Koratala Shiva: బిగ్ సర్ప్రైజ్.. ‘దేవర’ 2 పార్ట్స్
ప్రస్తుతం తెరకెక్కుతున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమాల్లో.. దేవర పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు డైరెక్టర్ కొరటాల శివ. ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు.
‘Devara’ 2 parts: జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘దేవర’ పై గ్లోబల్ లెవల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో.. మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. యాక్షన్‌కు సంబంధించిన వరకు.. రీసెంట్గా తెరకెక్కించిన అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్‌తో సహా దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. త్వరలో టాకీ పార్ట్ కంప్లీట్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ పై ఫోకస్ చేయనున్నాడు కొరటాల. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా దేవర రిలీజ్ కానుంది.
ఇప్పటి వరకు దేవర ఒక్కటే పార్ట్ అనుకున్నారు. తాజాగా కొరటాల బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. మరిచిపోయిన కోస్టల్ ఏరియాలో దేవర వేట మామూలుగా ఉండదని.. దేవర కథను ఒక్క సినిమాతో చెప్పలేనని.. అందుకే దేవర 2 కూడా ప్లాన్ చేస్తున్నామని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఏప్రిల్ 5న రాబోయేది జస్ట్ దేవర బిగినింగ్ మాత్రమేనని చెప్పాడు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే.. ఎన్టీఆర్ రెండు భాగాలుగా చేస్తున్న ఫస్ట్ సినిమా దేవర కానుంది. పైగా ఇది చాలా పెద్ద సినిమా అని, పెద్ద కథ అని మరోసారి బల్లగుద్ది మరీ చెప్పాడు కొరటాల. కథలో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు.. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. మరి రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్న దేవర.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.