మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల జూన్ 26కు వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న నిర్మాత SKN ఈ విషయాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.