KRNL: రాయలసీమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన యూజీ సీబీసీఎన్ 5వ సెమిస్టర్ పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు చూచిరాతకు పాల్పడి డీబార్ అయ్యారని వీసీ వెంకట బసవరావు తెలిపారు. కర్నూలు రవీంద్ర, ఆత్మకూరు ప్రభుత్వ, కోడుమూరు సాయిరాం, నందికోట్కూరు సాయిరాం, సెయింట్ జోసెఫ్ కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున డీబార్ అయ్యారన్నారు.