దాస్ కా ధమ్కీ సినిమా తర్వాత మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుంచి వస్తున్న సినిమా గామి. విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్‌గా వస్తున్న ఈ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా గామి ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.
Gami: విద్యాధర్ కాగిత దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గామి’. వి సెల్యులాయిడ్ పతాకంపై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో శంకర్ అనే అఘోరా పాత్రలో కనిపించనున్నాడు విశ్వక్ సేన్. గత మూడు నాలుగెళ్లుగా సెట్స్ పై ఉన్న ఈ సినిమా.. ఎట్టకేలకు మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విశ్వక్ సరసన చాందిని చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన గామి ఫస్ట్ లుక్, టీజర్ సినిమా పై అంచనాలు పెంచేలా ఉన్నాయి.
ఇక ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచెలా ట్రైలర్ రాబోతోంది. ఫిబ్రవరి 29న ట్రైలర్ లాంచ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే గామి ట్రైలర్‌ను సరికొత్త ఫార్మాట్లో రిలీజ్ చేయనున్నారు. గామి షోరీల్ ట్రైలర్.. పీసీఎక్స్ ఫార్మాట్లో విడుదల అవుతోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రసాద్స్‌లోని పీసీఎక్స్ స్క్రీన్‌లో ఫిబ్రవరి 29న సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ లాంచ్ చేస్తున్నామని ప్రకటించారు. దీంతో.. పీసీఎక్స్ ఫార్మాట్లో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి ట్రైలర్‌గా గామి నిలవనుంది.
ఇక ఈ ట్రైలర్ రిలీజ్‌తో గామి హైప్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిపోవడం ఖాయం. ఎందుకంటే.. గామి కోసం విశ్వక్ చాలా రిస్క్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రకారం.. గామి ఓ విజువల్ వండర్‌గా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ట్రైలర్ బయిటికి వస్తే.. గామి హైప్ మరింత పెరగడం గ్యారెంటీ. ఏదేమైనా.. గామి సినిమాతో విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ హిట్ కొట్టబోతున్నట్టుగానే కనిపిస్తోంది.