అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ ఏజెంట్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది.
Agent Movie: అక్కినేని యంగ్ హీరో అఖిల్(Akhil) నటించిన లేటేస్ట్ మూవీ ఏజెంట్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఏజెంట్(Agent) మూవీలో అఖిల్ ఫుల్ యాక్షన్ హీరోగా కనిపించాడు. భారీ అంచనాలతో విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ, యాక్షన్ హీరోగా అఖిల్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. నిజానికి అక్కినేని ఫ్యాన్స్ మాత్రం సినిమాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా(Social media)లో ట్రోలింగ్(Troll) కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కినేని అమల(Akkineni Amala) వాటిపై స్పందించారు. అమల అభిమానులకు ఓపెన్ లెటర్ రాసినట్లుగా తెలుస్తోంది. ఏజెంట్ సినిమా చూసిన అమల తన అభిప్రాయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు.
ఇన్సెక్యూరిటీస్(In security) వల్లే ఇలాంటి నెగెటివ్ ట్రోలింగ్ వస్తుంటుంది.. అవి కూడా విజయానికి దోహదపడతాయి.. నిన్న ఏజెంట్ మూవీని చూశాను. నిజంగానే నేను ఎంజాయ్ చేశాను.. దాంట్లోనూ కొన్ని తప్పులున్నాయి.. ఓపెన్ మైండ్‌తో సినిమాను చూస్తే కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.. నేను వెళ్లిన హాల్ మొత్తం నిండింది.. లేడీస్, తల్లులు, గ్రాండ్ మదర్స్(Grand Mother) ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.. యాక్షన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు ఎంతగానో ఎంజాయ్ చేశారు.. ఇక నెక్ట్స్ సినిమా మరింత పెద్దగా, బెటర్‌గా ఉండబోతోందని కచ్చితంగా చెబుతున్నాను అని అంటూ అమల చెప్పుకొచ్చింది. ఇక కలెక్షన్ల విషయానికొస్తే.. ఏజెంట్ సినిమా తొలి రోజు అన్ని భాషల్లో కలిపి ఇప్పటివరకు దాదాపు రూ. 7 కోట్లు రాబట్టింది. ఈ మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య(Sakshi Vydhya) కథానాయికగా నటించింది.