ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన బన్నీకి.. సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందుకే బన్నీ ఎలాంటి పోస్టులు చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా బన్నీ తన కూతురు అల్లు అర్హతో కలిసి చేసే అల్లరి వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఈ తండ్రీ కూతురు చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఈ ఇద్దరి సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాడు బన్నీ. నవంబర్ 21న అల్లు అర్హ 6వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా తన గారాల పట్టికి ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెష్ చెప్పాడు బన్నీ. అలాగే ఓ క్యూట్ వీడియోను కూడా పోస్టు చేశారు. అందులో కందిరీగలు కుడుతున్నాయ్ అంటూ.. అల్లు అర్హ మాట్లాడిన మాటలు చాలా క్యూట్‌గా ఉన్నాయి. అల్లు అర్జున్ కందిరీగలకు భయపడవద్దని చెబుతుంటే, అర్హ కందిరీగలు జుట్టులోకి వెళ్లి పోతున్నాయని, కుడుతున్నాయని చెప్పింది. ప్రస్తుతం అర్హ అల్లరి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి అర్హకు బర్త్ డే విషెష్ చెబుతున్నారు నెటిజన్స్. ఇకపోతే.. అల్లు అర్హ, సమంత నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’ సినిమాలో భరతుడి పాత్రలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు అల్లు అర్జున్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవనున్నాడు బన్నీ. ఏదేమైనా అర్హ వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతునే ఉన్నాయి.