Mahesh: ఊ అంటే, ఆ అంటే వెకేషన్స్‌కు వెళ్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh). సినిమాల షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి మరీ.. ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌కు వెళ్తుంటాడు. ఇటీవలె ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్‌ను ఆపేసి విదేశాలకు చెక్కేశాడు. అసలు మహేష్ (Mahesh) వెకేషన్ లెక్క ప్రకారం చూస్తే.. సంవత్సరంలో నాలుగో వంతు ఫారిన్లోనే ఉంటాడని చెప్పొచ్చు. మహేష్ ఎందుకు వెకేషన్‌కు అంత ఇంపార్టెంట్ ఇస్తాడనే టాప్ సీక్రెట్స్ ఇప్పుడు బయటపడ్డాయని అంటున్నారు.
ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్ (Mahesh). ఇప్పటికే ఈ సినిమా చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను.. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా డిలే అయిపోయింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మహేష్ (Mahesh) వల్ల ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ఇటివలే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెకేషన్‌కు వెళ్లిపోయాడు మహేష్(Mahesh) . భార్య నమ్రత, పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు.
మహేష్ బాబు (Mahesh) తరచూ వెకేషన్స్‌కు ఎందుకు వెళుతున్నాడు? ఇక్కడ వందల కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్న మేకర్స్ వెయిట్ చేస్తున్నా.. మహేష్ (Mahesh) ఎందుకు ఇలా చేస్తున్నాడనే విషయంలో ఇప్పుడో షాకింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. ఇప్పటికీ మహేష్ (Mahesh) పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తుంటాడు. అసలు రోజు రోజుకి మహేష్ (Mahesh) ఏజ్ పెరుగుతుందా? లేదా తగ్గుతుందా? అనేది అర్థం కావడం లేదు. మరి మహేష్ తన గ్లామర్ మెయింటనెన్స్ కోసం ఏం చేస్తున్నాడు? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. మహేష్ బాబు (Mahesh) వెకేషన్స్ వెనక టాప్ సీక్రెట్ ఇదే అంటున్నారు.
ఇన్సైడ్ టాక్ ప్రకారం.. స్పెయిన్, దుబాయ్ వంటి దేశాలలో కొన్ని సహజ చికిత్సల కోసమే మహేష్ నెలల పాటు ఉంటున్నాడట. ఇప్పటికీ యవ్వనంగా కనిపించేందుకు కొన్ని ప్రత్యేక చికిత్స చేయించుకున్నాడట. ప్రస్తుతం మహేష్ (Mahesh) స్పెయిన్‌లో మానసిక, ఫిజికల్ ట్రైనింగ్‌లో ఉన్నాడట. అందుకోసమే స్పెయిన్‌కు మే 15 ఉంటాడని తెలుస్తోంది. తిరిగి వచ్చాక ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్లో జాయిన్ అవనున్నాడు.