మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో అనిమల్ విలన్ ఢీ కొడుతున్నాడా? అంటే, ఔననే వినిపిస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా విలన్‌గా దూసుకుపోతున్న బాబీ డియోల్.. రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. దసరా సీజన్‌కు అటు ఇటుగా ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్లో గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. ఇక ఈ సినిమా షూటింగ్‌కు వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. నెక్స్ట్ ఆర్సీ 16 షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు చరణ్. ఇప్పటికే ఆర్సీ 16 ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు బుచ్చిబాబు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా జాన్వీకపూర్ నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహ్మాన్ ఫైనల్ అయ్యాడు. ఇక ఇప్పుడు మరో కీలక పాత్ర కోసం అనిమల్ విలన్‌ను రంగంలోకి దింపుతున్నారట.
ఆర్సీ 16 సెకండ్ హాఫ్‌లో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుందట. అదుకోసం బాబీ డియోల్‌ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ సినిమాలో అబ్రార్ పాత్రలో విలన్‌గా నటించి మెప్పించాడు బాబీ డియోల్. రణబీర్ కపూర్‌కి ఎంత పేరొచ్చిందో అంతకన్నా ఎక్కువ పేరు కేవలం పది-పదిహేను నిమిషాల క్యారెక్టర్‌తోనే బాబీ డియోల్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత సూర్య ‘కంగువ’లో విలన్‌గా నటిస్తున్నాడు బాబీడియోల్. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో కీ రోల్ అంటున్నారంటే.. విలన్ క్యారెక్టర్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. మరి చరణ్, అబ్రార్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.