Shocking.. రతికతో కిరణ్ అబ్బవరం పెళ్లి, బాబు ఎందుకంత పగ!
రెండు మూడు వాయిదాల అనంతరం ఫైనల్‌గా అక్టోబర్ 6వ తేదీన థియేటర్లోకి రాబోతోంది కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ ఫిల్మ్ రూల్స్ రంజన్. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు కిరణ్. అందులోభాగంగా కిరణ్‌కు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చాడు ఓ నెటిజన్.
రెండు మూడు వాయిదాల అనంతరం ఫైనల్‌గా అక్టోబర్ 6వ తేదీన థియేటర్లోకి రాబోతోంది కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ ఫిల్మ్ రూల్స్ రంజన్. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు కిరణ్. అందులోభాగంగా కిరణ్‌కు దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చాడు ఓ నెటిజన్.
Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో బడా బడా సంస్థలు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాయి. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఇంట్రీ ఇచ్చిన కిరణ్.. ఆ తర్వాత వెంటనే ఎస్ఆర్ కళ్యాణ మండపంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాతే రేసులో వెనకపబడిపోయాడు. సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ సినిమాలతో ఆకట్టుకోలేకపోయాడు. దాంతో ఈసారి ‘రూల్స్ రంజన్’తో హిట్ కొట్టాలని గట్టిగానే ఫిక్స్ అయిపోయాడు. డీజే టిల్లు బ్యూటి నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న మూవీని సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్ పోన్ చేసి అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నాడు.
ఏఎం రత్నం సమర్పణలో, ఆయన తనయుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పాటలు, ట్రైలర్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు తగ్గట్టే గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు కిరణ్. నెటిజన్స్ అడిగిన ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. రీసెంట్గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 నుంచి రతిక రోజ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు తన అందంతో అందరినీ హీట్ ఎక్కించింది అమ్మడు. ఏకంగా బేబి సినిమా రేంజ్లో డ్రామాలు చేసింది.
అలాంటి అమ్మాయి కిరణ్ అబ్బవరంకు భార్యగా రావాలని అన్నాడు ఓ నెటిజన్. ‘రూల్స్ రంజన్ హిట్ అయ్యాక నీకు రతిక లాంటి అమ్మాయితో పెళ్లి అవ్వాలని కోరుకుంటున్నా, ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ పెట్టగా.. ఆ నెటిజన్‌కు కిరణ్ అబ్బవరం షాకింగ్ రిప్లై ఇచ్చాడు. ‘ఎందుకమ్మా నా మీద నీకంత పగ.. పెళ్లయితే చేసుకుందాం కానీ.. చూద్దాం ఎలాంటి అమ్మాయి వస్తుందో’ అంటూ కిరణ్ కామెంట్ చేశాడు. దీంతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది రతిక. ఎందుకంటే.. అలాంటి అమ్మాయి తనకొద్దని ఇండైరెక్ట్‌గా చెప్పేశాడు కిరణ్.