ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ షూటింగ్ నత్తనడకన సాగుతోంది. సినిమా ప్రకటించి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ 40% మాత్రమే పూర్తవ్వడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. క్వాలిటీ విషయంలో నీల్ రాజీ పడకపోవడమే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది. దీంతో 2026 విడుదల కష్టమేనని, 2027 వేసవిలోనే సినిమా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.