Adipurush: ఆదిపురుష్ టీమ్ కి ఏపీ ప్రభుత్వం మద్దతు..!
ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఆదిపురుష్ చిత్రం రేపు విడుదలవుతోంది. ఈలోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి మద్దతుగా వస్తున్న సినిమాకు మరింత ఊపునిచ్చింది. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో టిక్కెట్ ధరలను రూ.50 పెంచేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ప్రభాస్ ఆదిపురుష్(adipurush)మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రావడానికి సర్వం సిద్ధమైంది. ఆదిపురుషుడి అవతారంలో ప్రభాస్‌ను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఇప్పటికే ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. కాగా, ఈ మూవీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీకి టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చేసింది. ఏవైనా పెద్ద సినిమాలు విడుదల సమయంలో టికెట్ ధరలు పెంచుకోవాలా, వద్దా అనే విషయం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే ఉంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరగా, వారు అనుమతి ఇచ్చారు.
ప్రస్తుత టికెట్ ధరలపై రూ.50 వరకు పెంచుకోవడానికి థియేటర్లకు ప్రభుత్వం అనుమతి(permission) ఇచ్చింది. ఈ పెంపు సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పాటు మల్టీప్లెక్సులకు కూడా వర్తిస్తుందట. ఈ మేరకు జీవో కూడా విడుదల చేశారు. సినిమా విడుదల తేదీ జూన్ 16 నుంచి దాదాపు పది రోజుల పాటు, ఈ పెంచిన ధరలే వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. నేటి నుంచి ప్రీ బుక్సింగ్ కూడా మొదలయ్యే అవకాశం ఉంది.