు బెజోయ్ సర్ ఎందుకు వెళ్లిపోయాడో తెలుసా అంటే చదువుకోవడానికి లీవ్ పెట్టాడు అని అజిమ్ చెప్తాడు. దానికి అది కాదు అసలు నిజం వేరే ఉందని హెడ్ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు.
తరువాత సీన్లో బెజోయ్ సర్ కోసం కన్నా వస్తాడు. తన వైఫ్ ను అడిగి ఇంట్లో తన మనుషులతో వెళ్తారు. తన కొడుకుతో చదరంగం ఆడుతున్న బెజొయ్ ని కొట్టి తన కొడుకుతో చెస్ ఆడుతాడు. బాగా ఆడావని చెప్పి, బెజొయ్ ని కత్తితో పొడుస్తాడు. దాంతో తన భార్య కన్నా ఇచ్చిన డబ్బు తీసుకుంటుంది. నేను గవర్నమెంట్ ఆఫీసర్ అని బెజొయ్ అంటే ఇక్కడ నేనేరా గవర్నమెంట్ అని కన్నా అంటాడు. తరువాత మార్కట్లో ఒకతన్ని నరికేస్తాడు. అది విన్న అజిమ్ వాడు అంత డేంజరెస్సా అయితే వాడి ప్లేస్ కు వెళ్లి మనమే కలుద్దా అంటాడు.
కట్ చేస్తే కన్నా గ్యాంగ్ తమ ప్లేస్ లో పేకాట ఆడుతుంటారు. అక్కడికి అజిమ్ పోలీసులతో వస్తాడు. జీపు దిగి కన్నా దగ్గరకు వెళ్తారు. మరో సీన్లో కన్నాకు ఫోన్ చేసి జిన్ను తన లవ్ గురించి మాట్లాడుతుంటే కన్నా మనిషి వచ్చి కొత్త ఇనిస్పెక్టర్ వచ్చినట్లు చెప్తాడు. లోపలకి రమ్మను అంటాడు. అక్కడి వచ్చిన ఆఫీసర్ ను పలకరించి కూర్చొమంటాడు కన్నా. అతని వెనుకాలే తన గ్యాంగ్ వచ్చి నిలబడుతుంది. మిమ్మల్ని చూసేనా ఊరు భయపడుతుంది అని, ఏంటి కన్నా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నావటా అని అజిమ్ అడుగుతాడు. దానికి కన్నా బాయ్ అని పిలవాలి సర్ అని కన్నా మనిషి అంటాడు. దానికి అజిమ్ కొప్పడుతాడు. ఇదిగో కొత్త పీసు అని గ్లాసెస్ గిఫ్ట్ ఇస్తాడు కన్నా. అంతలో తన కన్నుకు ఏం అయిందని అజిమ్ అడుగుతాడు. అక్కడో చిన్న ఫ్లాష్ కట్ పడుతుంది. తన కన్నుపై ఎవరో కొడుతారు. వెంటనే అక్కడి నుంచి లేచి జిన్నుకు ఫోన్ చేసి ఆ అమ్మాయిని వదిలై, అది రాజు గాడి చెల్లెలు అంటాడు. దానికి తనను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నట్లు తనకు నాన్నే ఉన్నాడని చెప్తాడు. ఫోన్ పెట్టేసీ వెనక్కి వచ్చి కూర్చొంటాడు కన్నా. స్టేషన్ వెళ్దామా అని అజిమ్ అడుగుతాడు. దానికి కన్నా మనుషులు నవ్వుతారు. ఇది చాలా కాస్ట్లీ గ్లాసెస్ ఒకసారి వేసుకొండి అని అనేసరికి దాన్ని చేతితో కొట్టి గన్ను తీసు గురిపెడుతాడు అజిమ్. టోని వద్దని చెప్తాడు. అలానే కూర్చొన్న కన్నా నీ వైఫ్ ప్రెగ్నెంట్ కదా.. 6 సార్లు అబార్షన్ అయి ఇప్పుడే కన్సీవ్ అయిందని, ఇదిగో లాస్ట్ వీక్ తీసిన స్కాన్ రిపోర్ట్ అని రిపోర్ట్స్ ఇస్తూ టెబుల్ ను తన్నుతాడు కన్నా. తరువాత అజిమ్ తలను టెబుల్ పెట్టి నీకు పుట్టబోయేది ఆడపిల్లా అని చెప్తాడు. తరువాత సంతకం పెట్టి తాను గిఫ్ట్ గా ఇచ్చిన గ్లాసెస్ అజిమ్ పెడుతారు. అందరూ నవ్వుతారు.
తరువాత సీన్లో అజిమ్ అదే గ్లాసెస్ పెట్టుకొని బార్లో మందేస్తుంటాడు. అక్కడికి టోని వస్తాడు. కన్నాను మనం ఏం చేయలేము వదిలేయండి అని అంటాడు. దానికి వాన్ని నరికేస్తా అంటాడు. తరువాత సీన్లో కార్లో ఇంటికి వెళ్తుంటే టోని దారిలో ఆపి టీ తాగుదాం అంటాడు. బజ్జీలు వేసే అవిడా కన్నా తల్లి అని చెప్తాడు. అక్కడ అండరాక్స్ కూపర్ ను పరిచయం చేస్తాడు. అక్కడ రాజు గురించి మాట్లాడుకుంటారు. ఎవడిచేతులోని చచ్చుంటాడు అనగానే ఆమే వేడినీళ్లు పోస్తుంది. రాజు గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా అంటుంది. దానికి రాజు ఎవరు అని టోనిని అజిమ్ అడుగుతాడు. కన్నాను కొట్టింది రాజు అని టోని చెప్తాడు.
తరువాత సీన్లో కన్నా ఇంట్లో మందు తాగుతూ ఉంటే అక్కడికి తన వైఫ్ వచ్చి పోలీసోడిని కొట్టానని సంతోషపడుతున్నావా అంటుంది. పాతా జ్ఙాపకాలు గుర్తుకొస్తే తాగుతున్న అని చెప్తాడు అంతలో ఇంటికి జిన్ను వస్తాడు. తాను తిరుగుతున్న అమ్మాయి రాజు గాడి చెల్లెలు అని చెప్తాడు కన్నా. అయితే ఏంటి అని తన వైఫ్ అంటుంది. మరో సీన్లో రాజు గురించి టోని చెప్తుంటాడు. రాజు చాలా ముక్కు సూటి మనిషి అని, కన్నా గాడిలా కాదు అంటాడు. ఊళ్లో జనాలు కూడా అతన్ని ఇష్టపడేవారు అని చెప్తాడు. రాజు, కన్నా ఇద్దరు స్నేహితులు అని చెప్తాడు. దారిలో విన్నర్స్ క్లబ్ దగ్గర ఆపుతాడు. రాజు కన్నాల గురించి చెప్తుంటాడు. అలా మట్లాడుకుంటూ రాజు తండ్రి పెద్ద రౌడీ అని తాను కూడా వాళ్ల నాన్నాలానూ కావాలి అనుకునేవాడు అని అంటాడు. తరువాత ఒక ట్రైలర్ ని చూపించి అతనే రవి, రాజు నాన్న అంటాడు. ఒకప్పుడు కోతా రవి పేరు చెబితే జనాలు భయపడేవారు అని చెప్తాడు. వాళ్ల నాన్నను చూసి తాను కూడా రౌడీ ఇజమ్ మొదలు పెట్టినట్లు అది వాల్ల అమ్మకు నచ్చేది కాదని, తన మాట వినకపోవడంతో రాజుతో వాళ్ల మాట్లాడేది కాదని వివరిస్తాడు. అలాంటి టైమ్ లోనే కన్నా, వాళ్ల అమ్మా రాజు జీవితంలోకి వచ్చారని చెప్తాడు. దానికి అజిమ్ రాజు కోతాను విడిచి ఎందుకు వెళ్లాడు ఏంటి ఆ స్టోరీ అని అడగుతాడు. సరిగ్గా పది సంవత్సరాల క్రితం 1986లో ఫుడ్ బాల్ వరల్డ్ కప్ జరిగే సమయంలో ఫ్లాష్ బ్యాక్ మొదలౌతుంది.
అందరూ వీధిలో టీవీ పెట్టుకొని ఫుడ్ బాల్ మ్యాచ్ ను చూస్తుంటారు. అదే సమయంలో రంజిత్ తమ్ముడు పులా వ్యాపారం పేరుతో గంజాయి కొట్టు నడిపిస్తుంటారు. రంజిత్ తమ్ముడు డబ్బులు లెక్కపెడతుంటే డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. డోర్ తియగానే ఇదేనారా నువ్వు చేసే పువ్వుల వ్యాపారం అని అతన్ని చెంపమీద కొడుతుంది తారా. తిరిగి అతను కూడా తారాని కొడుతాడు. ఇది నీకు అవసరమా ఇక్కడ నీ మొగుడు ఉన్నాడని వచ్చావా అంటాడు. దానికి తారా.. నీ మొగుడు వస్తున్నాడురా అంటుంది. కట్ చేస్తే తారా తమ్ముడు గంజయ్ తాగి చనిపోయాడు అని, అంతే కాదు తారా రాజు లవర్ అని ఒకడు చెప్తాడు. అందుకే కోతాలో రాజు గంజాయ్ లేకుండా చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు మీరు వచ్చి కోతాను చెడగొట్టారు అని గంజా తాగుతూనే ఒకడు అంటాడు. అదే సమయంలో అక్కడికి రాజు వచ్చి డోర్ ను తన్నుతాడు. కింద తన ఫ్రెండ్స్ ఉంటారు. కట్ చేస్తే రంజిత్ తమ్ముడు కింద పడి చనిపోతాడు. రాజు చేతిలో రక్తంతో తడిసిన కత్తి ఉంటుంది.
నెక్ట్స్ సీన్లో శవం ముందు అందరు ఉంటారు. రంజిత్ భార్య ఏడుస్తుంది. అక్కడ కొంత మంది ఇది గాంధీ గ్రామ పరువు సమస్య అని మాట్లాడుకుంటారు. ఇన్ని రోజులు రాజు చిన్న పిల్లాడు అని ఊరుకున్నా అని ఇకమీదుట ఊరుకునేది లేదని రంజిత్ అంటాడు. అంతలో ఫోన్ వచ్చిందని పిలిస్తే తాను లోపలికి వెళ్తాడు. రాజు ఫోన్ చేస్తాడు. ఏంటి నాన్ను ఏదో చేసేస్తా అని తెగ బిల్డప్ లు ఇస్తున్నావట అని అంటాడు. రవి అన్న మీద గౌరవంతో నిన్ను వదిలేశా అంటాడు రంజిత్. నేను అక్కడికి వస్తున్నా అని రాజు అంటాడు. గాంధీగ్రామం ఒక యమలోకం దమ్ముంటే నా ముందుకు రారా అని ఫోన్ పెట్టేస్తాడు. తన మనుషులు ఆవేశంగా ఉంటారు. రాజును రెండు ముక్కలు చేసి సముద్రంలో పడెస్తా అని ఇంగ్లిష్ లో మాట్లాడుతుంటాడు. అక్కడికి తన మునుషులు కత్తులతో వచ్చి మేము రెడీ అంటారు. ఎందుకు అని రంజిత్ అంటాడు. అదే బాయ్ రాజు వస్తున్నాడుగా అంటారు. ఇక్కడికా అని ఏం తెలియనట్లు అంటాడు. అదే సమయంలో కారు హారన్ కొట్టిన సౌండ్ వస్తుంది. రాజు కారు వస్తుంది. అప్పటివరకు రంజిత్ కాలు మీదు వేసుకున్న కాలు కిందికి దించి భయంతో చూస్తూ ఉంటాడు. కార్లోంచి రాజు మనుషులు దిగుతారు. తరువాత సిగరేట్ నోట్లో పెట్టుకొని రాజు దిగుతాడు. గాంధీగ్రామం మనుషలు గేట్లు వేస్తారు. నీ ముందే ఉన్నా ఏం పీకుతామో పీకు అంటాడు రాజు. శవం ముందు ఏడుస్తున్న తన భార్యను ఏడుపు ఆపమని కన్నా చెప్తాడు. వాన్ని చంపింది నేనే ఇప్పుడు రండిరా తేల్చుకుందాం అంటాడు రాజు. రవి అన్న కొడుకును అని వదిలేశావా అని రంజిత్ ముందుకెళ్లి ఆ అడ్రస్ వద్దనుకొని చాలా ఏళ్లు అయింది అంటాడు. దాంతో భయపడ్డ రంజిత్ నువ్వు వదిలేయ్ నేనూ వదిలేశా అని అనడంతో రాజు వెళ్లిపోతాడు.
కట్ చేస్తా రాజు లైఫ్ స్టైల్ ను వాయిస్ ఓవర్, పాటతో చూపిస్తారు. ఉన్నవాడి దగ్గర కొట్టి లేనివాడికి పెట్టాలనేది రాజు లక్ష్యం అని రాజు గురించి టోనీ వాయిస్ ఓవర్ వస్తుంది. కలెక్షన్లు డబ్బులు ఎన్ని వచ్చినా వాటిని దాచిపెట్టడు అని లైఫ్ ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తాడు రాజు… సాంగ్ స్టార్ట్ అవుతుంది. రాజుకు అమ్మాయిల వీక్ నెస్ ఉండేదని కాని తారాను ప్రేమించిన తరువాత రాజు ఏ అమ్మాయి వంక కూడా చూసిందే లేదని చెప్తాడు. తరువాత సీన్లో తారాతో తన ప్రేమ గురించి ఒక కవిత చెప్తాడు. తన ప్రేమగా భయటికి వచ్చినప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎందుకు అని తారా అడిగితే నాకు స్నేహానికి, ప్రేమకు పక్షపాతం చూపడం నచ్చదు అని చెప్తాడు. నెక్ట్స్ డే మ్యాచ్ ఉందని గట్టిగా తినండి ఫ్రెండ్స్ తో చెప్తాడు. తరువాత తారాను తన ఇంటిదగ్గర దిగబెట్టడానిక వెళితే తారా తండ్రి పైనుంచి కోపంగా చూస్తాడు. వారి లవ్ మ్యాటర్ నాన్నకు చెప్పలేదా అని అడిగితే చెప్పాను అని చెప్తుంది. కట్ చేస్తే ఫుడ్ బాల్ మ్యాచ్ జరుగుతుంది. గ్రౌండ్ అంతా రాజు రాజు అని అరుస్తుంటారు. గ్రౌండ్లో చాలా మంది ఉంటారు. రంజిత్, తారా అందరూ అరుస్తూ ఉంటారు. అదే సమయంలో రాజుకు బాల్ పాస్ చేయకుండా కన్నా గోల్ చేయకుండా బయటకు తన్నుతాడు. అక్కడికి రాజు చెల్లెలు బుజ్జి అన్నయ్య అని రాజు దగ్గరికి వెళ్తుంది. అంతలో రాజు అమ్మా వచ్చి పాపను తీసుకెళ్తుంది. తరువాత ఆట మళ్లీ స్టార్ అవుతుంది. రాజు దగ్గర బాల్ ఆగుతుంది అందరు అక్కడికి పరుగెత్తుకుంటు వస్తారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అంతలో రాజు గోల్ కొడుతాడు. అందరూ సంతోషంగా ఉంటారు. రంజిత్ కూడా చప్పట్లు కొడుతాడు. అక్కడికి తారా స్నేహితుడు నిఖిల్ వస్తాడు. అతడు ఎవరు అని రంజిత్ అని అడుగుతాడు.
తారా బుక్ స్టోర్ రన్ చస్తుంది. నెక్ట్స్ సీన్లో తారాతో నిఖిల్ ముంబాయి వచ్చేయొచ్చు కదా అని మాట్లాడుతాడు. అంతలో అక్కడికి రాజు కారు వచ్చిన సౌండ్ వస్తుంది. రాజు వచ్చాడు నువ్వు వెళ్లూ రాజుకు విలెకర్లను చూస్తే కోపం అని చెప్పి అతన్ని పంపించేస్తుంది. రాజు లోపలికి వస్తాడు. ఎవరు లేరెంటని చూస్తుండగా అక్కడ నిఖిల్ కనిపిస్తాడు. తారా అని పిలువగా తారా వస్తుంది. తనతో రోమాంటిక్ గా మాట్లాడుతుండగా నిఖిల్ బుక్స్ కిందపడేస్తాడు. దాంతో రాజుకు కోపం వచ్చి తిడుతాడు. తారా అతన్ని బయటికి వెళ్లిపో అంటుంది. అతను వెళ్లిపోతాడు. తరువాత రాజు తారాతో మాట్లాడి తనను ముద్దుపెట్టుకుంటాడు. ఇది షాప్ అని తారా కంట్రోల్ చేస్తుంది. దాంతో రాజు నవ్వుకుంటూ బయటకు వెళ్లిపోతాడు. నెక్ట్స్ సీన్లో క్లబ్ ను కాస్త పెద్దిది చేద్దామా అని కన్నా అడుగుతాడు. ఎందుకు అంటాడు రాజు. మనం ఎన్నో డబ్బులు సంపాదిస్తున్నాము కాని రేపటికి ఏమి దాచుకోవడంలేదు అంటాడు. దానిక రేపు అన్నది రాక్షసి లాంటిది అని చెప్తాడు రాజు. దానికి, కన్నా గంజయ్ బిజినెస్ లో మంచి లాభాలు ఉన్నాయి అని, రంజిత్ ని చూడు ఎలా సంపాదిస్తున్నాడో అంటాడు. తారాకు ఇష్టం లేదని మనం బిజినెస్ ను మానేయ్యాలా అంటాడు. దాంతో రాజు కోపంగా అవును మానేయ్యాలి అంటాడు. తరువాత అమ్మాయికోసం వదిలేస్తే బాగుంటుంది అని అనేసరికి అందరూ నవ్వుతారు. అక్కడికి రాజు చెల్లెలు వస్తుంది. తన బర్త్ డే అని కేక్ కట్ చేయమంటుంంది. తరువాత తనతో కలిసి కార్టూన్ చూస్తాడు. అంతలో ఫోన్ వస్తుంది. మార్కెట్లో ఏదో గొడవ అని వెళ్లిపోతాడు రాజు.
బుజ్జికోసం వాళ్ల అమ్మ వస్తుంది. తనను కొడుతుంది. అంతలో కన్నా అడ్డుకుంటాడు. రాజు అమ్మా బుజ్జిని తిడుతూ.. వెదవలు అని తిడుతుంది. దాంతో కన్నాకు కోపం వచ్చి రాజు అమ్మ చేయిపట్టుకొని కొప్పడుతుంటాడు. అంతలో అక్కడికి కొత్త రవి వచ్చి కన్నాను కొడుతాడు. ఇద్దరికి గొడవ జరుగుతుంది. కన్నా కత్తి తీస్తాడు. దాంతో రవి కన్నాను చేయిని నరుకుతాడు. విషయం తెలిసిన రాజుకు కోపం వచ్చి తండ్రిమీదకు వెళ్తాడు. ఇంట్లోకి వెళ్లి అన్ని సమాన్లు పగలగొడుతాడు. అక్కడికి వచ్చిన తన తండ్రి రవిని కొట్టడానికి వెళ్లగానే రాజును కిందపడేసి పీకను పట్టుకుంటాడు రవి. ఇంకా పవర్ ఉందని, నాకు మ్యానేజర్ గా వచ్చేయ్ అనగానే బయటకు వెళ్లురా అని తల్లి అంటుంది. దాంతో నువ్వు మాట్లాడావు అని బయటకు వెళ్లిపోతాడు. కట్ చేస్తే కన్నాకు తన తల్లి అన్నం తినిపిస్తుంది. ఆ సమయంలో అక్కడికి రాజు వస్తాడు. కన్నా నా ప్రాణం అని రాజు అంటాడు. కన్నాకు అన్నం తినిపిస్తాడు రాజు. తరువాత జాగ్రత్తగా ఉండమని రాజు వెళ్లిపోతాడు.
నెక్ట్స్ సీన్లో బిల్లా రాజు క్లబ్ దగ్గరకు వస్తాడు. వారి మీదకు నాటు బాంబ్ లా చుట్ట చుట్టిన ఉండను విసురుతాడు. దాన్ని రాజు క్యాచ్ పట్టుకుంటాడు. రంజిత్ బాయ్ పంపాడు రమ్మాన్నాడు అని చెప్పి వెళ్లిపోతారు. రంజిత్ పంపిన ఫోటోలను చూస్తే అందలో తారా నిఖిల్ క్లోజ్ గా ఉన్న ఫోటోలు ఉంటాయి. రాజు కోపంతో కారు తీసుకొని రంజిత్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ తారా ఉంటుంది. వాడెక్కడ అని అడగ్గానే అతన్ని గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. నిఖిల్ ను చంపి సముద్రంలో పడేయ్ అంటాడు రంజితో దాంతో వాడు పారిపోతాడు.
రాజు కోపంతో తారాను చంపడానికి వెళ్తుంటే నువ్వు నాకు నచ్చలేదు అని చెప్తుంది. దాంతో రంజితో తారాకు గంజా తాగిస్తాడు. రాజు రంజిత్ ను కొట్టి వాళ్ల మనుషులను పొడుస్తాడు. అందరూ భయపడి పారిపోతారు. కట్ చేస్తా తారాను తీసుకెళ్లి ఇంటిదగ్గర దింపేసి తనను భూతుమాటలు తిట్టి వెళ్లిపోతాడు. తరువాత సీన్లో రాజు తాగేసి పడిపోతాడు. తారాను తలుచుకుంటూ బాధపడుతుంటాడు. మత్తులో పడుకుంటాడు. అదే సమయంలో అక్కడికి కన్నా వస్తాడు. రాజును ఎంత లేపినా లేవడు. దాంతో కన్నా ఆలోచనలో పడుతాడు. రంజిత్ తో డ్రగ్స్ డీల్ సెట్ చేసుకుంటాడు. అక్కడ మంజు ఉంటుంది. తరువాత సీన్లో రాజును చంపడానికి మనుషులు వస్తారు. ఇక్కడ కన్నాతో రంజిత్ మాట్లాడుతూ ఉంటాడు. అంతలో ఫోన్ మోగుతుంది. వాన్ని లేపాశారా అని అడుగుతాడు రంజిత్. బాయ్ వాన్ని చంపడం మనవళ్ల కాదు అని చెప్తాడు. దాంతో రంజిత్ కు అర్జెంట్ పని ఉంది అని వెళ్తాడు.
కన్నా తన బైక్ పై డ్రగ్స్ పెట్టుకొని వెళ్తుండగా దారిలో రాజు కలుస్తాడు. ఎక్కిడినుంచి వస్తున్నావు అని అడిగితే గాంధీగ్రామమ్ అని ఒక ఫ్రెండ్ ను కలిసి వస్తున్నా చెప్పి వెళ్లబోతుంటే తన దగ్గర ఉన్న డ్రగ్స్ ను చూసి.. కన్నాను పట్టుకొని కొడుతాడు.
తరువాత రాజు తాగుతూ బాధపడుతూ ఉంటాడు. అక్కడికి రాజు తల్లి వచ్చి ఈ ఊరు వదిలి వెళ్లిపో అంటుంది. నీకు నీ చెల్లెలు మీద ప్రేమ ఉంటే వెళ్లిపో అంటుంది. దాంతో నేనూ కొతా వదిలి వెల్లిపోతా అని చెప్తాడు. తన క్లబ్ ను చూసికొని, స్నేహం, ప్రేమ అన్నింటిలో మోసపోయి రాజు ఊరు వదిలి వెళ్లిపోతాడు. ఇదే విషయాన్ని అజిమ్ కు టోని చెప్తుంటాడు. అలాగే కన్నా చావు చూడకుండా కోతాను వదిలను అని తారా ఇక్కడే ఉంటుంది. అలాగే అడ్డొచ్చిన తారా నాన్నను చంపి, తారా ఇంటి పక్కనే తాగి ఊగడానిక గంజాయి సెంటర్ ను కన్నా కట్టించినట్లు టోని చెప్తాడు. అంతలో అక్కడికి జిన్ను వస్తాడు. అతను కూడా చాలా పెద్ద క్రిమినల్ అని ఆ విషయం రాజు చెల్లెలు రితూకు తెలియదు అని చెప్తాడు. దాంతో అజిమ్ ఆలోచనలో పడుతాడు. తరువాత రాజును కోతాకు తిరిగి తీసుకొస్తే ఎలా ఉంటుంది అని అజిమ్ ఆలోచిస్తాడు.
కట్ చేస్తే ఉత్తర ప్రదేశ్ నుంచి ఫ్యాక్స్ వస్తుంది. అదే విషయం అజిమ్ కు ఫోన్ వస్తుంది. దాంతో రాజుకు నీ చెల్లెలు డేంజర్ లో ఉందని ఒక లెటర్ పంపిస్తాడు. కట్ చేస్తే రితూ, జిన్ను ఒక హోటల్లో కాఫీ తాగుతుండగా అక్కడికి టోని వచ్చి జిన్ను దగ్గర గంజాయ్ ఉందని తీసుకెళ్తారు. రితూ షాక్ లో ఉంటుంది. రీతు ఇంట్లో ఉండగా తారా మాట్లాడుతుంది. రవి కూడా అక్కడే ఉంటాడు. అక్కడికి జిన్ను వస్తాడు రవి అడ్డుకుంటాడు. జిన్నును కొడుతాడు. జిన్ను మాత్రం ఐలవ్ యు చెప్పుకుంటూ వెళ్తాడు. కట్ చేస్తే జిన్ను డ్రగ్స్ తీసుకొని, తారా ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు, బెదిరిస్తాడు. కట్ చేస్తే రితూ మార్కెట్లో ఉండగా అక్కడికి జిన్ను వచ్చి మాట్లాడలని అడుగుతాడు. దానికి ఒప్పుకోకపోవడంతో జిన్ను వైన్ పోసి నిప్పుపెట్టాలని చూస్తాడు. అడ్డుచ్చిన ఒకతన్ని పొడిచి రితూ వెంటపడుతాడు. రితూ తప్పించుకిని వెళ్తుంది. టోని అది చూసి జిన్ను కోసం వెతుకుతాడు. అంతలో అక్కడ జిన్ను గొంతును పట్టుకుంటాడు రాజు. టోని వద్దన్నా వినకుండా జిన్ను గొంతు పిసికి చంపేస్తాడు.
తరువాత సీన్లో జిన్ను శవాన్ని కన్నా, తన వైఫ్ మంజు చూస్తారు. అతన్ని ఫ్రీజర్లో పెట్టమని చెప్తుంది. తరువాత సీన్లో టోని రాజు మాట్లాడుకుంటారు. వారి గ్యాంగ్ గురించి కోతా ఊరి గురించి మాట్లాడుతుండగా అక్కడికి అజిమ్ వస్తాడు. జిన్నును చంపింది ఇతను కాదు అని, సాక్ష్యం కూడా లేదని టోని చెప్తాడు. దాంతో నువ్వు వెళ్లోచ్చు కాని నువ్వు మాకు చెప్పకుండా ఊరు వదిలి వెళ్లకూడదు అని చెప్తాడు. దాంతో రాజు తారా నడుపుతున్న గ్రంధాలయానికి వెళ్లి చూస్తాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. రవి స్కూటర్ కిక్ కొడుతుంటాడు. ఇంకా రవి కోపం తగ్గదు. రాజు ఇంట్లోకి వెళ్తాడు. బుజ్జి అని పిలుస్తాడు. తానకు బయంగా ఉందని వాళ్లు తనను చంపేస్తారు అని భయపడితుంది రితూ. తనకు ధైర్యం చెప్పి బయటకు వెళ్తుంటాడు. రవి ఇంకా స్కూటర్ ను కిక్ కొడుతాడ. రాజు రాగానే రవి ఇంట్లోకి వెళ్తాడు. రాజు ఆ స్కూటర్ ను స్టార్ట్ చేస్తాడు. అక్కడికి తండ్రి వచ్చి మీ అమ్మ చనిపోయే ముందు ఈ ఉత్తరం ఇవ్వమన్నది అని ఒక ఉత్తరం ఇస్తాడు. దాన్ని రాజు ఒక బార్ లో చదువుతుండగా అక్కడకి కన్నా తన మనుషులతో వస్తాడు. రాజును చూసి దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. మందు తాగమని ఆఫర్ ఇస్తాడు రాజు. దాన్ని తిరస్కరించి నేనూ తాగే మందు కనీసం చూసి ఉండవు అని చెప్తాడు. తరువాత కోతా గురించి మాట్లాడుకుంటారు. అంతలో లక్నోలో తన మనిషి ఫోన్ చేస్తాడు. రాజు మద్రాసి పేరు చెబితే ఇక్కడ ప్రతి ఒక్కరు భయపడుతున్నారని, అతను చంపడానిక ఒక సూదో, పెన్నో చాలు అని చెప్తాడు. ఇక దేవ్ గుజ్జర్ అనే వ్యక్తి తన గ్యాంగ్ లో రాజుకు అప్పొనెంట్ అని అతను ప్రస్తుతం జైల్ లో ఉన్నాడని, మనం అతనితో చేతులుకలిపితే రాజును తరిమేయొచ్చని చెప్తాడు. ఫోన్ ఐన తరువాత మళ్లి వెళ్లి రాజుతో మాట్లాడుతుంటాడు. జిన్నును నేనే చంపాలి అనుకున్నా అని నువ్వు చంపి హెల్ప్ చేశావు అని చెప్తాడు. తరువాత రాజు మళ్లి పెగ్ ఆఫర్ చేస్తాడు. అది తాగకుండా నువ్వు వెళ్లలేవు అని రాజు అంటాడు. దాంతో తన గ్యాంగ్ రెచ్చపోతుండగా.. వారిని ఆపి పెగ్ తాగుతాడు కన్నా.
నెక్ట్స్ సీన్లో పోలీస్టేషన్ కు మంజు వెళ్తుంది. అజిమ్ తో తన తమ్ముడిని చంపిన రాజును వదిలేశారు కదా అని మాట్లాడుతుంది. దానికి సాక్ష్మం లేదని చెప్తాడు. పైగా రాజుకు కన్నానే భయపడుతున్నాడని చెప్తాడు. అలాగే మాట్లాడి రెచ్చగొడుతాడు. మంజు కోపంతో వెళ్లిపోతుంది.
తరువాత సీన్లో రాజు, కన్నా తల్లిదగ్గరకు వెళ్తాడు. రాజును చూసి సంతోషంతో కన్నా తల్లి వచ్చి రాజును కౌగిలించుకుంటుంది. నాతోపాటు వచ్చేయ్ అమ్మ అంటుండంగా కొంత మంది బైక్ లతో గంజా తాగి రాజును చంపాలని వస్తారు. అతని కళ్లల్లో కారం కొట్టి పొడవాడినికి ప్రయత్నిస్తారు. అక్కడికి కన్నా భార్య మంజు వస్తుంది. అంతలో నీళ్లతో కళ్లు కడుక్కొని ఫైట్ చేస్తాడు. అందరిని చితక్కొడుతాడు. పెన్ తీసుకొని అందరిని పొడుస్తాడు రాజు. అది చూసి మంజు వెళ్లిపోతుంది. తారా ఇంటి ముందే గంజాయ్ క్యాంప్ ఉందని కన్నా తల్లి చెప్పడంతో రాజు వెళ్లి దాన్ని కాల్చేస్తాడు. అది తారా చూస్తుంది. అందరూ అక్కడినుంచి వెళ్లిపోతారు. ఇద్దరు కాసేపు చూసుకుంటారు. రాజు కూడా అక్కడినుంచి వెళ్లిపోతాడు. తారా బాధపడుతూ చూస్తుంది.
నెక్ట్స్ సీన్లో మంజును పిలుచుకుంటూ కన్నా వస్తాడు. రాజును చంపడానికి జిన్ను ఫ్రెండ్స్ ను పంపించావా అని మాట్లాడుతాడు. ఫ్లాష్ బ్యాక్ లో మంజు కోసం రంజిత్ ను చంపిన రాజు ఒక మగాడు అని కన్నాను రెచ్చగొడుతుంది.
తరువాత గ్రౌండ్లో రాజు ఫుట్ బాల్ చూస్తూ ఉంటాడు. అక్కడికి అజిమ్ వస్తాడు. నీ మీద ఎటాక్ జరగొచ్చని కన్నాను కూడా చంపేయ్ అని చెప్తాడు. దానికి అది కుదరదు అని, నా జీవితంలో తక్కువ మంది నాకు కావల్సిన వ్యక్తులు ఉన్నారు అని అందులో కన్నా ఒకడు అని చెప్తాడు. అతను వెళ్లిపోయిన తరువాత అక్కడికి కన్నా వచ్చి ఫుడ్ బాల్ ఆడుతాడు. కట్ చేస్తే రాజు, కన్నా ఇద్దరు మందేస్తు మాట్లాడుకుంటారు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. కోతాలో ఇంకా కొన్నాళ్లే ఉంటానని తరువాత ఇక యాపిల్ తోట కొన్నాను అక్కడికి వెళ్లిపోతా అని చెప్తాడు రాజు. తరువాత కన్నా వెళ్లిపోతూ.. రూమ్ క్లీన్ చేసే అతన్ని రాజును చంపడానికి ప్లాన్ చేసి వెళ్తాడు. రూమ్ క్లీన్ చేయాడాని వచ్చిన అతను రాజుమీదకు ఎటాక్ చేస్తాడు. కట్ చేస్తే లెస్లీ నుంచి వర్క్ అయిపోయింది అని మెసెజ్ వస్తుంది. వెళ్లి చూసేసరికి సూట్ కేసులో లెస్లీ తల కాళ్లు, చేతులు ఉంటాయి.
కన్నాకు రాజు ఫోన్ చేస్తాడు. ఇద్దరూ చూసుకుందాం అని రాజును చంపడానికి కన్నా తన మనుషులతో మార్కెట్లోకి వెళ్తాడు. అక్కడ తన మనుషులు బాంబులు విసురుతూ.. కత్తులతో దాడి చేస్తారు. అందరిని చితక్కొడుతాడు రాజు. హర్ట్ సర్జరీ అనే కొత్త పద్దతిలో యాదగిరిని చంపేస్తాడు రాజు. దాంతో మార్కెట్లో ప్రజలు అందరూ రాజు వైపు వెళ్తారు. ఆ కోపంతో కన్నా రాజును కొట్టడానికి వెళితే తన మనుషు కన్నాను ఆపి, తీసుకొని వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే అజిమ్ తో కన్నా వెళ్లిపోయాడు అని మాట్లాడుకుంటారు. దానికి టోని వాడు ఎక్కడికి వెళ్లడు అని ఇక్కడే ఎక్కడో దాక్కొని అన్ని చూస్తుంటాడు అని చెప్తాడు. తరువాత సీన్లో తండ్రికి అన్నయ్య తీసుకొచ్చాడు అని షర్ట్ ఇస్తుంది రితూ. అదే సమయంలో రాజు తన తండ్రి కాసేపు మాట్లాడుకుంటారు. తారా మంచి అమ్మాయి నీ తోడు తీసుకెళ్లు అని చెప్తాడు. కట్ చేస్తే తారా ఇంటికి రాజు వెళ్లి హారన్ కొడుతాడు. దానికి తారా ఎంతో సంతోషంతో కిటికిలోంచి చూస్తుంది. అంతలో కన్నా వెనుకనుంచి తారాను పొడుస్తాడు. తారాను ఆసుపత్రిలో చేర్పిస్తారు టోని, రాజు. ఆసుపత్రికి కన్నా ఫోన్ చేసి రాజు తండ్రిని చంపేశామని చెప్తాడు. బోటుకు కోతా రవి శవం ఉంటుంది. రాజు తన తండ్రి కాళ్లను పట్టుకొని ఏడుస్తాడు. మరో సీన్లో టోని అజిమ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. కన్నా, రాజు కన్న నువ్వు హీనంగా మారావు. వారికన్న క్రిమినల్ గా మారావు అని టోని అంటాడు. తరువాత సీన్లో రవి చితి దగ్గర కన్నా తల్లి రాజుతో మాట్లాడుతుంది. ఈ రోజు రాత్రికి వాడిని తీసుకోస్తా అని కాని వాడిని వదిలిపెట్టకు అని చెప్తుంది.
కట్ చేస్తే రాజు అక్కడికి వెళ్తాడు. వెనుకనుంచి కన్నా దొంగదెబ్బ కొడుతాడు. రాజును రెండు చేతులను కట్టేస్తారు. అక్కడికి మంజు వస్తుంది. తన ముందే కన్నా రాజును పొడుస్తాడు. తరువాత మంజుతో రాజు మాట్లాడుతాడు. మంజు ఎవరో తాను ఎక్కడినుంచి వచ్చిందో, జిన్ను తన తమ్ముడు కాదు అని తన కొడుకూ అని చెప్తాడు దాంతో కోపంతో మంజు వెళ్లిపోతుంది. దాంతో కన్నా బయటకు వచ్చి మంజును పిలుస్తుండగా అక్కడికి పోలీసులు వస్తారు. రాజును తీసుకుపోవడానికి టోని వెళ్లగా అక్కడ రాజు ఉండడు.
కట్ చేస్తే కోతా అంతా రాజు చనిపోయిండని మాట్లాడుకుంటారు. మరో సీన్లో టోని అజిమ్ మాట్లాడుకుంటారు. ఇప్పుడు హ్యాప్పినా అని టోని అంటాడు. తాను రిజైన్ చేయబోతున్నట్లు అజిమ్ చెప్తాడు. మరో సీన్లో కన్నా, మంజు బీచ్ లో మాట్లాడుకుంటారు. నెక్ట్స్ సీన్లో నరం హోటల్లో ఒక లేడిని కొడుతుంటాడు. జిన్ను చూడాటానికి వెళ్లిన మంజు, కన్నాలకు నరం శవం కనిపిస్తుంది. అలా కన్నా మనుషులను ఒక్కోడిని చంపేస్తుంటాడు రాజు. రాజు కోసం కన్నా గ్యాంగ్ వెతుకుతూ ఉంటుంది. అలా ఒక్కొక్కడిని ఏరేస్తుంటాడు కన్నా. కట్ చేస్తే హర్బర్ లో కన్నా మనిషిని వేలాడిస్తాడు. అది చూసిన ప్రజలు నవ్వుకుంటారు. తరువాత సీన్లో టోని రాజు మిస్సింగ్ పోస్టర్ ను చింపేస్తాడు.
ఫ్లాష్ బ్యాగ్ లో రాజును బిల్లా సేవ్ చేస్తాడు. అదే విషయాన్ని అజిమ్ కు ఒక అబ్బాయి లెటర్ ఇస్తాడు. దాంతో టోని అజిమ్ సంతోషపడుతుంటారు. కట్ చేస్తే తన మనుషుల శవాలను చూడడానికి కన్నా ఆసుపత్రికి వెళ్తాడు. దమ్ముంటే ఒక మాగాడిలా ముందుకు రమ్మనురా అని అరుస్తుంటాడు కన్నా.. ఆ సమయంలో రాజు బిళాకు ఫోన్ చేసి సిద్ధంగా ఉండమని చెప్తాడు. నెక్ట్స్ సీన్లో కన్నా బిళాతో మాట్లాతుండగా అక్కడికి రాజు వస్తాడు. బిళా రాజు చంపడానికి వచ్చి రాజు వెనుకాల చేరుతాడు. ఇలాంటిది ముందే జరుగుతుందని గెస్ చేసి మరో టీమ్ ను రెడీ చేశా అని తన గ్యాంగ్ ను దింపుతాడు కన్నా.. వారిని గన్స్, నైఫ్స్ తో ఊచకోత కోస్తాడు రాజు. తరువాత కన్నా రాజు ఫైట్. కన్నాను కసితీరా కొడుతాడు రాజు. రాజు నన్ను చంపకు నేను కోతా వదిలి వెళ్లిపోతా అని బతిమిలాడుతాడు. దానికి నేను చంపను అని ఈ అవకాశాన్ని ఇంకోకరికి ఇస్తున్నా అని రంజిత్ కొడక్కు అవకాశం ఇస్తాడు. రంజిత్ ను చంపుతుండగా తన కొడుకు చూసి కన్నాపై పగ పెంచుకుంటాడు. దానికి కన్నా నేను వాడి చేతులో చావను రాజు నువ్వు చంపేయమని అంటాడు. దానికి ఈ భూమి మీద అందరికి కంటే ఇష్టం నువ్వేరా అని కన్నాతో చెప్పి వెనక్కి తిరుగుతాడు.
గన్ తీసుకొని రంజిత్ కొడుకు కన్నాను కాల్చేస్తాడు. తన దగ్గర గన్ తీసుకొని కోతాకి ఇంకో యజమాని అవసరం లేదని బిళాని కాల్చేస్తాడు రాజు. అలా గన్ తీసుకొని బయటకు వెళ్లిపోతాడు. కట్ చేస్తే 1998 సిమ్లాలో ఆపిల్ తోటలో తారా, రాజు వ్యవసాయం చేసుకుంటు ఉంటారు. వారితో పాటు రితూ కూడా ఉంటుంది. ఈ కొత్త జీవితంలో సంతోషంగా ఉన్నట్లు చెప్తాడు. కట్ చేస్తే మంజు తన గ్యాంగ్ రాజు ఫోన్ చేసి బెదిరిస్తుంది. నీకు దమ్ముంటే రారా అని రాజు అనడంతో సెకండ్ పార్ట్ కు లీడ్ ఇస్తూ కింగ్ ఆఫ్ కోతాకు శుభం కార్డు పడుతుంది.