మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉన్నారు. ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించిన చరణ్.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే అయ్యప్ప దీక్షను పూర్తి చేశారు. ఇక ఈ ఆలయ సందర్శన అనంతరం టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనిని కలుసుకున్నాడు చరణ్.
Ram Charan met Dhoni: ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్‌తో కలిసి గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. అయితే సినిమాలు పక్కన పెడితే.. బయట మాత్రం చాలా సింపుల్‌గా కనిపిస్తాడు చరణ్. అలాగే అయ్యప్ప స్వామికి పెద్ద భక్తుడు రామ్ చరణ్. ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసి దీక్షను తీసుకుంటుంటాడు. ఈ ఏడాది కూడా చరణ్ అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. ఈ దీక్షను ముంబైలో సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు. ఇక ఆ తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనిని కలుసుకున్నాడు చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అంతకంటే ముందు.. ధోని స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారింది. ఇప్పుడు ఇదే లుక్‌లో రామ్ చరణ్ కలిసి ఫోటోలకు ఫోజిచ్చాడు ధోని. దీంతో ఈ క్రేజీ ఫ్రేమ్ క్షణాల్లో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయిపోయింది. దీంతో ఈ ఇద్దరు కలిసింది సినిమా కోసమా? అనే చర్చ మొదలైంది. ఎదుకంటే.. ఇప్పటికే ధోని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి.. కొన్ని సినిమాలను నిర్మిస్తున్నాడు. దీంతో ధోని నిర్మాణంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడా? అనే డౌట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఈ క్రేజీ కాంబో వర్కౌట్ అయితే.. పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలైపోతుంది. కానీ ఈ ఇద్దరు కలిసింది ఓ యాడ్ కోసం అని తెలుస్తోంది. గతంలో కూడా చరణ్, ధోని కలిసి ఓ యాడ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ లాంగ్ గ్యాప్ తర్వాత కమర్షియల్ యాడ్ చేయబోతున్నారు.