‘కేడీ: ది డెవిల్’ మూవీలోని ‘సర్కే చునార్ తేరీ’ పాట వివాదంపై దర్శకుడు ప్రేమ్ స్పందించాడు. తనకు హిందీ లిరిక్స్ తెలియదని, కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే రాశానని క్లారిటీ ఇచ్చాడు. యుద్ధం, గ్యాస్ కొరత వంటి ముఖ్యమైన సమస్యలపై చర్చించాలి కానీ, పాటలను వివాదం చేయొద్దని కోరాడు. ఇది కేవలం సరదాగా ఉండే పార్టీ సాంగ్ అని.. ఉద్దేశపూర్వకంగా ఎవరినీ నొప్పించలేదని తెలిపాడు.