Baby Movie: రష్మిక చేతుల మీదుగా ‘బేబీ’ లిరికల్ సాంగ్ రిలీజ్!
బేబీ చిత్రం (Baby Movie) నుంచి లిరికల్ సాంగ్ (Lyrical Song)ను స్టార్ హీరోయిన్ రష్మిక (Rasmika) రిలీజ్ చేశారు. ప్రేమిస్తున్నా అనే ఈ లిరికల్ వీడియో సాంగ్(Lyrical Video Song) అందర్నీ ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం బేబీ(Baby Movie). ఈ మూవీతో వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) కథనాయికగా బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తోంది. బేబీ మూవీలో విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. నిర్మాత ఎస్కే ఎన్ ఈ మూవీని రూపొందించారు. బేబీ మూవీకి సాయిరాజేష్ నీలం దర్శకత్వం వహిస్తున్నారు.
‘బేబీ’ లిరికల్ సాంగ్:
తాజాగా బేబీ చిత్రం (Baby Movie) నుంచి లిరికల్ సాంగ్ (Lyrical Song)ను స్టార్ హీరోయిన్ రష్మిక (Rasmika) రిలీజ్ చేశారు. ప్రేమిస్తున్నా అనే ఈ లిరికల్ వీడియో సాంగ్(Lyrical Video Song) అందర్నీ ఆకట్టుకుంటోంది. ఓ ప్రేమికుడు తన ప్రేమను ప్రేయసికి వ్యక్తపరిచే సందర్భంలోంచి ఈ పాట సాగుతుంది.
‘ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా.. నీ ప్రేమలో జీవిస్తున్నా’ అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకులు ముగ్ధులవుతున్నారు. విజయ్ బుల్గనిన్(Vijay Bulganin) బేబీ సినిమా(Baby Movie)కు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ పాటకి సురేశ్ బానిశెట్టి సాహిత్యాన్ని అందించారు. సింగర్ రోహిత్ పాడిన ఈ పాట ముఖ్యంగా యూత్ కు బాగా దగ్గరయ్యేలా కనిపిస్తోంది. బేబీ మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో నడిచే కథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించనుంది.