బాలయ్య- అనిల్ రావిపూడి మూవీలో విలన్‌గా అర్జున్ రామ్‌పాల్ నటిస్తున్నాడు. ఇటీవల బాలీవుడ్ నటులు చేసిన మూవీస్ ఆడలేదు. దీంతో బాలయ్య మూవీపై అభిమానులు కంగారు పడుతున్నారు.
Balayya:బాలీవుడ్ విలన్లు అంటేనే.. ఇప్పుడు టాలీవుడ్ ఆడియెన్స్ కాస్త భయపడిపోతున్నారు. రీసెంట్‌గానే బాలయ్య కొత్త సినిమా కోసం ఓ బాలీవుడ్ విలన్‌ను తీసుకున్నారు. ఇదే ఇప్పుడు అభిమానులను కాస్త టెన్షన్ పెడుతోంది. మళ్లీ బాలీవుడ్ విలన్నే చూడాలా? అని అంటున్నారు.
మనకు బాలీవుడ్ విలన్లు కొత్త కాదు. తెలుగులో వాళ్లు మాట్లాడే యాస, భాష భలే కామెడీగా ఉంటాయి. ఒక్కోసారి అవి వర్కౌట్ అయితే అదిరిపోతుంది.. లేదంటే తేలిపోతుంది. అయితే ఇప్పుడు మరో విలన్‌తో కామెడీ చేయించేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (anil ravipudi). సంక్రాంతికి వీర సింహారెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపిన నందమూరి నట సింహం బాలయ్య.. ప్రస్తుతం ఎన్బీకె 108 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీలో.. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీలీల మరో స్పెషల్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమా పై నందమూరి అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. అటు అనిల్ రావిపూడి ఫన్ టైమింగ్, ఇటు బాలయ్య మార్క్ కామెడీ అంతకుమించి అనేలా ఉండబోతోంది.
రీసెంట్గా ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్‌ని (Arjun Rampal) రంగంలోకి దించారు. కానీ ఇటీవల వచ్చిన ఏజెంట్ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ డినో మోరియా నటించాడు. ఈ సినిమా పోయింది. ఇక పోయిన వారం వచ్చిన రామబాణంలోను తరుణ్ అరోరా నటించాడు. ఈ సినిమా కూడా అలరించలేకపోయింది. బాలీవుడ్ క్రేజ్‌తో వాళ్లను అరకొర భాషతో రొటీన్‌గానే చూపించారు. ఇక ఇప్పుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) ఏం చేస్తాడని కాస్త టెన్షన్ పడుతున్నారు అభిమానులు. కానీ అనిల్ రావిపూడి (anil ravipudi) సినిమాల్లోని క్యారెక్టర్ల కామెడీ టైమింగ్ వేరేలా ఉంటుంది. అందుకే ఎన్బీకె 108లో విలన్ రోల్ అదిరిపోతుందనే చెప్పాలి. మరి అనిల్ రావిపూడి ఏం చేస్తాడో చూడాలి.