ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో.. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అడివి శేష్. వరుస హిట్లతో జోష్ మీదున్న అడివి శేష్ ఇప్పుడు హిట్ సీక్వెల్ గూఢచారి2తో బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందంటూ రివీల్ చేశాడు.
క్షణంతో మొదలైన అడివిశేష్ బాక్సాఫీస్ విజయం.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. చివరగా మేజర్, హిట్ 2తో ఫ్రాంచైజీతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఐదేళ్ల క్రితం శేష్ నుంచి వచ్చిన ‘గూఢచారి’ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌ను ‘జీ2’గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు అడివి శేష్. పాన్ ఇండియా రేంజ్లో భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ రాబోతోంది. అందుకోసం ఏకంగా మూడు నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కానీ ఈ సినిమాకు డైరెక్టర్ మారిపోయాడు. గూఢచారి డైరెక్టర్ శశి కిరన్ తిక్కా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ‘మేజర్’ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే.. ఇప్పటికే గూఢచారి 2 సినిమాలో హీరోయిన్గా బనితా సందు నటిస్తున్నట్టుగా అనౌన్స్ చేశాడు అడివి శేష్.
ఇక ఇప్పుడు తాజాగా శేష్ ఎక్స్ శృతి అంటూ ట్వీట్ చేసాడు. ఈ సినిమాలో శృతి హాసన్ కూడా ఓ హీరోయిన్గా నటిస్తోంది.. అంటూ ముందు నుంచి వినిపిస్తునే ఉంది. ఇప్పుడు ఆ వార్తలని నిజం చేస్తూ శృతి హాసన్ ఈ సినిమాలో నటిస్తుందని క్లారిటీ ఇచ్చేశాడు శేష్. అయితే శేష్ ఎక్స్ శృతి అని ట్వీట్ చేయడంతో.. శృతి హాసన్ హిరోయిన్‌గా శేష్ గర్ల్‌ఫ్రెండ్‌గా నటిస్తోందా? లేదంటే నెగెటివ్ రోల్ చేస్తుందా? అనే డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే.. అడివి శేష్ సినిమాల్లో విలన్ క్యారెక్టర్ని ఊహించడం కష్టమే. మరి ఈ సినిమాలో శృతి హాసన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి.