W.G: భీమవరంలో గ్యాస్ కొరత వేధిస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇంధన కొరత లేదని కలెక్టర్ ప్రకటించినప్పటికీ, పలు గ్యాస్ ఏజెన్సీలు నో స్టాక్ బోర్డులు పెడుతుండటంపై వారు మండిపడుతున్నారు. దీనివల్ల నిత్యావసరాలకు ఇబ్బంది ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కృత్రిమ కొరత సృష్టిస్తున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.