Amala Akkineni: సమంతపై అక్కినేని అమల షాకింగ్ కామెంట్స్!
నాగ చైతన్య, సమంత ఎప్పుడు హాట్ టాపికే. ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఈ ఇద్దరు విడిపోయి చాలా రోజులే అవుతోంది. అయినా కూడా సమయం వచ్చినప్పుడల్లా.. ఇద్దరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నారు. అయితే ఈ మధ్యే కాస్త పుకార్లు తగ్గాయి. కానీ తాజాగా సమంత, చైతన్య విడాకులపై అక్కినేని అమల షాకింగ్ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
విడాకుల తర్వాత సమంత(Samantha), నాగ చైతన్య(Naga chaitanya) మానసికంగా బాగా డిస్టర్బ్ అయినట్టు జోరుగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా సమంత ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత మయో సైటిస్ అనే అరుదైన వ్యాధితో కొన్నాళ్లు బాధపడింది. ఇప్పటికీ అమ్మడు ఇంకా పూర్తిగా కోలుకోలేదనే చెప్పాలి. అయినా వరుస సినిమాలతో దూసుకుపోతోంది అమ్మడు. ‘యశోద’ సినిమాతో ఓకె అనిపించుకున్న సామ్.. ఇటీవల వచ్చిన ‘శాకుంతలం’ సినిమాతో డిసప్పాయింట్ చేసిది. సామ్ కెరీర్లోనే ఈ సినిమా దారుణమైన ఫ్లాప్‌గా నిలిచింది.
ప్రస్తుతం బాలీవుడ్లో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమా చేస్తోంది. ఇక నాగ చైతన్య కూడా వరుస ఫ్లాపుల్లోనే ఉన్నాడు. థాంక్యూ, లాల్ సింగ్ చడ్డాతో పాటు.. రీసెంట్గా వచ్చిన ‘కస్టడీ’తోను సక్సెస్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ధూత అనే వెబ్ సిరీస్‌తో పాటు.. చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇలా ఈ ఇద్దరు తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో రీసెంట్గా అక్కినేని అమల(Amala Akkineni) ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో సమంత, నాగ చైతన్య పై వచ్చే నెగటివ్ కామెంట్స్ పై స్పందించింది అమల. ‘సెలబ్రిటీస్ జీవితం అన్నాక.. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం కామన్. దాన్ని మనం మార్చలేము.. అని చెప్పుకొచ్చింది. అలాగే సమంత మరియు నాగ చైతన్య విడాకులేమి సీక్రెట్‌గా జరగలేదు.. పబ్లిక్‌గానే జరిగింది. కాబట్టి నెటిజెన్స్ అభిప్రాయాలను స్వీకరించడం కూడా ఓ బాధ్యతేనని..’ అంటూ కామెంట్స్ చేసింది. ఈ లెక్కన సామ్, చైతూ పై వస్తున్న పుకార్లు కామన్ అని.. చెప్పేసింది అమల(Amala Akkineni) .